ప్రపంచములోని కొన్ని ప్రముఖ మ్యూజియములు
అంబడిపూడి శ్యామసుందర రావు
గుంటూరు 9440235340
ఇది చరిత్రలో మ్యూజియములను కొంతమంది ప్రముఖులు, లేదా సంస్థలు లేదా కుటుంబానికి చెందిన వస్తువులను ఒక చోట చేర్చి మ్యూజియం గా ప్రారంభించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మన హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం నైజాం వంశములోని సాలార్ జంగ్ ప్రపంచములోని విలువైన అరుదైన వస్తువులనుస్వయముగా సేకరించి మ్యూజియం ను ప్రారంభించాడు ఆ ఆతరువాత ఆ మ్యూజియం ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తుంది. ఇటువంటి మ్యూజియములను ప్రపంచవ్యాప్తముగా రోజు అనేకులు సందర్శిస్తుంటారు .
అటువంటి మ్యూజియములలో కొన్నిటిని గురించి వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము .
1.స్టాక్ హోమ్ (స్వీడన్) లోని వాసా మ్యూజియమ్ :-
స్కాండినేవియాలో అత్యధికులు దర్శించే మ్యూజియమ్ ఇది. ఇక్కడి ప్రత్యేకత 1628లో ప్రయాణిస్తు సముద్రములో మునిగిన 64 ఫిరంగుల యుద్ధనౌక "వాసా"ను వెలికి తీసి భద్రపరిచారు ఆ నౌక పేరే ఆ మ్యూజియం కు ఉంచారు.
2. నేషనల్ గేలరీ లండన్ ( ఇంగ్లండ్ ):-
1824లో స్థాపించబడి దాదాపు 2000 పెయింటింగ్స్(13వ శతాబ్దమునుండి నేటివరకు సేకరించబడ్డ )కలిగి
ఉండి ప్రపంచములోని నాల్గవ పెద్ద మ్యూజియంగా పేరు పొందింది రెండవ ప్రపంచ యుద్ధము సమయములో ఈ విలువైన పెయింటింగ్స్ ను ఒక క్వారీ (గని)లో భద్రపరిచి ఆ భవనాన్ని సంగీత కచేరీలుకు వాడెవారు.
3. నేషనల్ సెకండ్ వరల్డ్ వార్ మ్యూజియమ్ న్యూ ఆర్లియన్స్ (యు.ఎస్.ఏ) :-
రెండవ ప్రపంచ యుద్ధ కాలములో నార్మాండి యుద్ధము నాటి అమెరికనుల అనుభవాలకు గుర్తుగా ఈ మ్యూజియం నిర్మించబడింది .
4. యాద్ వాషెమ్ హోలోకాస్ట్ మ్యూజియమ్ ,జెరూసలేం (ఇజ్రాయిల్ ):-
ఇది ఒక స్మారక చిహ్నము యూదుల మారణహోమము జరిగేటప్పుడుప్రాణాలకు తెగించి వారిని కాపాడిన యూదులు కానివారి జ్ఞాపకార్ధము ఇజ్రాయెల్ ప్రభుత్వము ఏర్పాటు చేసినది. ఈ మ్యూజియంలో మారణహోమములోని బాధిత యూదులువారి రక్షణకు తోడ్పడిన యూదులు కాని వారి గురించి ప్రశంసా పత్రాలతో పాటు బాధిత యూదులు 1933-1945 మధ్య కాలములో నాజీల దురాగతాలను చిత్రీకరించిన ఫైటింగ్స్ కూడా ప్రదర్శనకు ఉంచారు.
5.ఎక్రోపోలీస్ మ్యూజియం ఏథెన్స్ (గ్రీస్ ):-
రోమన్ కాలము నాటి కాళాకృతులను ఉంచటానికి పురావస్తు ప్రాముఖ్యత కలిగిన బైజాన్తీన్ ఏథెన్స్ ప్రాంతములోని మాక్రి జియాన్ని ప్రాంతములో గల శిధిలాల మధ్య ఈ మ్యూజియం నిర్మించబడింది పురాతన రోమన్ సంస్కృతి కి దర్పణముగా ఈ మ్యూజియమ్ ను అభివృద్ధి చేశారు.
6. ఎకాడమియా గేలరీ ఫ్లారెన్స్ (ఇటలీ ):-
ఈ గేలరీలో ప్రముఖ శిల్పి మైఖేల్ ఏంజెలో బాగా ప్రాచుర్యము పొందిన శిల్పాలు ఉన్నాయి ఇంకా యాండ్రియా డెల్ సార్ తో ,డొమెనికో గిర్లాండో ,పాలో ఉక్సేల్లో వంటి శిల్పుల కళాఖండాలుకూడా ఉన్నాయి.
7.ద గెట్టి సెంటర్ లాసేంజెల్స్ (యూ ఎస్.ఏ):-
ఈ మ్యూజియం లాసేంజిల్స్ కొండలపైన ఉంది ఇది 44,000 కళా ఖండాలకు నెలవు. గ్రీకు రోమన్ల కాలము నుండి నేటి కాలము వరకు కళాకృతులు ఈ మ్యూజియం లో ఉన్నాయి.
8.స్టేట్ హెర్మిటేజ్ మ్యూజియం సెయింట్ పీటర్స్ బర్గ్ రష్యా.:-
ఇది ప్రపంచములోని పెద్దది పురాతనమైన మ్యూజియంల లో ఒకటి. హెర్మిటేజ్ అనేది రష్యన్ చక్రవర్తుల శీతాకాలపు విడిది దీనిలో పురాతనమైన కళాకృతులు,ఈజిప్షియన్ పురాతన కళాఖండాలు,రాజుల కాలము నాటి నగానట్రా ముఖ్యముగా ఎక్కువ భాగము రష్యాకు ఐరోపా కు చెందిన చారిత్రాత్మక వస్తువులు అనేకము ఈ మ్యూజియం లో భద్రపరచబడి ఉన్నాయి.
9. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆంత్రోపాలజి - మెక్సికో నగరము -మెక్సికో :-
ఇది మెక్సికో దేశములో ఎక్కువ సందర్శకులను ఆకర్షించే మ్యూజియం దీనిలో ఆంత్రోపాలజీ శాస్త్రానికి పురావస్తు
పరిశోధనా శాస్త్రానికి సంబంధించిన కళాకృతులు ఉన్నాయి ఇవి ఎక్కువ భాగము మెక్సికో లోని కొలంబియన్ యుగానికి చెందినవి వీటిలో ప్రసిద్ధిచెందినది "అజ్టెక్ క్యాలండర్ స్టోన్ '
పరిశోధనా శాస్త్రానికి సంబంధించిన కళాకృతులు ఉన్నాయి ఇవి ఎక్కువ భాగము మెక్సికో లోని కొలంబియన్ యుగానికి చెందినవి వీటిలో ప్రసిద్ధిచెందినది "అజ్టెక్ క్యాలండర్ స్టోన్ '
10. ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగో -చికాగో ,యు ఎస్ ఏ :-
కళాభిమానులు తప్పనిసరిగా దర్శించవలసిన మ్యూజియంలలో ఇది ఒకటి ఎందుకంటే ఈ మ్యూజియంను ట్రిప్ అడ్వైజర్ అనే సంస్థ ప్రపంచములోనే అత్యుత్తమ మ్యూజియం గా పేర్కొన్నది. దీనిలో 260,000 కళాఖండాలు దాదాపు 5,000 సంవత్సరాలనుండి ఉన్నాయి. ప్రముఖ కళాకారులైన రెనాయిర్, మాటిస్సే ,లాట్రీక్ మొదలైనవారు చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మ్యూజియం ను చూడటానికి పూర్తిగా ఒకరోజు పడుతుంది.
11. థ గోల్డ్ మ్యూజియం -బొగొటా -కొలంబియా :-
ఇందులో 55,000వేల ప్రి కొలంబియన్ కాలానికి చెందిన బంగారు నగలు ప్రదర్శనకు ఉంచబడ్డాయి.
12. మ్యూజియం అఫ్ న్యూజిలాండ్ - వెల్లింగ్టన్ :-
"టె పాపా టోంగా రెవా"అని కూడా పిలుస్తారు ఈ మ్యూజియంలో విభిన్నమైన మొక్కల జంతువుల శిలాజాలు భద్రపరచబడి ఉన్నాయి వీటితో పాటు అక్కడి ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు చిత్రపటాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
13,సెంట్రో డి ఆర్టే కాంటెంపోరానియా ఇంహోటీమ్ - బృమాడింహో -బ్రెజిల్ :-
1980లో బెర్నార్డో పాజ్ అనే భూస్వామి తన వ్యవసాయ క్షేత్రము చుట్టూ గల ప్రాంతాన్నిరియల్ ఎస్టేట్ వ్యాపారులు నాశనము చేసే తలంపులో ఉన్నప్పుడు 5000 ఎకరాలను వాళ్లకు దక్కకుండా కొని ఆ భూమిని బొటానికల్ గార్డెన్స్ గా అభివృద్ధి చేశాడు ఆ తరువాత బ్రెజిల్ లోని కళాకారులను ఆహ్వానించి వారి కళాఖండాలతో ఆ ప్రదేశాన్ని నింపాడు ఆ విధముగా 2008 నాటికి ఆ బొటానికల్ గార్డెన్ పూర్తిస్థాయి మ్యూజియం గా తయారై సౌత్ అమెరికాలో ప్రముఖ మ్యూజియంగా రూపు దిద్దుకుంది.
14. కిన్ టెర్రా -కొట్టా వారియర్స్ అండ్ హార్సెస్ మ్యూజియం -జియాన్ -చైనా:-
1974లో చైనాలోని కొంతమంది రైతులు త్రవ్వుతుంటె వారికి సమాధుల సముదాయము కనిపించాయి ఆ ప్రాంతములో త్రవ్వకాలు మొదలుపెడితే వారికి 9000 టెర్రా కోటా (మెరుగులేని పింగాణీ) సైనికుల విగ్రహాలు రథాలు, గుర్రాల విగ్రహాలతో సహా దొరికినాయి అవి 230 బిసి నాటి కిన్ షీ హువాంగ్ చక్రవర్తి కాలము వాటిని ప్రస్తుతము యునెస్కోవారసత్వ సంపదగా గుర్తించింది.
15. స్మిత్ సోనియన్ ఎయిర్ అండ్ స్పెస్ మ్యూజియం- వాషింగ్టన్ డిసి- యుఎస్ఎ :-
16. మూసె డు లోవ్రి -ప్యారిస్ -ప్రాన్స్ :-
ప్రపంచములోని ప్రఖ్యాతి గాంచిన మ్యూజియంలలో ఇది ఒకటి. దీనిలో 35000 ఐటమ్స్ ఉన్నాయి.పురాతన కాలము నుండి 21వ శతాబ్దము నకుసంబంధించిన వస్తువులు ఎన్నో ప్రదర్శనకు ఇక్కడ ఉంచారు. ప్రఖ్యాతి గాంచిన
మోనాలిసా ,కోడ్ అఫ్ హమ్మురాబి ,వీనస్ డి మిలో వంటి కళా ఖండాలు ఎన్నో ఇక్కడ కొలువై ఉన్నాయి .
మోనాలిసా ,కోడ్ అఫ్ హమ్మురాబి ,వీనస్ డి మిలో వంటి కళా ఖండాలు ఎన్నో ఇక్కడ కొలువై ఉన్నాయి .
17, ఇన్స్టిట్యుటో రికార్డో బ్రేన్నాడు -రెసిఫీ -బ్రెజిల్ :-
ఈ సంస్థ లో మ్యూజియమ్ లైబ్రరీ,ఆర్ట్ గ్యాలరీ ,ఒక ఉద్యానవనం ఉంటాయి.ఇది ప్రపంచములో ఒకటైన పెద్దదైన ఆయుధాల కలెక్షన్ కలిగిన మ్యూజియమ్ .
18. బ్రిటిష్ మ్యూజియం -లండన్ -ఇంగ్లాండ్ :-
ఎనిమిది మిలియన్ల కాళాకృతులను కలిగి ఉండి సంస్కృతికి చరిత్రకు అంకితము కావించబడ్డ మ్యూజియమ్ . మానవజాతి సంస్కృతులు పురాతనకాలం నుండి నేటివరకు చెందిన మార్పులను ఈ మ్యూజియం లోని కళాఖండాల ద్వారా గమనించవచ్చు ప్రత్యేకత ఏమిటి అంటే ఈ మ్యూజియం కు ఎట్టి ప్రవేశ రుసుము లేదు ఎవరైనా ఫ్రీగా చూడవచ్చు.
19. సాలార్ జంగ్ మ్యూజియమ్-హైదరాబాద్ - ఇండియా :-
ఇది ఒకే వ్యక్తి సేకరించి హైదరాబాద్ నగరములో మూసి నది ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రపంచములోని పెద్దదైన మ్యూజియములలో ఒకటి. దీనిలో అతి పురాతనమైన వస్తువులు,చిత్రపటాలు మొదలైనవి ప్రపంచవ్యాప్తముగా సేకరించినవి ఉన్నాయి.ఏడవ నైజాం నవాబ్ ముఖ్య మంత్రి అయిన , నవాబ్ మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్ జంగ్ 3 (1889-1949) ఆయన సొంత డబ్బుతో సేకరించి ఏర్పాటు చేసిన మ్యూజియం ఇది . అయన అవివాహితుడు అవటము వల్ల పూర్తిగా పనివాళ్ళమీద ఆధార పడటము వల్ల చాలా విలువైన కళాఖండాలు ఆయనకు తెలియకుండా దొంగతనముగా బయటకు పోయినాయి 1951 లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు దీనిని ప్రారంభించి అందరికి ప్రవేశాన్ని కల్పించారు తరువాత 1968లో కొత్త భవంతిలోకి మార్చి మిగిలిన కళాఖండాలను జాగ్రత్త చేశారు ప్రస్తుతము ఈ మ్యూజియమ్ గవర్నర్ అధ్యక్షతన గల ట్రస్టీల బోర్డు అధీనములో పర్యవేక్షింపబడుతుంది. .
*****
No comments:
Post a Comment