ముందడుగు వెయ్యవలసింది మనమే
రఘోత్తం రెడ్డి పిన్నింటి
మంత్రిగారొ ఎం ఎల్ ఏ గారి పైరవీ తో బయలుదేరే మనం
పరమాత్ముడి కళ్లకే గంతలు కట్టి వరాలు కొట్టేయాలని చూస్తున్నాం
సమాజం నుండి మనలని వేరుచేసుకుని తప్పించుకుంటూ
మన కంటే పెద్ద అవినీతి పరుణ్ణి ప్రమాణం గా చేసుకొని మనం చేసే
అవినీతి పనులు అసలు లెక్కలోకి రానే రావన్నభ్రమల్లో బతికేస్తున్నాం
మమ్మీ డాడీలను ఉగ్గు పాలతో పట్టిస్తూ అవసరం లేని ఆంగ్లాన్ని
అందలం ఎక్కిస్తూ, అడుగడుగునా పాచ్యాత్తపు పద్ధతుల్లో పెంచేస్తూ
సంస్కారాలు లేకుండా పెరుగుతున్నారని తెగ బాదపడిపోతున్నాం
అవసరమైన దానికన్నా ఎక్కువైన ఏదయినా ఎదో చెడు చేస్తుంది
పిల్లలపైన ప్రేమైనా, కూడబెట్టిన డబ్బులైనా, దోచుకున్న ఆస్తులైనా
అందుకే నోట్లకట్టల్లో మునిగిపోయి మనల్ని మనమే వెతుకుంటున్నాం
చూసుకోవడం కష్టం అవుతుందని అమ్మ నాన్నలను, అత్తా మామలను
వదిలేసి, బంధాలను ఎలా తెంచుకోవాలో అనుక్షణం నేర్పిస్తూ
మమ్మల్ని ప్రేమగా చూసుకొమ్మని పిల్లలని కోరుకుంటున్నాం
అవినీతి అయినా
అరాచక మయినా
అడుగంటిన మానవతా విలువలైనా
మనం నాటిన విత్తనాలనుండి మొలకెత్తిన మొక్కలే
(సమాజం వేరు మనం వేరు అని ఆలోచించడం మానేద్దాం, మంచి మార్పుకి ముందడుగు వెయ్యవలసింది మనమే అని ఒప్పుకుందాం)
No comments:
Post a Comment