స్వయంకృషి చెక్కిన శిల్పం - ఆర్టిస్ట్ చిత్ర
భావరాజు పద్మిని
కళ అనేది జీవితాన్ని ప్రతిబింబించాలి. కళ మానవ సంబంధాల్లోని సున్నితమైన భావోద్వేగాలను, సమస్యలను ఎత్తి చూపాలి. అలా ఉండాలంటే, ఆ కళాకారుడు వాస్తవ జీవితంలో అనేక పార్శ్వాలను అనుభూతి చెంది ఉండాలి. ‘కష్టే ఫలి’ అన్న తీరుగా చిన్నతనంలో బాల కార్మికుడిగా పనిచేసి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుని, స్వయంకృషితో పైకొచ్చి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మన తెలుగు బిడ్డ – ఆర్టిస్ట్ చిత్ర గారు. ప్రస్తుతం వీధి బాలల ఉన్నతి కోసం,
నమస్కారమండి. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
నమస్కారమండి. నా అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరా చారి. పలుపత్రికలలో 'చిత్ర' పేరుతో బొమ్మలు వేయడం వలన ఆ పేరే అసలు పేరుగా మారిపోయింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడలో తేది 14-09-1962న జన్మించాను.
నమస్కారమండి. నా అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరా చారి. పలుపత్రికలలో 'చిత్ర' పేరుతో బొమ్మలు వేయడం వలన ఆ పేరే అసలు పేరుగా మారిపోయింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడలో తేది 14-09-1962న జన్మించాను.
మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మాది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కళ, అది నాకు అబ్బటం వరంగా భావిస్తున్నాను.
చిన్ననాటి నుండి గ్రామ, రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో పాల్గొంటూ అనేక బహుమతులు గెలుచుకున్నాను.
చిత్రకళ, శిల్పకళకు సంబంధించి ఎలాంటి ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చదవలేదు. మా నాన్నగారు కొప్పోజు జానయ్యే నాకు కళాత్మక గురువులు. మా ఇల్లే ఓ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలా ఉండేది.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ? ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
మాది కళాకారుల కుటుంబమే అయినా పేదరికం వలన బాలకార్మికుడిగా పనిచేసుకుంటూనే చిత్రకారునిగా,శిల్పకారునిగా ఎదిగాను. ప్రస్తుతం నా పిల్లలు కూడా ఇదే రంగంలోకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు. కూతురు పేరు 'శిల్ప' ఫైన్ ఆర్ట్స్ (BFA) పెయింటింగ్ కోర్స్ లో గోల్డ్ మెడలిస్ట్. బాబు పేరు సృజన్ కుమార్. తనుకూడా BFA చేసాడు.
హైదరాబాదు అమీర్ పేట్ లోని సత్యం సినిమాటాకీస్ భవనంపై నేను చిత్రించిన భగవద్గీతోపదేశం సన్నివేశ శిల్పాలని చూసి మహానటులు ఎన్. టి.రామారావుగారు నన్ను రామకృష్ణ సినీ స్టూడియోకు రప్పించుకొని భుజం తట్టి ప్రోత్సహించారు.ఆ మహాకళాకారుడి ప్రోత్సాహంతోనే నేను ఎన్నో సినిమాలకు ఆర్టిస్ట్ గా,శిల్పిగా పనిచేసే భాగ్యం కలిగింది.
చిత్రకళలో మీరు సృష్టించిన వైవిధ్యాలు ఏమిటి ?
కళకు సృజన తోడైనప్పుడే ఆ కళ పరిపూర్నమౌతుందని నేను నమ్ముతాను. నాదైన వైవిధ్యాన్ని, చిత్రకళలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ,ఒక ప్రత్యేకమైన శైలిగా సృష్టించుకున్నాను. ముఖ్యంగా మొనోక్రోం పెయింటింగ్స్ లో నాకు మంచి పేరుంది. ఎన్నో దశాబ్దాల పాటు శిల్పానికి, ఆయిల్ పెయింటింగ్ కు, వాటర్ కలర్స్ కు, మ్యురల్స్ కు, కొల్లాజిలకు వాడే ముడి
పదార్ధాలతో ప్రయోగాలు చేసి కనుగొన్న విశిష్టమైన లేయర్ పెయింటింగ్ పధ్ధతి ఇది. దీనివల్ల పెయింటింగ్ ఎమ్బోస్ చేసినట్లుగా ఉంటుంది. కాని, ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఒక్క పెయింటింగ్ కు సుమారు 15 రోజులు పడుతుంది. ఆ తరహాలో నేను తయారుచేసిన మొదటి సోలో లేయర్ చిత్రప్రదర్శనని అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి నా చిత్రాలను చూసి నన్ను మెచ్చుకొని అప్పటికప్పుడు కొన్ని చిత్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించడం జరిగింది.
పదార్ధాలతో ప్రయోగాలు చేసి కనుగొన్న విశిష్టమైన లేయర్ పెయింటింగ్ పధ్ధతి ఇది. దీనివల్ల పెయింటింగ్ ఎమ్బోస్ చేసినట్లుగా ఉంటుంది. కాని, ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఒక్క పెయింటింగ్ కు సుమారు 15 రోజులు పడుతుంది. ఆ తరహాలో నేను తయారుచేసిన మొదటి సోలో లేయర్ చిత్రప్రదర్శనని అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి నా చిత్రాలను చూసి నన్ను మెచ్చుకొని అప్పటికప్పుడు కొన్ని చిత్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించడం జరిగింది.
మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
కళాకారుడిగా తొలుత నన్ను ప్రోత్సహించింది మా నాన్నగారే...! ఆ తరువాత ప్రసిద్ధ చిత్రకారులు బాపు, వడ్డాది పాపయ్య,చంద్ర,బాలి,మోహన్, చిత్త ప్రసాద్ వంటి మన కళాప్రముఖులతో పాటు ఎం.ఎఫ్.హుస్సేన్,పికాసో,మైకే లాంజిలో ,వ్యాన్గో వంటి అంతర్జాతీయ చిత్రకారుల చిత్రాలు నాకు ప్రేరణగా నిలిచాయి.
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
వివిధారంగాలలో పేరుప్రతిష్టలు సంపాదించుకున్న ప్రముఖుల చిత్రాలను చిత్రించడంతోపాటు వారి జీవితచరిత్రలను కూడా చదవడం వల్ల సాహిత్యాభిలాష తోడైంది.దాంతో సమాజాన్ని చదవడం,వర్తమాన సామాజిక స్థితిగతులపై స్పందించడం ఒక చరిత్రకారుడిగా నా బాధ్యత అని తెలుసుకున్నాను.
ముఖ్యంగా బాలకార్మికుల దుస్థితిపై వందకు పైగా చిత్రాలు వేసి పలుచోట్ల వీధుల్లో ప్రదర్శించినాను. బాలకార్మికుడిగా నేను జీవితంలో అనేక చీకటి కోణాలను చూసాను. ఉదయం పూట చెక్కపని చేస్తూ రాత్రి బొమ్మలు గీసి, శిల్పాలు చెక్కేవాడిని. బాలల్లో సృజన విరబుయ్యాల్సిన వయసులో ఆ సృజన ఫ్యాక్టరీలలో, కర్మాగారాలలో కాలిపోయే దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అందుకే ఈ అంశంపై ప్రత్యేక చిత్రాలు వేసి ప్రదర్శిస్తున్నాను. ఆ ప్రదర్శనలకు వచ్చినవారిలో ఏ ఒక్కరైనా ఒక్క పేద బాలుడికి ఓ పూట అన్నం పెట్టినా, నా కృషి ఫలించినట్లుగా భావిస్తాను.
అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులపై ప్రజలకు,ప్రభుత్వాలకు జరుగుతున్న ఘోరాలు ఆపమనీ, ఆదుకోమని అవగాహణ కల్పించే ఎన్నో చిత్రాలను వేసి వీధులలో ప్రదర్శించినాను. ఒక చిత్రకారుడిగా ప్రజలమధ్య నన్ను నిలపడానికి ఈ తరహా చిత్రాలు ఎంతగానో తోడ్పడ్డాయి.
నేను రూపొందించిన చిత్ర,శిల్ప కళాఖండాలు తెలుగు రాష్ట్రాల వారితో పాటు అమెరికా, లండన్,ఆస్ట్రేలియా వంటి తదితర విదేశీయులు సైతం కొనుగోలు చేసి ప్రోత్సహించారు. ఇదంతా నాకు చాలా తృప్తిని ఇచ్చింది.
సమాజ స్పృహ కలిగిన కళాకారులకు ప్రజలు, ప్రభుత్వాలు మేము రూపొందించిన కళాఖండాలు కొనుగోలు చేస్తూ మమ్మల్ని ఆర్ధికంగా నిలబడడానికి సహకరించినట్లు అయితే ..! సమాజానికి మేలు చేసే,భావితరాలకు మార్గదర్శకంగా నిలిచే మరెన్నో కళాఖండాలు పుట్టుకొస్తాయి అనడంలో సందేహం లేదు.
నా ఆర్ట్ స్థూడియో
5-5-35/332/187/B,AVB Puram
మెట్రో వెనుక,కూకట్ పల్లి, హైదరాబాద్-500082
మొబైల్:+91 9866686086,8885671635
ఈమెయిల్:chitra.artmedia@gmail.com
No comments:
Post a Comment