ఎదురు వచ్చె వాసంతం - అచ్చంగా తెలుగు

ఎదురు వచ్చె వాసంతం

Share This

ఎదురు వచ్చె వాసంతం

 రెడ్లం చంద్రమౌళి
పలమనేరు, 9642618288.



పల్లవి:తొలిచూపులోని ప్రేమ చిగురించె మనసులోన

నీ పెదవుల తీయని మాటలతో

నా పదములు నేర్పిన ప్రాసలతో
పదే పదే మదే ఇలా పలికెనే నా ప్రేమని ప్రణయ గీతమై||తొలిచూపు||

అను పల్లవి:గురిచూసి ప్రేమ నీవు గుండెల్లొ గుచ్చినావు

నీ కొర కొర చూపుల కన్నులతో
నా పెదవుల విరిసిన వెన్నెలతో
పదే పదే మదే ఇలా పలికెనే నా ప్రేమని విరహ గీతమై||గురిచూసి||


చరణం 1: ఆది మధ్యమున్న అంతమే లేనిదే మన ప్రేమ

అడుగులు వేసే ఆశలు తోడై
మనసు మనసు కలిసిన వేళ
వేల జన్మలైనా వీడలేని మన ప్రేమ
జంటకట్టు కుంది జీవితమందు వెలుగుతున్న జ్యోతులు తోడై 

చరణం 2:ఆకురాల్చుకున్న ఆశలేని శిశిరాన్నీ
చిగురులు నింపి చీకటి మాపి
ఎదురు వచ్చె వాసంతం
ఓర్పు నేర్పు వున్న ఓడిపోవు వనవాసం
ఒంటరివైన పగలు రేయి రోజు లేదు మనకోసం||గురిచూసి||

చరణం 3: గతమునందు నాకు ఎదురు పడ్డ గాయాలు
అనుభవ మనుచు సాగితి నేడు ఆశయాల సాధనకోసం
నా ఆశకు ఆయువు నీవు
నా రేపటి స్వప్నం నీవు
నా రెప్పల కౌగిలిలో నిన్ను దాచుకున్నాను
నా గుండెల్లో గూడు కట్టి నిన్ను కొలుచుకున్నాను||తొలిచూపు||

***

1 comment:

Pages