సేల్ఫీ దృష్టి - అచ్చంగా తెలుగు

సేల్ఫీ దృష్టి..సేల్ఫీ దిష్టి

 కృష్ణ కసవరాజు



ఓసి నీ సేల్ఫీ పిచ్చి పిచ్చుకలు ఎత్తుకుపోను......ఆపవే లక్ష్మి అంటున్నడు మోహన్....ఎవడైనా వడియాలు పెడుతూ సేల్ఫీ దిగుతాడా ..ఎవ్వడికి తెలీకుండా దుప్పటి కప్పుకొని వడియాలు పెడుతుంటే..నువ్వేమో హాయిగా మోహన పౌడర్ పూసుకొని నడి ఎండలో....నాతో సేల్ఫీ దిగుతావ అంటూ వాపోతున్నాడు ..
 ఈ మది ఈ సేల్ఫీ ముదిరి కుల్ఫి లా మారిపోతోంది...మా అక్క కొడుకు పెళ్లి చూపులకి వెళ్తే ఇంకా అమ్మాయి అబ్బాయి అస్సలు ఎదురుగా చూసుకోలేదు ...పెళ్ళికూతురు సేల్ఫీ అడుగుతోంది పెళ్ళికొడుకుని...పైగా..ఆ పిక్చర్ ఫేస్బుక్ లో పెట్టి ...అభిప్రాయలు సేకరించి సరైన ఓట్లు వస్తేనే పెళ్లి అట వీళ్ళ ఇళ్ళల్లో అరిసెలకు చీమలు పట్టా...
 నిద్రలేస్తూ సేల్ఫీ...బాత్రూం తలుపు తీస్తూ సేల్ఫీ..........అక్కడ సేల్ఫీ.. పళ్ళు తోముతూ సేల్ఫీ...కాఫీ తాగుతూ సేల్ఫీ..సేల్ఫీ కే చిరాకు కలిగేలా సేల్ఫీ లు తీసుకుంటూ వుంటారు..పది రూపాయలు పెట్టి అద్దం కొనుకుంటే ఆనందం గా కనిపిస్తుంది మన మొహం వేలు తగలేసి సేల్ఫీ తీసుకుంటే ...అమృతాంజనం లో ఆముదం కలుపుకొని తాగిన వాడి మొహం లా ఏడుస్తుంది..........
 ఇదే దరిద్రం అనుకుంటే..ఈ దిక్కుమాలిన దరిద్రానికి ఒక కర్ర కుడా వచ్చింది ఈ మధ్య ..ముసలివాళ్ళు పట్టుకునే చేతి కర్ర లా తగలడుతుంది...అది పట్టుకొని ఒక పది ఇరవయి మంది సేల్ఫీ ల తో నవ్వు ....పళ్ళు తోముకొని ఆ పాచి పళ్ళ కంపు భరిస్తూ.....ఒక పోసు....వెంకయ్య నాయుడు తో సేల్ఫీ వెంకటప్పయ్య తో సేల్ఫీ ..అల్లరి నరేష్ తో సేల్ఫీ..చిల్లర మల్లేష్ తో సేల్ఫీ......
 ఈ మధ్య సేల్ఫీ దిష్టి అని కుడా వచ్చింది...కొంపకు వచ్చాక...ఇరుగు దిష్టి..పొరుగు దిష్టి..ఇంట్లో వాళ్ళ దిష్టి...సేల్ఫీ దిష్టి..తు తు తు అని ..వారికి వారే సేల్ఫీ తీసుకుంటూ దిష్టి తీసుకుంటున్నారు బూడిద గుమ్మడికాయ మొహాలు..
 ఈ జబ్బు తగ్గాలంటే ఒకటే దారి.........సేల్ఫీ తీసుకున్న వారిని ....చేతులు వెనక్కి కట్టి అరిటాకు భోజనాలు పెట్టడమే...అప్పుడు కుడా నోటి తో ఎలా సేల్ఫీ తీసుకోవాలో ఆలోచిచ్చి చస్తారు ........చవటలు....
 చెప్పులు వేసుకోడం....మానేస్తారేమో గాని ఈ సేల్ఫీ లు తీసుకోడం మానరు.
 ఆ వస్తున్నా! కథ రాస్తూన్న నాతో  ఓ సేల్ఫీ తీసుకోవలట... తను పిలుస్తోందీ !
****

No comments:

Post a Comment

Pages