ఉగ్గు - అచ్చంగా తెలుగు

బాల గేయాలు - 6

టేకుమళ్ళ వెంకటప్పయ్య



ఉగ్గు

ఊఁ ఊఁ ఉంగన్న, ఉగ్గుపాలు ఇందన్న. గుంటెడు ఉగ్గు కమ్మన్న, ఉమ్మక కక్కక మింగన్న. ఊఁ ఊఁ ఊఁ ఉంగన్న, లుంగలు పెట్టకు గ్రుక్కన్న. ఓర్వని సవతుల దిష్టన్న, ఒప్పుగ మసలర బుచ్చన్న.
 "ఉగ్గువెట్టరే వోయమ్మా చెయ్యొగ్గీనిదె శిశువోయమ్మా" అని అన్నమయ్య కీర్తించాడంటే ఉగ్గుకు ఆరోజుల్లో ఉన్న ప్రాధాన్యత ఎంతో మనకు అర్ధమవుతుంది. అలాంటి ఉగ్గు దూరమయి బిడ్డలను అనేక వ్యాధులకు గురిచేస్తోంది. ఉగ్గు పట్టేటప్పుడు పిల్లలు మారాం చేయకుండా రకరకాల పాటలు పాడుతూ పట్టే వారు ఆరోజుల్లో. అలాంటి గీతాల్లో ఇదీ ఒకటి. బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డుతాడు కోశాక తల్లినుంచి నేరుగా ఆహారం తీసుకునే సౌకర్యం పోయి తనకు తానుగా ఆహారం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిపాలు తాగడం అలవాటు చేసుకుంటుంది. అప్పుడే పుట్టిన లేతపొట్టకి పూర్వం విరేచనము అవడానికి ఒక చిన్ని చెంచాడు ఆముదం పట్టేవారు. ఆముదంలో తల్లిపాలు కొద్దిగా పితికి, ఐదారు సార్లు, రంగరించి పట్టేవారు. రోజుల్లోకుమ్ముటాముదమని 'చిట్టాముదమని ఆముదాలు రకరకాలుగా అమ్మేవారు. కంపెనీలు తయారు చేసిన ఆముదంకూడా బాగుండేది. చిన్నపిల్లలకు పట్టేందుకు ఈరోజుల్లో మంచి ఆముదం అమ్ముతున్నారో లేదో తెలీదు. అసలు ఉగ్గు పట్టడం తల్లులు మానేసి కొన్ని దశాబ్దాలు దాటింది. ఉగ్గు గిన్నె లు,    చిన్న చిన్న సత్తు, స్టీలు, వెండి గిన్నెలుండేవి.  అముదం మూడో ఏడు వచ్చేదాకా బిడ్డ విసర్జన క్రియని బట్టి పట్టేవారుఅలాగే ఆకుజెముడు, కాడజెముడు అనేవి రెండు మొక్కల పాలని ఐదారు చుక్కలు ఆముదంలో కలిపి రంగరించి పట్టేవారు. ఇవి కడుపుకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయి. పిల్లలకు అయినా పెద్దలకైనా వచ్చే చాలా వ్యాధులకి మూలకారణం మలవిసర్జన సరిగాలేకపోడమే అంటారు డాక్టర్లు. పాశ్చాత్య వ్యామోహంలో మనం దూరం చేసుకున్న అద్భుత విధానాలలో ఇదీ ఒకటి. నేడు ఉగ్గుపట్టడాలు లేవు, పాటలూ లేవు.
-0o0-

No comments:

Post a Comment

Pages