నీకు నేనున్నా - 7 - అచ్చంగా తెలుగు

నీకు నేనున్నా - 7

అంగులూరి అంజనీదేవి

anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com



(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు  మనోహర్. అతని అక్క  కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అది ఓర్వలేని హరి ఆమెను పొడిచేస్తాడు. వారం పాటు ఇంటికి రాని భర్తకు తనకొచ్చిన ఫోన్ సంగతి చెబుతుంది పద్మ. ఇక చదవండి.)
         కాలం చక్రంలా గిర్రున తిరిగింది.
ఆఫీసు పనిమీద హైదరాబాదు వెళ్లాడుమనోహర్.  పని పూర్తి అయ్యాక రాహుల కోసం క్రికెట్ బాలు, బ్యాటు కొన్నాడు. కౌంటర్ లో బిల్ పే చేసి వస్తుంటే దారిలో కృష్ణ కలిశాడు మనోహర్కి.:
“బావున్నావా కృష్ణా? ఎంత కాలమైంది నిన్ను చూసి! ఇప్పడేం చేస్తున్నాన్? పెళ్ళీ పిల్లలు వగైరా" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మనోహర్.
బాగున్నాను మనోహర్! పెళ్ళి అయింది. ఒకసాస ఎల్.కే.జి. చదువుతోంది. లేటుగా పుట్టింది. ఇక నీ సంగతులు చెప్ప? పద్మ ఎలావుంది?" అడిగాడు కృష్ణ.
బావుందిరా కృష్ణా! అన్నాడు మనోహర్.
“ఈ బాలు బ్యాటు ఎవరికిరా?? అడిగాడు కృష్ణ
నా కొడుకు రాహుల్ కి కృష్ణా! ఇప్పుడు టెన్త్ చదువుతున్నాడు. క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం రాహుల్ కి” అంటూ గోల్డ్ షాప్ లోకి దారితీశాడు మనోహర్. మనోహర్ కి వసంతహారం నచ్చింది.
“ఇది మధురిమకి బారుంటుందిరా కృష్ణా! మధుకోసం ఇది తీసుకొంటాను” అన్నాడు మనోహర్.
ఉలిక్కిపడి చూశాడు మనోహర్ ని కృష్ణ.
మధురిమణి నువ్వింకా మరచిపోలేదా మనోహర్? అడిగాడు ఆశ్చర్యపోతూ కృష్ణ.
తనని మరచిపోతే ఊరుకుంటుందా కృష్ణా! అన్నాడు మనోహర్.
ఊరుకోదని, నువ్విలా పిచ్చివాడిలా మధురిమ కోసం అది కొంటాను, ఇది కొంటాను అంటూ షాపుల్లో కూర్చొని కలవరిస్తుంటావా? ఇంకా ఎంతకాలం నువ్విలా ఊహల్లో విహరిస్తుంటావ్? అన్నాడు బాధగా కృష్ణ.
ఊహల్లో విహరించటమా! ఓ... నీకు తెలియదు కదూ! మధురిమ ఇప్పుడు నా భార్యరా! అన్నాడు మనోహర్.
నమ్మలేదు కృష్ణ, విచిత్రంగా ముఖం పెట్టి, వింతగా మనోహర్ వైపు చూశాడు.
మనోహర్! రోజు నువ్విలాగే వుంటావా! లేక అప్పుడప్పడు అలా వుంటావా? నిన్ను చూస్తుంటే నాకు భయంగా వుందిరా అన్నాడు కృష్ణ.
మధురిమతో తనకి పెళ్ళి అయిందన విషయం నమ్మకపోవటం చూసి నవ్వుతూ కృష్ణ భుజం తట్టాడు మనోహర్. అక్కడినుండి లేచి కౌంటర్ దగ్గర బిల్ పే  చేసి మధురిమ కోసం వసంతహారం తీసుకున్నాడు
అక్కడి నుండి వెళ్ళి బొమ్మన శారీస్ లో పద్మకి, మధురిమకి విడివిడిగా రెండు శారీస్ కొన్నాడు మనోహర్. ఈ సారి కృష్ణ మాట్లాడలేదు చూస్తున్నాడు.
కొద్దిదూరం వెళ్లి ఇద్దరు ఓ రెస్టారెంట్లో కూర్చున్నారు.
‘ మధురిమను నేను పెళ్లిచేసుకున్న మాట వాస్తవం కృష్ణా ఊహకాదు. రాహుల్ మధురిమకు పట్టాడు. పద్మకు పిల్లలు లేరు" అన్నాడు మనోహర్, ఇప్పుడు నమ్మాడు కృష్ణ కృష్ణ ముఖంలో అభినందన కన్పించింది.
మరి పద్మకెందుకు వసంతహారం కొనలేదు? "పద్మకి వసంతహారం వుంది కృష్ణా!అందుకే కొనలేదు. మధుకి మధ్యనే ఒక్కొక్కటి కొంటున్నాను" అన్నాడు మనోహర్.
మంచిపని చేస్తున్నావు మనోహర్" అన్నాడు కృష్ణ మనస్ఫూర్తిగా
సంతృప్తిగా చూశాడు మనోహర్ వృత్తిరీత్యా మనోహర్ స్టేటస్ పెరిగింది. ప్రమోషన్స్ వచ్చాయి. దానికి కారణం అతని శక్తి సామర్థ్యాలే. కృష్ణను చూస్తుంటే మనోహర్కి తనతో చదువుకున్నవాళ్లంతా గుర్తిచ్చారు. ఇప్పడు కృష్ణను చూసినట్లే వాళ్లను కూడా చూడాలని వుంది మనోహర్కి.
"కృష్ణా! మనతో చదువుకున్నవాళ్లందర్నిచూడాలని వుందిరా! వాళ్లంతాఎక్కడెక్కడ వున్నారో ఏం  చేస్తున్నారో నీకెవరైనాటచ్ లో వున్నారా?" అంటూ తనతో చదువుకున్న వాళ్లందర్ని గుర్తు చేశాడు మనోహర్ "
తలా ఓ చోట సెటిల్ అయ్యారు మనోహర్! అందరు మంచి పొజిషన్ లోనే వున్నారు. ఒక్క హరి తప్ప. అప్పుడెపుడో హరి పెళ్లిలో అందరం కలుసు కున్నాం. ఆ తర్వాత మళ్లీ కలుసుకోలేదు. రామకృష్ణ మాత్రం అప్పడప్పుడు కలుస్తుంటాడు. రామకృష్ణ ఉండేది హరి ఇంటి ప్రక్కనే, నేను కలిసినప్పుడు హరి గురించి రామకృష్ణ చెబుతుంటాడు" అన్నాడు కృష్ణ.
"హరి ఇప్పడు ఎలా వున్నాడు కృష్ణా?" అడిగాడు మనోహర్ హరిమనస్తత్వం నచ్చకపోయినా, హరి గురించి అడిగి తెలుసుకోవాలనిపించిది మనోహర్కి.
ఎలా వున్నాడంటే ఏం చెప్పాలి మనోహర్ హరి చేసుకున్నది హరికే చుట్టుకొంది" అన్నాడు కృష్ణ మారి ADO చేసుకున్నాడు కృష్ణా?"
“హరి ఏం చేస్తున్నాడు కృష్ణ?”
సుజాతతో పెద్ద గొడవ పడి అలా వెళ్లిపోయిన హరిని వాళ్ల యింట్లోవాళ్లు అతికష్టంమ్మీదవెతికి పట్టుకున్నారు. పెళ్లి చేస్తే హరి దారికి వస్తాడన్నట్లుగా ఓ సంబధం చూసి పెళ్ళి చేశారు.పెళ్ళి అయిన ఆరునెలలకే హరికి ఆడపిల్ల పుట్టింది. అన్నాడు కృష్ణ.
షాకయ్యాడు మనోహర్
అదెలా సాధ్యం కృష్ణా! అదేదో టెస్ట్ ట్యూబ్ బేబి లాగా వైద్యరంగం ఈ  విధంగా కూడా ఎదిగిందా? అన్నాడు మనోహర్.
"వైద్యరంగమా, పాడా, హరి పెళ్లాం పెళ్ళికిముందే ఎవర్నో ప్రేమించిందట.తొందరపడి గుట్టుచప్పుడు కాకుండా హరికి యిచ్చి పెళ్లి చేశారు. తెలివిగా వాళ్ల పెద్దవాళ్లు ఆడిన ఆటలో హరి బలి అయ్యాడు. అన్నాడు కృష్ణ.ఇంట్రస్ట్ గా  విన్నాడు మనోహర్. అప్పట్లో హరి ప్రవర్తన ఎలా వుండేదో గుర్తొచ్చిందిమనోహర్ కి.
"అనవసరంగా ఆడపిల్లల్ని ఏడిపించిన హరికి ఇప్పడు తగిన శాస్తి జరిగిందంటావా కృష్ణా! ఇంకా బ్యాలెన్స్ ఏమైనా వుందంటావా? అంటూ కృష్ణముఖం లోకి చోశాడు మనోహర్.
“బ్యాలెన్స్ సంగతి పైవాడు చూసుకుంటాడు కాని, మనవాడు మాత్రం
పాప పుట్టగానే హాస్పిటల్లో పెద్ద ఎత్తున హడావుడి చేశాడట".
హడావిడి దేనికి?
"నాకు పెండ్లి అయ్యి ఆరునెలలే అయింది. ఈ పాప ఎలా పుట్టింది?" అంటూ డైరెక్ట్గా వాళ్ల అత్తగారినే అడిగాడట. వాళ్ల అత్తగారి అవస్థ చూసి ఆ వూరి ఆడవాళ్లంతా హరి చుట్టూ  చేరారట" అంటూ చెప్పటం ఆపాడు కృష్ణ.
"ఆడవాళ్లంతా హరి చుట్టూ చేరి, ఆ తర్వాత ఏం జరిగింది కృష్ణా!" అంటూ కాస్త ముందుకి వంగి ఆసక్తిగా అడిగాడు మనోహర్.
ఎన్ని నెలలకి పుడితే ఏముంది బాబు! బిడ్డ ప్రాణాలతో ఉందాలేదా అనేదే మనకి కావాలి గాని. నీ అదృష్టం బాగుండి నీ బిడ్డ ప్రాణాలతో వుంది. డాక్టర్లు కూడా అదే అంటున్నారు. ఐదు నెలలకి కూడా పుట్టేవాళ్లున్నారట. తప్పులేదు. కాలమహిమ. మందుల ప్రభావం, రోజూ మనం పేపర్లలో చూసే వింతల్లో ఇదోవింత. ఇప్పుడు నీకు పుట్టింది వింత శిశువు. ఎంతయినా నీది దొడ్డుగీత నాయనా! అంటూ హరిచేతిలో గీతలు చూస్తూ కూర్చుందట పెద్దావిడ.
వాళ్ళు ఎంతచెప్పినా హరి ఎలా నమ్మాడు కృష్ణా! ఆ పెద్దావిడ వీడి చేతిలో గీతలు చూడగానే బెలూన్ లా వుబ్బెయడం ,అయినా వీడు జగత్ కంత్రీగాడుపోలికలు చూసుంటాడే" అన్నాడు మనోహర్.
అది కూడా అయిందట మనోహర్! పాప ముఖంలోకి చూస్తూ కూర్చున్న హరి దగ్గరకి ఇంకో పెద్దావిడ వచ్చిందట. పసికూనలో పోలికలు స్పష్టంగా ఏర్పడవు హరీ!ఇదిగో చూడు. ఈ కళ్ళూ,ముక్కూ మూతి వాళ్లమ్మవి, కాళ్ళూ చేతులు పొడవుగా వున్నాయి కాబట్టి వాళ్ళ మేనమామవి. రంగుమాత్రం వాళ తాతయ్యది. మారోజుల్లో ఆ రంగు చూసి వాళ్ల తాతయ్య వెంటపడని అమ్మాయి లేదనుకో. అంత మంచిరంగు. ఇదిగిదిగో ఈ బుగ్గలు చూడు. అచ్చు నీ బుగ్గలే ఇందులో డౌటే లేదు. ఎంత ముద్దోస్తుందో చూడు" అంటూ పాపను తీసి హరి చేతిలో పెట్టిందట. వాళ్ల వూరిలో ఆవిడ మాటకి తిరుగులేదట మనోహర్" అన్నాడు కృష్ణ.
శ్రద్ధగా విన్నాడు మనోహర్. ఎలా వుండే హరి, ఎలా అయ్యాడని మనసులో అనుకున్నాడు.
"ఆడవాళ్లంతా చేరి భలేపెట్టారు కృష్ణా! హరినెత్తిన టోపి. ఎలాగైతేనేం
హరికి మాత్రం తగిన పెళ్లే జరిగింది" అన్నాడు మనోహర్.
"నిజమే మనోహర్! ఎవరిబిడ్డనో ముందు పెట్టుకొని ముద్దులాడాలి. జీవితాంతం పోషించాలి. తను సంపాయించే ప్రతి పైసామీద ఆ బిడ్డకి అధికారం యివ్వాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరి రక్తాన్నో తన రక్తంగా భావించి మమకారం చూపాలి. ఇదంతా హరి మనస్పూర్తిగా చేసే ఉంటాడంటావా అంటూ మనోహర్ ముఖంలోకి చూశాడు కృష్ణ.
హరికి అసలు మనసుంటే కదరా మంచేదో చెడేదో తెలిసేది. హరి లాంటి వాళ్లేరా ఎప్పటికైనా కష్టపడకుండా తండ్రులయ్యేది. పైగా నిజమైనతండ్రుల్లాగే భ్రమ పడుతుంటారు. అఫ్ కోర్స్ చలామణి కూడా అవుతుంటారనుకో అన్నాడు మనోహర్.
నువ్వు చెప్పింది నిజమే మనోహర్. ఇప్పుడు హరి కూతురు టెన్త్ చదువుతోంది. ఒక క్లాస్ జంప్, రామకృష్ణ చెప్పాడు అన్నాడు కృష్ణ.
ఇష్టం లేకపోయినా హరి గురించి చాలా ఆసక్తికరమైన విషయాన్ని విన్నట్లుగా ఫీలయ్యాడు మనోహర్.
*****
హైదరాబాదు నుండి నేరుగా మధురిమ దగ్గరకి వెళ్లాడు మనోహర్. మనోహర్ని చూడగానే నవ్వుతూ దగ్గరకెళ్లి కూర్చున్నాడు రాహుల్, మనోహర్ బుగ్గపై ముద్దుపెట్టాడు రాహుల్ మనోహర్ ముఖం వెలిగిపోయింది. తండ్రిని రాహుల్ అలా ముద్దుపెట్టుకునే సందర్భాలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి సందర్భాలు వచ్చినప్పడు గర్వంగా భార్యవైపు చూస్తుంటాడు మనోహర్ “
మిమ్మల్నే కాదులేండి ! వాడికి టేస్ట్గా వండిపెట్టినప్పడు నన్ను కూడా అలాగే ముద్దుపెట్టుకుంటాడు." అంటుంది మధురిమ.
బాలు, బ్యాటు పట్టుకొని తన ఫ్రెండ్స్ తో  గ్రౌండ్కెళ్లాడు రాహుల్.
రాహుల్ అలా బయటకెళ్లినప్పుడు మనోహర్కి మధురిమతో ఏకాంతందొరుకుతుంది. ఎంత టైం ఆమెతో గడిపినా యింకా చాలనట్లే అన్పిస్తుంది మనోహర్ కి.
ఈ శారీ చూడు మధూ ఎలా వుందో నీకు నచ్చుతుందనే తెచ్చాను"అంటూ శారీ వున్న కవరు మధురిమకి యిచ్చాడు మనోహర్. ఆ శారీని చూడగానే సంబరపడింది మధురిమ. ఆ శారీని అలాగే గుండెలకి హత్తుకుంది.
ఈ కలరంటే నాకు చాలా ఇష్టం" అంది.
నేనంటేకదా నీకు ఇష్టం. ఆ కలరంటే ఇష్టమని నాతో ఎప్పడూ"చెప్పలేదే? అన్నాడు నవ్వుతూ మనోహర్
ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో మీకన్నా నాకు ఇష్టమైంది ఏదీలేదు అంది మధురిమ మనోహర్ నే చూస్తూ. ఆమెనలాగే దగ్గరకి తీసికొని గుండెలకి హత్తుకున్నాడు మనోహర్, ఊపిరాడని ఆ దగ్గరితనంలో ఏదో అంతుతెలియని ఊరట కలిగింది మధురిమకు.
నీకు ఇంకో గుడ్ న్యూస్ మధూ! నేనిప్పడు ప్రాజెక్ట్ డైరెక్టర్ని అయ్యాను ఈ సందర్భంగా ఇది నీకు కానుకగా తెచ్చాను" అంటూ వసంతహారం ఇచ్చాడు మనోహర్ ఆ మోడల్ మధురిమకి బాగా నచ్చింది. పెట్టుకొని చూసింది. బాగున్నట్లనిపించింది మనోహర్కి.
నాకు హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది మధూ! ఆర్డర్స్ కూడా వచ్చాయి. మనం మళ్లీ హైదరాబాదులో వుండబోతున్నాం. నీకు హైదరాబాదు వెళ్లటం ఇష్టమేగా" అన్నాడు మనోహర్.
"ఇష్టమే. ఎప్పడు వెళ్తున్నాం"
"త్వరలోనే”
“అంటే”
“ఒకటి, రెండు రోజుల్లో”
ఎలా వీలవుతుంది. రాహుల్కి టెన్త్ ఎగ్హామ్స్ కదండీ! ఇంకో నెలవరకు బాబుని డిస్టర్స్ చెయ్యటానికి లేదు" అంది మధురిమ.
అంతవరకు మీరిక్కడే వుండండి మధూ! ముందు పద్మను తీసికెళాను. ఆ తర్వాత మీకోసం ఓ ఇల్లు చూసి పెడతాను. రాహుల్కి ఎగ్హామ్స్ అయిపోగానే మీరు కూడా హైదరాబాదు రావచ్చు" అన్నాడు మనోహర్
ఏంటి డాడీ హైదరాబాదు అంటున్నారు" అంటూ అప్పడే లోపల కొచ్చాడు రాహుల్ వర్షం పడుంటే ఆట ఆగిపోయి ఇంటికొచ్చాడు రాహుల్
హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయిన విషయం రాహుల్కి చెప్పాడు మనోహర్. రాహుల్ హాపీ అయ్యాడు. హైదరాబాదు అంటే రాహుల్కి చాలా ఇష్టం. ఒకసారి మనోహర్తో వెళ్లి - ఐమాక్స్, స్నోవరల్డ్, హైదరాబాదు సెంట్రల్, ఎన్.టి.ఆర్ గార్డెన్స్, రామోజీ ఫిలింసిటీ చూసివచ్చాడు.
చిన్న రిక్వెస్ట్ డాడీ అక్కడ మా కోసం తీసుకుంట్ ఫ్లాట్ మాత్రం ఆఫీసుకి దగ్గరలో ఉండేలా తీసుకోండి" అన్నాడు రాహుల్.
ఎందుకు రాహుల్?" అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు మనోహర్.
మీరు కన్పించటం ఆలస్యం అయితే మమ్మీ భయపడుతుంది.నాకురేలియకుండానే ఏడుస్తుంది. నేను చాలాసార్లు గమనించాను డాడి!" అన్నాడు.
"భయం దేనికి?నువ్వున్నావు కద నాన్నా" అన్నాడు మనోహర్.
"ఎంత నేనున్నామీరున్నట్లు వుంటుందా డాడీ" అన్నాడు రాహుల్
రాహుల్ మాటలు అక్షరాల నిజమని మనోహర్కి తెలుసు.
సరే రాహుల్! మీరుండే ప్లాటు నాకు దగ్గర్లో వుండేలా తీసుకుంటాను"అన్నాడు మనోహర్.
"పెద్దమ్మతో మేము కలసి వుండటానికి వీలుకాదా డాడీ?”
"వీలుకాదు నాన్నా! మీ మమ్మీ ఒప్పకున్నా పెద్దమ్మ ఒప్పకోదు. అసలు పెద్దమ్మకు మీరున్నట్లే తెలియదు" అన్నాడు మనోహర్.
"తెలియకుంటే చెప్పొచ్చుగా డాడీ!
అది జరగనిపని రాహుల్!"
తండ్రి మాటకి విలువ యిస్తాడు రాహుల్ అందుకే ఆ విషయం గురించి
అంతటితో ఆపెయ్యాలనుకున్నాడు. తండ్రి, కొడుకు మాట్లాడుకుంటుంటే చూస్తూ కూర్చుంది మధురిమ.
కరుణాకర్ తాతయ్యవాళ్లు కష్టాల్లో వున్నారని చెప్పావుగా డాడీ! వాళ్లను పెద్దమ్మదగ్గర వుంచితే సరిపోతుందిగా రవి మామయ్య దగ్గర వుండి వాళ్లేందుకు అంత కష్టపడాలి?"
"ఎంత కష్టపడ్డా వాళ్లు అక్కడ నుండి రారు రాహుల్!"
మరి మమ్మీ ఒక్కతే ఇంట్లో వుంటుంది కదా! తాతయ్య నానమ్మను తీసుకొచ్చి మమ్మీ దగ్గర వుంచోచ్చుగా"
వాళ్లకు మమ్మీ వున్నట్లు తెలియదు రాహుల్ వాళ్లకు తెలిస్తే ఒప్పకోరు. అందుకే ఎవరికీ తెలియకుండా తప్పనిసరి అన్పించి మీ మమ్మీని పెళ్లిచేసుకున్నాను.తర్వాత వాళ్లతో చెప్పి ఇబ్బందుల్లో పడటం ఇష్టంలేక చెప్పటం మానేశాను. నాకు మీరున్నారన్న విషయం ఎవరికీ తెలియదు. తెలియాల్సిన అవసరం రాలేదు? అన్నాడు మనోహర్.
రాహుల్ ఇంకేం మాట్లాడలేదు. రాహుల్కి తండ్రంటే ఇష్టం. గౌరవం. తండ్రి ఏదైనా బాగా ఆలోచించి చేస్తాడన్న నమ్మకం.
రాహుల్! నువ్వు ఎగ్హామ్స్ బాగా రాయి. నిన్ను పెద్ద చదువులు చదివించాలన్నదే నా కోరిక మమ్మీ చెప్పినట్లు విను" అంటూ రాహుల్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మనోహర్.
అలాగే డాడీ డాడీ మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినందుకు కంగ్రాట్స్" అంటూ హాపీగా ఫీలయ్యాడు రాహుల్
"థ్యాంక్స్! నాన్నా! అంటూ రాహుల్ని గుండెలకి హత్తుకున్నాడు మనోహర్.
వాళ్లిద్దర్ని అలా చూస్తుంటే అవి మధుర క్షణాల్లాగా అన్పించాయి మధురిమకి.
*****
మనోహర్కి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయిందన్న విషయం తెలియగానే మాధవయ్య, తులశమ్మ వచ్చారు. అమ్మమ్మ తాతయ్యను చూడగానే పద్మ చిన్నప్రిల్లలా వాళ్లను చుట్టేసింది. పద్మ తల్లిదండ్రులు కూడా వచ్చారు.
పద్మ తండ్రి కరుణాకర్ రిటైరయ్యారు. రవికి, రాణికి పెళ్లిళ్లు చేసి ప్రస్తుతం రవి దగ్గరే వుంటున్నారు  కరుణాకర్,పార్వతి.
రవి భార్య కరుణాకర్ని, పార్వతిని సరిగ్గా చూడటం లేదు. మోకాళ్ల నొప్పలతో బాధపడున్న పార్వతి కోడలి దగ్గర ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది.  కరుణాకర్ పరిస్థితికూడా అలాగే వుంది. బ్యాంకు ఎంప్లాయిగా ఒకప్పడు ఆయన చేసిన పనులు ప్రశస్తనీయం. ఇప్పడేమో కోడలిపెత్తనంలో హీనాతి హీనంగాబ్రతుకుతున్నారు.
పార్వతి తను పడున్న బాధల్ని తల్లిదండ్రులకి, కూతురుకి చెప్పకొని కళ్లనీళ్లు పెట్టుకొంది. కరుణాకర్ మాట్లాడలేదు. పార్వతి చెప్పేది నిజమే అన్నట్లుగామౌనంగా కూర్చున్నాడు. మనోహర్ రాగానే అందరు కలసి కూర్చుని భోజనాలు చేశారు.
"పొ లమంతా అమ్మకానికి పెట్టామురా మనోహర్ ?అంటూ అందరూ
వినేలా మనోహర్తో చెప్పాడు మాధవయ్య
దేనికి నాన్నా!" అడిగాడు మనోహర్
ఈ వయసులో పొలం పనులు చేయించడం అంటే మాటలు కాదు మనోహర్.. వండుకుని తినే ఓపిక కూడా లేదు మాకు. ఎవరైనా వండి పెడితే తిని కూర్చునే వయసులో ఉన్నాము మేమిప్పుడు
వయసులో వున్నాం మేమిప్పడు"
తులశమ్మ కూడా అదే మాటలు అందరు వినేలా అంది.
అలాగే నాన్నా ! మీకెలా అన్పిస్తే అలా చెయ్యండి!"
చెయ్యటం కాదురా! ఈ వయసులో మా గురించి కూడా మేంఆలోచించుకోవాలి. తిరిగినన్నాళ్లు తిరిగాం, ఇంతకాలం ఎలాంటి ఆలోచనలేకుండా గడచిపోయింది" అన్నాడు మాధవయ్య
"ఇప్పడు మాత్రం అంత ఆలోచన దేనికి నాన్నా ?" అన్నాడు మనోహర్
పొలంతోపాటు ఇల్లుకూడా అమ్మేయాలనుకుంటున్నాం మనోహర్ . ఎందుకు అంటావేమో! ఈ వయసులో అంత పెద్ద ఇల్లు మాకు తగదు. తిరగాలన్నాశుభ్రం చేయ్యాలన్నా కష్టంగా వుంది" అంది తులశమ్మ తల్లి మాటలు విని, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు మనోహర్
సరే! అమ్మా! అలాగే పొలంతో పాటు ఇల్లుకూడా అమ్మేయండి!"అన్నాడు మనోహర్
"ఇల్లు అమ్మాక వాళ్లిద్దరు ఎక్కడ వుండాలన్నదే వాళ్ల ఆలోచన మనోహర్"మధ్యలో కల్పించుకొని మాట్లాడాడు కరుణాకర్ వయసులో వున్నప్పుడుఎంతో వెలిగిపోయిన మాధవయ్య ఇప్పడు బాగా వడిగిపోయి కన్పిస్తున్నాడు.
ఎక్కడో ఎందుకు బావా! నేనున్నాను కదా! నా దగ్గరే వుంటార్లే దీనికంత ఆలోచన దేనికి?" అన్నాడు మనోహర్
ఆలోచన ఎందుకుండదురా, మీ అక్క బావ పరిస్థితిచూస్తున్నావుగా పెన్షన్ వస్తూ కూడా శేషజీవితాన్ని కొడుకు, కోడలు దగ్గర హోరంగా వెల్లదీస్తున్నారు. ఆ కోడలు వాళ్ల పాలిట శత్రువై కూర్చుంది. ఏం చేస్తాం. మన కన్నూ, మనవేలు.  కోపమెచ్చి మన వేలుతో పొడుచుకుంటే మన కన్నేపోతుంది" అంది తులశమ్మ.
"అన్నీ మీరే అంటున్నారు. ఇటువంటి పరిష్కారం లేని సమస్యలి సమస్యల్లా చూడొద్దు" అన్నాడు కాస్త కోపంగా మనోహర్.పరిష్కారం వున్నా లేకున్నా సమస్యల్ని ఎప్పడైనా సమస్యలుగానే చూడాలి మనోహర్ ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది" అంది తులశమ్మ ఆమె రోజూ నవలలు, వార్తాపత్రికలు చదువుతుంది. లోకజ్ఞానం ఎక్కువ.
"అయితే యిప్పడేం చెయ్యాలనుకుంటున్నారు?" అడిగాడు కోపాన్నితగ్గించుకొని ప్రశాంతంగా మనోహర్
"ఇదే విషయం గురించి మీ అన్నయ్యలతో కూడా చర్చించాం. నీతో కూడా చెప్పి ఒక నిర్ణయానికి వద్దామనుకుంటున్నాం. మేము బ్రతికినన్ని రోజులు బ్రతకం. బ్రతికే ఈ కొద్దిరోజులు ఏదైనా ఓ మంచి ఓల్టేజి హోంలో వుండాలనుకుంటున్నాం అంది తులశమ్మ.
ఉలిక్కిపడ్డాడు మనోహర్ వాళ్ల అభిప్రాయం మనోహర్కి నచ్చలేదు.
మరి అన్నయ్యలేమన్నారు?" అంటూ మెల్లగా అడిగాడు మనోహర్
మాట్లాడలేదు తులశమ్మ మాదవయ్య
"ఒకరనేది ఏముంది మనోహర్! మనం అర్థం చేసుకోవాలి. మీ బాధ్యతలు మీకున్నాయి. అవి తీర్చుకోవటానికే మీకున్న టైం సరిపోతుంది. తల్లిదండ్రుల గురించి ఆలోచించే వ్యవధి ఎక్కడుంది మీకు పైగా వాళ్లను యింట్లో పెట్టుకొని మీరు తిరగాలన్నామీకు ఇరుకుగ  వుంటుంది" అన్నాడు కరుణాకర్. తన కొడుకు రవి అనుకునేది అదే కాబట్టి అల్లుడుతో కూడా అదే చెప్పాడు.
"అదేంటి బావా! అలా అంటారు? వయసులో వున్నప్పడు వాళ్లు మమ్మల్ని కన్నారు. పెంచారు. ఎంతో కష్టపడి మాకు రెక్కలొచ్చేలా చేశారు. ఇప్పడువాళ్లతో అవసరం లేదుకదాని వాళ్లని మేము ఇప్పుడు వృద్ధాశ్రమాల వెంబడివదిలెయ్యాలా? అలా అనుకుంటే ఇన్నాళూ మేము వున్నది వాళ్ల దగ్గరేగా అప్పుడు మేము మాత్రం వాళ్లకి ఇరుకు కాదా?" అన్నాడు మనోహర్
అదెలా అవుతుంది మనోహర్! మీరు వాళ్లకి పుట్టిన పిల్లలు. ఆ తీపి వేరుగా వుంటుంది. ఇప్పడు మీకు పుట్టిన పిల్లలు మీకు తీపిగా వుంటారు. వడిగిపోయిన తల్లిదండ్రులు ఇంట్లో అడ్డంగా అన్పిస్తారు. ఎవరికన్నా పరిచయం చెయ్యాలన్నా ఈ వయసులో వాళ్లు అందంగా కన్పించరు" అన్నాడు కరుణాకర్.  తన కోడలు రోజూ తనని అనే మాటల్ని గుర్తు చేసుకుంటూ.
మీ అభిప్రాయం నాకు నచ్చటం లేదు బావా! నాకు సెంటిమెంట్స్ వున్నాయి. అవి చంపుకొని నేను బ్రతకలేను. నాకు ఓల్టేజ్ వచ్చాక నేను ఓల్టేజ్ హోముల్లో వుండలేను. నా పిల్లల దగ్గరే వుంటాను. అందుకే ఇప్పడు మా అమ్మా నాన్నని నా దగ్గరే వుంచుకుంటాను" అన్నాడు మనోహర్.
నువ్వెన్ని చెప్పినా మాకు వినాలని లేదు మనోహర్ ఈ నిర్ణయం మేం యిప్పటికిప్పడు తీసుకున్నది కాదు" అంది తులశమ్మ
ఇప్పటికిప్పడు కాదంటే ఎప్పుడమ్మా! పద్మతో నా పెళ్లికాకముందే ఈ నిర్ణయం తీసుకున్నారా? సూటిగా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు మనోహర్
ఆ మాటలు ఎక్కడో తాకాయి తులశమ్మకి మాట్లాడలేకపోయింది.
సరే! మాటలతో మిమ్మల్ని బాధపెట్టటం నాకు ఇష్టం లేదు. ఈ వయసులో మీరు ఏ బాధా తట్టుకోలేరని నాకు తెలుసు. వదినలిద్దరు మీకు పరాయివాళ్లు, పద్మ అలాకాదు. అందుకే మీరు మా దగ్గర వుండండి! పద్మ మిమ్మల్ని తన సొంత పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకుంటుంది" అన్నాడు
మనోహర్ తమ్ముడు మీకు మంచి మాటే చెబుతున్నాడు నాన్నా! మీరు ఓల్టేజ్హోమ్ లో ఉండొద్దు. తమ్ముడు దగ్గరే వుండండి" అంది పార్వతి
సరే అన్నట్లు ఇద్దరు ఒకేసారి తల వూపారు తులశమ్మ మాదవయ్య
మనోహర్ ఫ్యామిలీ హైదరాబాదు షిఫ్ట్ అయింది. వాళ్ళు ఉండే ఫ్లాట్ చాలా సౌకర్యవంతంగా వుంది. రెండు బెడ్ రూములు, ఒక పెద్దహాలు , కిచెన్,బయట ఐదారు కుర్చీలు వేసి కూర్చోవటానికి వీలుగా సిట్అవుట్ వుంది. ఒక బెడ్రూంలో మాదవయ్య తులశమ్మ వుంటారు. రెండో బెడ్ రూమ్ లో మనోహర్, పద్మ ఉంటారు.
హైదరాబాదు వెళ్లాక మాదవయ్య, తులశమ్మల ఆరోగ్యం కాస్త మెరుగైంది.ఆ గాలి, నీరు వాతావరణం వాళ్ళకి బాగా సరిపోయాయి. మనవరాలి సంరక్షణలో అంతవరకు ఎక్కువ మోతాదులో వున్న షుగరు వ్యాధి ఇప్పడు కాస్త కంట్రోల్ వచ్చింది.
ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు మనోహర్ తల్లిదండ్రితో కలసి కూర్చునిపద్మ పెట్టిన టిఫిన్ తిని కాఫీ త్రాగాడు.
మేడమీద మనోహర్ కోసం ఒక స్పెషల్ రూమ్ వుంది. మనోహర్ కి సంబంధించిన ఆఫీస్ ఫైల్స్ ఆ రూములోనే వుంటాయి. కాఫీ తాగిన వెంటనే తన రూమ్ లోకి వెళ్ళటం కోసం మేడమెట్టెక్కుతూ ఆలోచిస్తున్నాడు మనోహర్.  మనోహర్ ఆలోచనలన్నీమధురిమ చుట్టూ తిరుగుతున్నాయి.
ఈ రోజే వెళ్ళి  మధురిమ, రాహుల్ ఉండేందుకు ఒక ప్లాట్ చూడాలి రేపటితో రాహుల్ రాస్తున్న టెన్త్  ఎగ్హామ్స్ అయిపోతాయి. ఎలా రాస్తున్నాడో ఏమో! ఒకసారి వెళ్ళి వద్దామనుకుంటూనే ఆఫీసు పనిలో పడి వెళ్లలేకపోయాడు. రేపే కర్నూల్ వెళ్ళి వాళ్లను కలవాలి. ఇప్పడు మధురిమ ఎలా వుందో ! రాహుల్ ఏం చేస్తున్నాడో! అనుకుంటూ ప్రక్కకి తిరిగిన మనోహర్ కి సడన్ గా కుడికాలు స్లిప్ అయింది. పై మెట్టుపై వున్న మనోహర్ దొర్లుకుంటూ క్రింద మెట్టు దగ్గరకొచ్చి పడిపోయాడు. మనోహర్ ఊహించని యాక్సిడెంట్ అది.
మనోహర్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
బయటప్రపంచం తెలియని పద్మకి అయోమయంగా వుంది. తన చుట్టూ ఎందరున్న ఏం చెయ్యాలో తెలియని స్థితిలో వుంది.
ఎత్తు నుండి పడటం వల్ల మనోహర్ తలకి బాగా దెబ్బలు తగిలాయి " వెంటనే కోమాలోకి వెళ్ళి  పోయాడు. మనోహర్ని చూసి బోరున ఏడింది పద్మ ఆమెనుఓదార్చడం ఎవరివల్ల కాలేదు.
కొడుకును ఆ స్థితిలో చూసిన మాదవయ్య, తులశమ్మలు గుండెలుబాదుకున్నారు. పద్మకు ధైర్యం చెప్పే శక్తి, ఓపిక కూడా వాళ్లలో లేకుండా అయింది. వాళ్ల జీవితంలో అతి చెడ్డరోజు అది.
డాక్టర్ల మనోహర్ చుట్టూ హడావుడిగా తిరుగుతున్నారు పదమని పిలిచి మాట్లాడారు. కర్తవ్యం గురొచ్చిన పద్మ కళ్లనీళ్లు తుడుచుకుంది. ధైర్యం తెచ్చుకుంది.డాక్టర్లు చెప్పేది శ్రద్ధగా విన్నది. తనేం చెయ్యాలో అడిగి తెలుసుకుంది. ముఖ్యంగా డబ్బులు ఎక్కడ కట్టాలో, ఎక్కడ మందులు కొనాలో తెలుసుకుంది. డాక్టర్స్ అడిగినవి అన్నీ టైం ప్రకారం అందించింది. ఏ.టి..యం  కెళ్ళి డబ్బులు తెచ్చుకుంది. వెంటనే మనోహర్కి అవసరమైన టెస్ట్లన్నీ చేశారు డాక్టర్లు. రిపోర్టులు చూసి మందులు వాడారు.
ఏమాత్రం భయపడకుండా డాక్టర్ల దగ్గరకి తిరిగి, అటు, ఇటూ పరిగెత్తుతూ అన్ని పనులు పద్మ ఒక్కతే చేసుకొంది. మనవరాలిని దగ్గరకి తీసుకొని మెచ్చుకుంటూ, ఓదార్పుగా తల నిమిరాడు మాదవయ్య తులశమ్మ కూడా మనవరాలికి ధైర్యం చెబుతూ గుండెలకదుముకుంది.
మనోహర్కి డాక్టర్లు మంచి మందులు వాడుతున్నారు. ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఎన్ని మందులు వాడినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా మనోహర్ పరిస్తితిలో మార్పు రాలేదు. అలాగే కోమాలో వున్నాడు.
మనోహర్ పద్మకి ఇప్పడే పుట్టిన బిడ్డలా అయ్యాడు. మనోహర్కి ఏ మందులు ఎలా వాడాలో చెప్పారు డాక్టర్లు, ఒకప్పడు పద్మకి ఇల్లే ప్రపంచంలా వుండేది. ఇప్పడు మనోహరే ప్రపంచం అయింది.
మాదవయ్య, తులశమ్మ ఆమెకుతోడుగా, అండగా వున్నారు. బంధువులంతా వచ్చి మనోహర్ని చూసి వెళ్లారు. మనోహర్ని ఆ స్థితిలో చూసి కొంతమంది కళ్లనీళ్లు పెట్టుకున్నారు. పద్మను చూసి జాలిపడ్డారు. అంతచిన్న వయసులో పద్దుకొచ్చిన కష్టం చూసి కరుణాకర్ మౌనంగా రోదించాడు. అసలేకీల్లనోప్పులతో బాధపడున్న పార్వతికి మానసికంగా ఇదో రోకలిపోటు అయింది. పనిలో పని అయినట్లు పద్మకి వాళ్లిద్దరి ఓదార్చటం కూడా ఓ పెద్దపని అయింది.
వయసుకి మించిన పెద్దరికాన్ని బాధ్యతని నెత్తిన వేసుకొని మౌనంగాతిరుగుతోంది పద్మ కొంతకాలం గాలి మార్పు, వాతావరణంలో మార్పు వుంటే మనోహర్త్వరగా కోలుకుంటాడు" అని డాక్టర్ ఇచ్చిన అడ్వయిజ్తో మనోహర్ ఫ్యామిలీ కేరళకి షిఫ్ట్ అయింది.
*****
టెన్త్ ఆఖరి ఎగ్హామ్ రాసినప్పటి నుండి తండ్రికోసం చూస్తున్నాడు రాహుల్. మధురిమ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇంట్లో పని చేస్తున్నంతసేపు ఇంట్లో వుంటుంది. మిగతా టైమంతా మనోహర్ కోసం విదురుచూస్తూ గుమ్మంలోనే కూర్చుంటుంది.
డాడీ ఇవాళ వస్తారేమో మమ్మీ! నా బుక్స్, బట్టలు సర్దుకుంటాను. నువ్వు కూడా కొన్ని సామాన్లు ప్యాక్ చేసి పెట్టుకో అన్నాడు రాహుల్.
రాహుల్ పెద్దవాడు అయ్యాడు. దేన్ని అయినా టైం కు ఆలోచించగలుగుతున్నాడు.తల్లి ఆలోచనలో పడి మరచిపోతుందేమోనని ఒకటికి రెండుసార్లు గుర్తు చేస్తుంటాడు. రాహుల్ చెప్పినట్లే భర్త వస్తాడన్న ఆశతో కొంత సామాన ప్యాక్ చేసిపెట్టింది. మనోహర్ రాలేదు.
రాహుల్క్రి తండ్రి బాగా గురొస్తున్నాడు.
తండ్రి చెప్పిన మాటలు కూడాగుర్తు వస్తున్నాయి.
రాత్రి టైం లో భోజనాలయ్యాక మేడమీదికెళ్లి పడుకోవటం మనోహర్ కి అలవాటు. వేనేల్లో తండ్రి పడుకొని తండ్రి చెప్పే మాతలి వినాలంటే రాహుల్ కి చాలా ఇష్టం. మనోహర్ కి చందామా కథల చెప్పటం రాదు చిన్నప్పుడుతన తల్లి తనకు చెప్పిన మాటల్ని రాహుల్ కి చెప్పేవాడు. రాహుల్ మాత్రం మౌనంగా వింటూ ఊ కొట్టేవాడు.
“ఎప్పుడు మనల్ని మనం మండలించుకోవాలి రాహుల్ . అప్పుడే మనం సుఖంగా వుండగాలుగుటాము. అప్పుడప్పుడు మన అభిప్రాయాలను కూడా మార్చుకుంటూ మనం చేసే తప్పుల్ని సవరించుకోవాలి. అప్పుడే మనం ఈరోజు కన్నా రేపటికి తెలివిగా తయారవుతాము. మన తప్పుల్ని మనం తెలుసుకోగలుగుతేనే పశ్చాత్తాపపడటం అంటే ఏమిటో తెలుస్తుంది. నువ్వెప్పుడైనా తక్కువగా మాట్లాడు రాహుల్. ఇంకా చెప్పమన్నట్టు తండ్రి ముఖం లోకి చూసేవాడు.
“జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతివ్యక్తిని ఓ పుస్తకంలా భావించు రాహుల్, చదవటం నేర్చుకో. ఆ తర్వాత నిన్ను నువ్వు చదువుకో. అందుకే అంటారు రాహుల్! ప్రపంచం ఒక అందమైన పుస్తకం అని దాన్ని చదవలేనివారికి అది ఏమాత్రం ఉపయోగపడదు" అంటున్న తండ్రిని చూస్తుంటే ఓ మంచి గురువులా అన్పించేవాడు రాహుల్
“ ప్రొద్దుటే నిద్రలేవాలి రాహుల్! మమ్మీ చెప్పినట్లు వినాలి. ఒక్కోసారి మనం విందామన్నా చెప్పేవాళ్లు వుండరు. చెప్పేవాళ్లు ఉన్నప్పుడే వినటం నేర్చుకోవాలి. నేర్చుకొని పాటించాలి" అంటూ నిద్రలోకి జారిపోఎవాడు మనోహర్తండ్రి చెప్పింది అక్షరాల పాటించేవాడు రాహుల్.
అప్పుడలా చెప్పిన తండ్రిమాటలు గురొస్తుంటే - ఇప్పుడు దేన్నో పోగొట్టుకున్నంత వెలితిగా అన్పిస్తుంది రాహుల్కి, తండ్రిని వెంటనే చూడాలని వుంది. ఎంత ఎదురు చూసినా రాని తండ్రికోసం చూసి, చూసి అలసిపోతున్నాడు రాహుల్.
*******

No comments:

Post a Comment

Pages