అజ్ఞానం
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
సరైనదనిపిస్తుంది
కళ్లు నెత్తికెక్కవు
‘నాకే అన్నీ తెలుసు’ అని మిడిసిపడం
వితండవాదం చేయం
అనుక్షణం కొత్తవి తెలుసుకోవాలన్న
జిజ్ఞాసతో ఉంటాం
క్రమశిక్షణ.. శ్రద్ధ... అంకితభావం
సహజలక్షణాలవుతాయి
ఎవరేది చెప్పినా వింటాం
ఒకరి అడుగుజాడల్లో నడవడం
నామోషీ అనుకోం
అన్నీ తెలుసని అభాసుపాలవడంకన్నా
‘నాకు తెలిసింది కొంతేన’ని
ప్రకటించుకోవడం
కొండ అద్దంలో కొంచంగా కనిపించడంలాంటి
వినమ్రతే!
***
No comments:
Post a Comment