"హేవిళంబి "ఉగాది
గొల్లమూడి సంధ్య
"హేవిళంబి " నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు
ఆటవెలదులు
1).
విరులు సిరులు ఝరిన విరివిగ గురియగ
రమ్మని పిలువగను రాగ యుగము
నరుడు నారి తమదు నట్టిల్లు నిండుగా
వెలగ వలయు నిండ వెన్నె లవలె
2)
ధేను వదిగ కామ ధేనువనగనదే
తనదు యింట నిలువ తరచి పిలువ
వచ్చి నిలిచు తాను వనమహా లక్ష్మియు
ఆరు రుచుల తొడ యావరించు
3)
తినగ గలిపి రుచులు తీరుగ యారును
మనసు మురియు యేమి మనదు యాది !
భావ మేది యైన భాగ్యమ్ము మనదిగా
తినుము విడువ కుండ తేరు కొనుము
4.
ఆది యంత ములను యారుగా జేసియు
పుట్టు యేడ్పు గాదే పుడమి మీద
వగరు పొగరు లేదు వగచి చూడంగను
చేదు యగును ముదిమి చేర దివికి .
5
తినగ యారు రుచులు తిరుగు లేకను మీరు
భార మగును మనసు భావనలకు
యేమి జరుగుననుచు యేడాది యంతను
యెరుక చేయుననుచు యేల బెరుకు.
6.
మరువ కమది నిలుపు మరు భూమి యువునుగ
యీశుడుండు గాద యీల వేసి
తనదు భావనేగ తరుల రుచి గలుపు
ఏక సూత్ర మేగ ఈశు గోర
7.
రోజు మారు నువ్వు రోజుల్లో ఒకరవు
నేడు నీది గాదు నాడు రాదు
చెప్పు సంతసముగ గొప్ప మొదటి రోజు
మరువ కమది గొలువు పరమ శివుని .
No comments:
Post a Comment