నీకు నేనున్నా - 8 - అచ్చంగా తెలుగు

నీకు నేనున్నా - 8

అంగులూరి అంజనీదేవి

anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com



(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు  మనోహర్. అతని అక్క  కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్  ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్  కి  ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. అతనికోసం ఎదురు చూస్తుంటారు మధురిమ, బాబు. ఇక చదవండి.)
రోజులు క్షణాల్లా దొరుతున్నాయి. ఇంటి అద్దె  కట్టమని ఇంటి ఓనర్ రోజూ వచ్చి అడుగుతున్నాడు ఒక్కరోజూ!రెండు రోజులా! ఇలా రోజుల తరబడి ఆగమంటే ఆగెంత ఓపిక మాకు లేదు. పైగా మా దొడ్లో డబ్బుల చెట్టు లేదు కోసుకొని అవసరాలు తీర్చుకోటానికి. మీరిస్తేనే మా అవసరాలు గడుస్తాయి. లేకుంటే మీకన్నాముందు మేము పస్తులుండాలి. మాకివ్వాల్సిన డబ్బు కట్టి వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యండి!అంటూ రోజూ ఇంటి ఓనర్ వేసే కేకలు  వీధి చివరిదాకా విన్పిస్తున్నాయి. ఆ కేకలు వింటుంటే ప్రాణం చచ్చిపోతోంది మధురిమకి.
ఎలక్రిసిటీ బిల్ కట్టలేదని ఇంట్లో కరెంట్ సప్లయి లేకుండా లైన్మెనొచ్చి కట్ చేసి వెళ్లాడు. ఈ మధ్యన వీధిలైట్లే కొద్దికొద్దిగా ఆ ఇంట్లోకి వెలుగునిస్తున్నాయి. రాహుల్ ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఆ లైట్ల క్రిందనే చదువుకుంటున్నాడు. కిరాణం షాపువాడు పాలవాడు, పేపర్ వాడు, చివరకు ఆ వీధిలో తిరిగి కూరగాయలు అమ్మేవాడు కూడా మధురిమ దగ్గరకి వచ్చి రోజుకి రెండుసార్లు తిట్టి, తిట్టి వెళ్తున్నారు. మధురిమ ఆ తిట్లను తట్టుకోలేకపోతుంది.
ఆ వీధిలో మనోహర్ భార్యగా మధురిమ ఎంతో గౌరవంగా బ్రతికింది. అతను వున్నన్ని రోజులు ఈ అవసరాలేవి ఆమెకు తెలిసేవి కావు. రాహుల్ అడగకముందే అన్నీ కొనిచ్చేవాడు మనోహర్. తినటానికి ఇంట్లోఏదో ఒకటి  తెచ్చిపెట్టేవాడు. ఇకచాలు డాడీ" అనేవరకు దగ్గరుండి తినిపించే వాడు. ఇప్పుడు ఆకలై తిందామంటే ఆ ఇంట్లో ఏమీ లేదు. సందడిగా తిరిగే మనోహర్ లేడు. గంభీరంగా విన్పించే ఆస్వరంలేదు. మధురిమ చేతిలో డబ్బులేదు. ఆమె పేరుతో ఏ బ్యాంక్లో అకౌంట్ లేదు. బ్యాంక్ అకౌంట్లన్నీ పద్మ పేరుతోనే వున్నాయి.
"డాడీ కోసం నేను హైదరాబాదు వెళ్లిరానా మమ్మీ!" అంటూ మధురిమను అడిగాడు రాహుల్. అందరి చేత రోజూ తిట్లుతింటున్న తల్లిని చూస్తుంటే బాధగా వుంది రాహుల్ కి.
వద్దు నాన్నా! అంత పెద్ద సిటీలో డాడి ఎక్కడున్నారని తిరుగుతావు. ఏ ఇల్లని వెతుకుతావు. డాడీ వుండే ఇల్లు ఎక్కడో వాళ్ల ఆఫీసులో కూడా ఎవరికి తెలియదట ఫోన్ చేసి కనుక్కున్నాను." అంది మధురిమ.
మరిప్పుడెలా  మమ్మీ? అంటూ ఆలోచనగా అడుగుతున్నా కొడుకు వైపు చూసింది మధురిమ, రాహుల్ని చూస్తుంటే మనోహర్ని చూసినట్లే వుంటుంది. ? రాహుల్ టెన్త్ క్లాసు  ఎగ్హామ్స్ కోసం తీయించుకున్న ఫోటోను చూసి మనోహర్ కూడాఅదే అన్నాడు. ఈ పోటో ను మాఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ చిన్నాప్పటి ఫోటో అనుకుంటారు? అని.
ఏమిటి మమ్మీ! ఆలోచిస్తున్నావ్?" అంటూ తల్లి ముఖం లోకి చూశాడురాహుల్.
ఏమంది రాహుల్ నీగురించి, నాగురించి ఆలోచిస్తున్నాను. ఏ విధంగాఆలోచించినా నాకళ్లకి కష్టాలే కన్పిస్తున్నాయ్! మనకి కష్టాలొచ్చాయిమనవి తీరే కష్టాలు కావు. దేన్నైనా భరించవచ్చు కానీ పేదరికాన్ని భరించటం అంత సులభం కాదు. ఈ పేదరికం ఒక్కరోజులో గారడీ చేస్తే పోయేది కాదు"అంది మధురిమ. ఏం చేయాలో తోచలేదు రాహుల్కి
"మమ్మీ! నేను పుట్టకముందు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఎందుకు మానేశావు? అది వుంటే మనకీ కష్టాలు వుండేవి కావుగా అన్నాడు రాహుల్
నేను చేస్తున్న ఉద్యోగం ఎక్కడో కాదు రాహుల్ డాడీ వాళ్ల ఆఫీసులోనే పెళ్లయ్యాక డాడీ నన్ను ఉద్యోగం చెయ్యొద్దన్నారు. అందుకే నేను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి నిన్నూ, డాడీని చూసుకుంటూ ఇంట్లోనే వున్నాను. డాడీకి నేనలా ఇంట్లో వుండటమే ఇష్టం."ఎప్పడైనా ఆడవాళ్లు ఇంట్లో వుండి కష్టపడాలి. మగవాళ్లు బయటకెళ్లి కష్టపడాలి. తల్లి పిల్లల్ని పెంచాలి. తండ్రి పిల్లల్ని పోషించాలి. అప్పడే ఆ ఇద్దరి కష్టం బ్యాలెన్స్ అయి తృప్తినిస్తుందంటారు డాడి డాడీ మాటను నేను ఎప్పుడూ కాదనేదాన్ని కాదు" అంది మధురిమ,
రాహుల్ మాట్లాడలేదు. రాహుల్ అలా మౌనంగా వుండటం చూసి మనోహర్ గురొచ్చాడు మధురిమకి
ఎప్పుడైనా తన ప్రశ్నకు సరైన జవాబు దొరికితే మనోహర్ కూడా అలాగే మౌనంగా కూర్చుంటాడు. లేకుంటే ప్రశ్నలు వేస్తూనే వుంటాడు. నేనిలా ప్రశ్నలు వేస్తూనే వుంటానని నన్నుమూరుడనుకోకు మధూ ప్రశ్నలు వేయకుండా జవాబులు తెలుసుకోకుండా వుండేవాళ్ళు  జీవితాంతం మూర్థులుగానే వుండిపోతారు అనేవాడు మనోహర్. అలాగని ఎప్పడూ మాట్లాడుతూ వుండమని చెప్పడు. మనోహర్ మాట్లాడితే మంచిమాటలు మాట్లాడమంటాడు. లేకుంటే మౌనంగామౌనమనేది మనిషికి ఒక గొప్ప సుగుణమట. ఆ మౌనంలో  ఎన్నో విషయాలను దాచుకోవచ్చట. మంచిమంచి పనులు కూడా ఆ మానంలోంచే పుట్టుకొస్తాయట. అలాగని మాట్లాడవలసిన  టైంలో మౌనంగా వుండొద్దు, మౌనంగా వుండవలసిన టైంలో మాట్లాడవదు అనేవాడు మనోహర్? మనోహర్ ఏది మాట్లాడినా అందులో ఏంటో కొంత అర్ధం ఉంటుంది. అందుకే భర్త మాటల్ని శ్రద్ధగా వింటుంది మధురిమ.
మౌనంగా ఆలోచిస్తున్న తల్లికి తండ్రి గురొచ్చివుంటాడని గ్రహించాడురాహుల్. తల్లిని అలా చూస్తుంటే భయంగా వుంది రాహుల్ కి.
"మమ్మీ డాడీ వస్తారన్న నమ్మకం నాకులేదు. డాడీ ఎందుకు రావటంలేదో కూడా అర్థం కావటం లేదు. ఇప్పడేం చేద్దామంటావ్?" అడిగాడు రాహుల్.
రాహుల్ వైపు చూడకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తోంది మధురిమ,
అప్పటికే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏముంది రాహుల్ చెయ్యటానికి! మనిద్దరం చచ్చిపోదాం. ఇంతకన్నా నాకింకో ఆలోచన రావటం లేదు. మన సమస్యకి ఇదే పరిష్కారం" అంది మధురిమ కొడుకువైపు చూడకుండా తలవంచుకుంటూ.
బిత్తరపోయాడు రాహుల్ దృఢ నిశ్చయంతో వున్న తల్లిని చూడగానే భయం వేసింది రాహుల్కి తండ్రి లేనందువల్ల తల్లి ఎంతగా భయపడ్డుందో అర్థం చేసుకున్నాడు.
"అర్థమైంది మమ్మీ! నువ్వు చనిపోదామనేది దేన్నో సాధిద్దామని కాదు. బ్రతకలేక చనిపోదామంటున్నావ్ బ్రతికే మార్గం కన్పిస్తుందేమో చూద్దాం మమ్మీ! తొందరపడి ఇలా నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఆలోచించటానికి మనం వుండం" అన్నాడు ఎంతో పెద్దవాడిలా ఆలోచించి రాహుల్
తల్లికి తన తండ్రి చేయించిన నగలు గుర్తొచ్చి ధైర్యం వచ్చింది రాహుల్క్రి. కొడుకు మాటలు వింటుందేకాని మధురిమ చూపులు ఎక్కడో వున్నాయి. మనోహర్ ఇంకరాడన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది.
బ్రద్దలవ్వడానికి సిద్ధంగా వున్న అగ్నిపర్వతంలా వుంది మధురిమా మనసు.
*****
కాలింగ్ బెల్ విని, డోర్ తీసాడు రాహుల్.
రాహుల్ ని చూడగానే ఓ నవ్వు నవ్వి, ఆప్యాయంగా రాహుల్ భుజం తడుతూ లోపలకొస్తున్న దామోదర్ రెడ్డిని చూసి రాహుల్ ముఖం వెలిగింది.
మమ్మీ తాతయ్య వచ్చాడు" అంటూ లోపలకి చూస్తూ మధురిమకు వినిపించేలా అన్నాడు రాహుల్. దామోదర్ ఎప్పుడొచ్చినా మధురిమా, మనోహర్ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన వచ్చినప్పుడల్లా రాహుల్ కి ప్రేమగా ఏదో ఒకటి పట్టుకొస్తుంటాడు.
రాహుల్ మాట వినగానే లోపల నుండి ఒక్క వుదుటన వచ్చింది మధురిమ, అప్పటికే నవ్వుతూ లోపలకొచ్చి కూర్చున్నాడు దామోదర్రెడ్డి ఏమ్మా మధూ! బాగున్నావా? రాహుల్ టెన్త్ ఎగ్హామ్స్ ఎలా రాశాడు?” అంటున్న దామోదర్రెడ్డి మధురిమను చూసి షాకయ్యాడు. తర్వాత ఆ ఇల్లంతా ఒక్కసారి పరికించి చూసి, రాహుల్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు.
బాగానే రాశాడు బాబాయ్! మీరు బాగున్నారా? అంది మధురిమ.
బాగున్నాం మధూ! మీరేంటి ఇలా వున్నారు? ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా, ఎం జరిగింది? అంటూ రాహుల్ ని దగ్గరికి తీసుకున్నాడు దామోదర్ రెడ్డి.
మధురిమా మాట్లాడలేదు.
దామోదర్ రెడ్డి ఎప్పడు కర్నూల్ వచ్చినా మధురిమ,మనోహర్ ఆయనకు సకల మర్యాదలు చేసి సంతోషపెడుతుంటారు. అప్పుడు చూసిన మధురిమకు, ఇప్పుడు చూస్తున్న మధురిమను చాలా తేడా కన్పిస్తుంది. నిత్యసంతోషిలా వున్నా మధురిమా ఇప్పుడు శారీరకంగా, మానసికంగా బాగా కుంగిపోయి కన్పిస్తుంది.
ఎం జరిగింది మధూ! ఈ సామాన్లన్నీ ప్యాక్ చేసి వున్నాయెందుకు? మనోహర్ ఏడి ?” అంటూ అడిగాడు దామోదర్ రెడ్డి.
ఆయన అలా అడుగుతుంటే మధురిమకు ఏడుపు ఆగలేదు.
దామోదర్రెడ్డితో జరిగింది మొత్తం చెప్పాడు రాహుల్ నిన్ననే తల్లి నగల్లో కొన్ని నగలు అమ్మి వచ్చిన డబ్బులో కొంత అక్కడ యివ్వవలసిన వాళ్లకి యిచ్చినట్లు కూడా చెప్పాడు రాహుల్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు దామోదర్రెడ్డి.
ఏడవకు మధూ రాహుల్కి ధైర్యం చెప్పాల్సిన దానవు నువ్వే ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్ప! మనోహర్ ఏ పరిస్థితిలో వున్నాడో, మీకు దూరంగా ఎందుకున్నాడో అర్థం కావటం లేదు. నువ్వింక జరగవలసిన దాని గురించిఆలోచించాలి గాని, జరిగింది తలచుకొని బాధపడితే ఎలా?
ఏముంది బాబాయ్! ఆలోచించటానికి ఎవరికీ రానికష్టాలు
నాకొచ్చాయి. ప్రస్తుతం నా బిడ్డకింత తిండిపెట్టుకోలేని స్థితిలో వున్నాను. ఆలోచించే ఓపిక కూడా నాలో లేదిప్పుడుఅంటూ దీనంగా అంది మధురిమ.
మధురిమను అలా చూస్తుంటే దామోదర్రెడ్డి మనసు కరిగిపోయింది.ఒకప్పుడు తల్లి చనిపోయి ఒంటరిగా వున్నప్పుడు కూడా మధురిమ ఇంతగా భయపడలేదు.
"భయపడకు మధూ! ధైర్యంగా వుండు" అన్నాడు దామోదర్రెడ్డి.
నేను ధైర్యంగానే వుంటాను బాబాయ్! వుండి నేనేం చెయ్యాలి? ప్రస్తుతం నేనెలా బ్రతకాలి? రాహుల్ని ఎలా బ్రతికించాలి?" అంటున్న ఆమె గొంతు దుః ఖంతో పూడుకుపోయింది. అమెలో గూడుకట్టుకొని వున్న బాధంతా ఒక్కసారిగా దుఃఖం రూపంలో బయటకొచ్చింది. అందంత తొందరగా తగ్గే ఉప్పెనకాదు. ఆమెనలా చూస్తుంటే దామోదర్రెడ్డి గుండెనెవరో పిండినటైంది.
ఎలాగైనా మధురిమను ఆదుకోవాలనుకున్నాడు దామోదర్రెడ్డి
ఎలా ఆదుకోవాలో అర్థం కాక కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ప్రక్కకెళ్లి తన సెల్ఫోన్తో ఎవరితోనో మాట్లాడివచ్చాడు.
"దివ్యభర్తకి, దివ్యకి గొడవలు ఎక్కువయ్యాయి మధూ! అది కోర్టుదాకా వెళ్లేట్లుంది. ఆ అబ్బాయిది వరంగల్ ఇప్పడా పనిమీదనే తిరుగుతున్నాను. ఈరోజేదివ్య దగ్గరకి వచ్చి నిన్ను చూడాలనిపించి ఇలా  వచ్చానుఅంటూ తాను కర్నూల్ వచ్చిన కారణం చెప్పాడు దామోదర్ రెడ్డి.
"దివ్యను చూసి చాలా రోజులైంది బాబాయ్! దివ్య ఇప్పుడు ఎలా ఉందిబాబాయ్?" అంది మధురిమ దివ్యను గుర్తుచేసుకుంటూ.
అదే బాగు మధూ!పెళ్లయ్యాక దివ్యలైఫ్ స్ట్రగుల్ లో పడింది. ఎప్పుడుచూసినా ఆ భర్తతో గొడవ తప్ప సఖ్యత లేదు" అన్నాడు దామోదర్రెడ్డి.
మధురిమా మాట్లాడలేదు. మౌనంగా కూర్చుంది.
మీ రంగారావు బావను ఈ మధ్యనే కలిశాను మధూ ! వాళ్లిప్పుడు వరంగల్ దగ్గర మడికొండలో ఉంటున్నారు”. అన్నాడు దామోదర్ రెడ్డి.
మధురిమకి. హరి పుట్టించిన పుకార్లు నిజమని నమ్మి పెళ్లి చూపులరోజు తనని అవమానించి వెళ్ళాడు రంగారావు. అప్పటినుండి రాకపోకలు లేవు. అక్కేలేనప్పుడు,ఇంకా ఆ బంధాలతో తనకి పనేంటి? అనుకుంది మధురిమ. మధురిమ మనసును అర్థం చేసుకున్నాడు దామోదర్రెడ్డి కానీ మధురిమకు వచ్చిన ఈ కష్టంలో ఆమెను ఇలాగే వదిలేస్తే ఎటుకొట్టుకుపోయి, ఎటు తేలుతుందో తెలియదు. ఆమెకో దారి చూపించటం తన బాధ్యత.
'రంగారావుకి పాపం ఓ కాలు, చెయ్యి పనిచెయ్యటం లేదు మధూ! వైద్యం బాగానే చేయించారు. ఫలితంలేదు. శ్యామలకి రోజంతా ఆయనకి సేవలు చెయ్యటంతోనే సరిపోతోంది." అన్నాడు దామోదర్రెడ్డి.  
అది వినగానే చలించిపోయింది మధురిమ.
ఆమెకు వెంటనే వాళ్ల అక్కయ్య కొడుకు చరణ్ గుర్తొచ్చాడు.
ఆ రోజు పెళ్లిచూపులు అయ్యాక తన దగ్గర ఆడుకుంటున్న చరణ్ ని తనమీద కోపంతో బలవంతంగా తీసికెళ్లాడు రంగారావు. తన తల్లి అప్పడే అంది ఈ పాపం రంగారావుకి వూరికేపోదు అని.
చరణ్ అంటే ప్రాణం మధురినుకు నెలల బాబుగా  వున్నప్పటి నుండి చరణ్ ని  తన చేతులతో పెంచింది మధురిమ, ఏడి స్తే అలసిపోతాడని ఏడుపనేది లేకుండా పెంచింది.క్రిందపడితే కందిపోతాడని ఎప్పడు చూసినా ఎత్తుకొని తిరిగింది. ఆకలి కాక ముందే చందమామను చూపించి గోరుమద్దలు తినిపించింది.
ఇప్పటికీ చరణ్ అప్పడప్పుడు గుర్తుకొస్తూనే వుంటాడు మధురిమకి.
మరిప్పడెలా వుంది బాబాయ్ వాళ్ల పరిస్థితి?చరణ్ కి కూడా నాలాగే కష్టాలు వచ్చాయా? అంది మధురిమ.
చరణ్ కి కష్టాలెందుకొస్తాయి మధూ! చరణ్సమర్ధుడు. . తండ్రి దివాలా తీయించిన ఫ్యాక్టరీని చరణ్ సమర్థవంతంగా నడుపుతున్నాడు. మంచి లాభాల్లోనడుస్తుందా ఫ్యాక్టరీ" అన్నాడు దామోదర్రెడ్డి.
చరణ్ అంత పెద్దవాడయ్యాడా? అంది ఆశ్చర్యపోతూ మధురిమ,కాలంతోపాటు వచ్చే మార్పులు ఆమెకెంతో ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి.
"అవునమ్మా! పెద్దవాడయ్యాడు. ఎం.బి.ఏ. చేశాడు"అన్నాడుదామోదర్ రెడ్డి.
"చాలా మార్పులొచ్చాయి బాబాయ్! నమ్మలేకపోతున్నాను. దీనికి ఉదాహరణ నా జీవితమే…” అంది బాధగా.
"మార్పు సహజం తల్లీ! నాకీరోజు వరంగల్ వెళ్లే పనివుంది. మీరిద్దరు నాతో బయలుదేరిరండి! మిమ్మల్ని మడికొండలో మీ బావగారింట్లో దింపుతాను" అన్నాడు దామోదర్రెడ్డి
నేనక్కడికి రాను బాబాయ్! నాకాయన ముఖం చూడాలని లేదుఅంది కచ్చితంగామధురిమ .
ఇప్పడు మీ బావగారికి నువ్వంటే కోపం లేదు మధూ! ఒకసారి నేనువెళ్లినప్పుడు ఆ హరిగాడు నీమీద పుట్టించిన పుకార్లన్నీ మీ బావగారికి అర్థమయ్యేలా చెప్పాను. ఆ హరి ఆడపిల్లల జీవితాలతో అడ్డదిడ్డంగా ఆడుకునే అడ్డ వెదవ అనికూడా చెప్పాను. మీ బావగారి విషయంలో నీకెలాంటి సందేహాలు వద్దుఅన్నాడుదామోదర్రెడ్డి.  
మమ్మీ చరణన్నయ్య వున్నాడని, ఇన్నిరోజులు నాకెందుకు చెప్పలేదుఅంటూ మధ్యలో కల్పించుకొని అడిగాడు రాహుల్.
ఇంకా చెప్పటం దేనికి రాహుల్! నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకేల్తున్నాను. ఈ విషయంలో మీ ఇద్దరు నా మాట వినాలి. పెద్దవాడిగా ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మీమీద నాకీ అధికారం వుంది" ఆనాడు దామోదర్ రెడ్డి. ఆయన మాటల్లో కన్పిస్తున్న అభిమానాన్ని కొలవటానికి ఏ తూనికరాళ్ళు సరిపోవు. ఆ అభిమానం అలాంటిది. ఆ అభిమానం వాల్లకెంతో ఒడార్పునిచ్చింది. ఆ ఓదార్పే వాల్లకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషం వాళ్ళకి తగియన్ బలాన్ని ఇచ్చింది. ఆ బలమే వాళ్ళకి మళ్ళీ బ్రతకాలన్న ఆలోచనని పెంచింది.
బాగా ఆలోచించింది మధురిమ. దామోదర్ రెడ్డి ఎప్పుడైనా తన మేలుకోరే వ్యక్తి. తనకి తప్పు చెప్పాడు. పైగా చరణ్  తన సొంత అక్కయ్య కొడుడు.. తనున్నఈ పరిస్థితుల్లో చరణ్ దగ్గరకి వెళ్లటమే ఉత్తమం.
ముగ్గురు  కర్నూల్లో బస్సెకి హైదరాబాదులో దిగారు. అక్కడట్రైన్ ఎక్కి కాజీపేటలో దిగారు. కాజేపేట ప్రక్కనే మడికొండ. కాజీపేటలో ముగ్గురు ఆటో ఎక్కి మడికొండలో వున్న చరణ్ ఇంటిముందు దిగారు. ఆ ఇల్లుఅధునాతనంగా వుంది.
అంతపెద్ద ఇంటిని చరణే కట్టించాడట. దారిలో వస్తున్నప్పడు చరణ్ నడుపుతున్నఫ్యాక్టరీని కూడా చూపించాడు దామోదర్రెడ్డి మధురిమకు అశ్చర్యంగా మంది గిర్రున తిరిగే కాలచక్రంతో పోటీపడి చరణ్ ఎలా ముందుకెళ్లాడో ఆ ఫాక్టరీని ఇంటిని చూస్తుంటే తెలుస్తోంది. చరణ్ది లక్ష్యం లేని కృషికాదు. లక్ష్యంతో కూడిన కృషి అందుకే అతను ఎన్నుకున్నరంగంలో విజయం సాధించాడనిపిస్తోంది. ఆ విజయం వెనుక దాగివున్న ఏకాగ్రత, దీక్ష చరణ్లో వున్న శక్తి సామర్ధ్యాలను వెలికితీసి చూపిస్తున్నాయి.
చరణ్ ని  చూడగానే మధురిమ కళ్లలో ఆనందబాష్పాలు కదిలాయి గుండెనిండా మమకారపు వెల్లవ ముంచెత్తింది, తన చేతులతో పెంచిన చరణ్అపుడు అందమైన వ్యక్తిత్వం గల యువకుడుగా ఎదిగి తన ఎదురుగా కన్పిస్తుంటే  మధురిమలో ఒక క్షణం మాటలు కరువయ్యాయి.
మధురిమను చూస్తుంటే పిన్నిని చూసినట్లు లేదు చరణ్ కి. అమ్మను చూసినట్లు వుంది. వెంటనే మధురిమకు దగ్గరగా వెళ్లి, ఆమె ఆశీస్సుల కోసం ఒక క్షణం వంగి ఆమె కాళ్లను తాకి లేచాడు. చరణ్లో కన్పిస్తున్న ఆ వినయం, సంస్కారం చూసి ముగ్గురాలైంది మధురిమ.  చరణ్ ని  అలాగే దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దుపెట్టుకొని, చరణ్ తలను తన భుజంపై ఆనించుకొని సంతోషంగా చరణ్  తలను నిమిరింది మధురిమ.
దామోదర్రెడ్డి వాళ్లనలా చూస్తూ "గాడ్ ఈజ్ గ్రేట్  అనుకున్నాడు మనసులో.
రాహుల్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని సోఫాలో తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు చరణ్.  చరణ్ లో  మధురిమ పోలికలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆసక్తిగా వాళ్లనే చూస్తూ వాళ్ల మాటలు వింటున్నాడు రాహుల్.
ఆ ఇంట్లో వున్న పనివాళ్లు వాళ్లకి కావలసిన ఏర్పాట్లు, మర్యాదలు చేశారు. భర్తకు సేవలు చేసుకుంటూ పైన రూములో వుంది శ్యామల, ఎప్పుడో తప్ప ఆమె క్రిందికి రాదు. బయట ప్రపంచంతో సంబంధాలను బలవంతంగాతెంచుకొని బ్రతుకుతోంది.
దామోదర్ రెడ్డి  మనోహర్ గురించి, మధురిమ గురించి చెబుతుంటేశ్రద్ధగా వింటున్నాడు చరణ్. మధురిమ, రాహుల్ ప్రేక్షకుల్లా కూర్చున్నారు.
చరణ్ మీ పిన్ని గురించి నీకంతా చెప్పాను. రాహుల్ చిన్నవాడు మనోహర్ దగ్గర వున్నన్ని రోజులు ప్రక్కవాళ్ల ఈర్ష్యపడేలా జరిగింది వాళ్లకి ఇప్పుడు వాళ్ళు  ఆ గతాన్ని మరిచిపోలేకపోతున్నారు. వర్తమానాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారట" అన్నాడు దామోదర్రెడ్డి బాధగా.
ఆయన మాటలకి కదిలిపోయాడు చరణ్ వెంటనే మధురిమ వైపు చూశాడు.
చూడు పిన్నీ గతాన్ని తలచుకోవటమంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఇకపై మీరు గతంలో బ్రతకొద్దు. బ్రతకటానికి ఎన్నో మార్గాలున్నాయి. జీవితం ఒక చాక్లెట్ లాంటిది. దాన్ని తినేముందు గతమనే కాగితాన్ని విప్పి తినాలి.
అలా తింటేనే దాని రుచి తెలుస్తుంది. ఏ సమస్య పుట్టినా పరిష్కారం కోసమే పుడుతుంది. పరిష్కరించుకోటానికే మనముండేది. సమస్యనెప్పుడూ సమస్యలా చూడొద్దు. సమస్యలతో తల బరువెక్కినపుడే లక్ష్యాలు పుడతాయి. గమ్యం దూరంగా వుందని లక్ష్యాలను వదులుకోలేం కదా!అంటున్న చరణ్ మాటల్లో చెక్కు చెదరని ఆత్మస్థయిర్యం వుంది. మాట్లాడే విధానంలో ఉత్సాహం వుంది.ఉత్తేజం ఉంది.
చరణ్ మాటలు రాహుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు తను పెంచిన బిడ్డేనా ఈ చరణ్ అన్నంతగా ఆశ్చర్యపోతోంది మధురిమ,
"ఇక చాలు చరణ్ నాకిప్పుడు ధైర్యంగా వుంది. మధూ నేనిక వెత్తానమ్మా రాహుల్ జాగ్రత్త అప్పడప్పుడు వచ్చివెళ్తుంటాను. నువ్విక భయపడనవసరం లేదు. నీకు చదువుంది. ఆ చదువే నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది. వసంతమ్మ నీకు ఇచ్చివెళ్లిన ఆస్తి ఆ చదువు" అంటూ ధైర్యం చెప్పి వాళ్ల దగ్గర సెలవు తీసుకున్నాడు దామోదర్రెడ్డి.
వెళ్లిపోతున్న దామోదర్రెడ్డి వైపు చూసిన మధురిమ కళ్లు కృతజ్ఞతతో తడిసి మెరిశాయి. మంచివాళ్ల జీవితం వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల వల్లనే సార్థకమవుతుందని మరోసారి నిరూపించుకున్నాడు దామోదర్రెడ్డి.
*****
మధురిమను, రాహుల్ను తన ఇంట్లోనే వుంచుకున్నాడు చరణ్ రాహుల్ ని ఎన్ .ఆర్. జూనియర్ కాలేజీలో చేర్పించాడు. ఇంటర్ లో చేరినప్పటి నుండి రాహుల్ దృష్టి అంటా ఇంజనీరింగ్ మీదనే వుంది. బాగా చదువుతున్నాడు.
చరణ్ ఫ్యాక్టరీలోనే చరణ్ దగ్గర పనిచేస్తోంది మధురిమ.  చేతినిండా పని ఉన్నందువల్ల తృప్తిగా వుంది మధురిమను. అందరికి ఇచ్చినట్లే మధురిమను కూడా వెయ్యి రూపాయలు జీతం ఇచ్చాడు చరణ్. చరణ్ దగ్గర జీతం తీసుకున్తునపుడు తృప్తికన్నా బాధే ఎక్కువగా అన్పించింది. గతం గుర్తొచ్చి ఒళ్ళంతా జలదరించింది. తన జీవితం ఎందుకిలా మారింది? అందరిలాగా ఎందుకు లేదు? ఈ మార్పేంటి? చరణ్ దగ్గర జీతం తీసుకోవడమేమిటి? ఈ జీతం డబ్బులతోతన అవసరాలు తీర్చుకోవదమేమిటి? ఒక్క ప్రశ్నకు ఆమె దగ్గర జవాబు లేదు.
"నాకు జీతం ఇవ్వటానికి నేనేమైనా పరాయిదాన్నా చరణ్! మమ్మల్ని ఇంట్లో వుంచుకొని ఆదరిస్తున్నావ్ అది చాలదా? ఇంకా ఈ డబ్బు ఎందుకు? నన్ను కనీసం నీ ఫ్యాక్టరీలో పనిచేసి అయినా నీ ఋణం తీర్చుకోనియ్యి అంది మధురిమ.
డబ్బు ఎందుకు అనకూడదు పిన్నీ మనిషికి డబ్బు కావాలి. ఆ డబ్బు లేకుంటే ఏదీ నడవదు. మనిషికి డబ్బుకన్నా విలువైనవి చాలా వున్నాయి. కానీ అవన్నీ అందుకోవాలంటే డబ్బు కావాలి. ప్రశాంతంగా బ్రతకాలంటే డబ్బుకావాలి. ప్రశాంతంగా వున్నప్పడే మనశ్శాంతి కూడా వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటేమనం పీల్చే గాలి తర్వాత డబ్బుకే ప్రాధాన్యత యివ్వాలి. ముందుముందు ఎన్నోఅవసరాలున్నాయి. ఈ డబ్బు వుంచండి!" అంటూ మధురిమ చేతికి డబ్బు యిచ్చాడు చరణ్, ఇంకేం మాట్లాడలేదు మధురిమ, చరణ్ దగ్గర చేయిచాపి జీతం డబ్బులుతీసుకుంటున్నప్పడు తల్లిమాటలు గురొచ్చాయి మధురిమకి.
"హరిశ్చంద్రుడ్ని కాటికాపరిగా, కుచేలుడ్ని కుబేరుడిగా. బలిని పాతాళవాసిగా. ఇలా అనూహ్యమైన మార్పుల్ని చెయ్యగలిగే బలం ఒక్క కాలానికి వుంది మధు! ఆ కాలం  చేసే మార్పులకి మనం తలవంచి బ్రతకాలి" అనివసంతమ్మ మధురిమతో అనేది. ఇప్పడా మాటలు అక్షరాల నిజమనిపించాయి మధురిమకి.
*****
వేసవి సెలవులు ముగిశాయి. కాలేజీలు తెరిచారు. ఇన్నిరోజులుసూడెంట్స్ లేక నిర్మానుష్యంగా వున్న ప్రదేశాలన్నీ కళకళలాడుతున్నాయి.
చదివే పిల్లలున్న ప్రతి ఇంట్లో చదువుల హడావడి మొదలైంది. ఏ సీటు కొనాలి? తమ పిల్లల్ని ఏ కాలేజీలో చేర్పించాలి?  కాలేజీలో ఏ సీటుకి ఎంత రేతుంది? ఏ సబ్జక్ట్ ఏ, ఏ కాలేజీలో బాగా చెబుతారు? వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్ ను బాగా చెప్పగలిగే లెక్చరర్లు ఏ కాలేజీలో వున్నారు?” ఇలా ప్రతి ఇంట్లో ఒకటే సందడి, సందడితో కూడిన చర్చలు.
రాహుల్ కిఇంటరో మంచి మార్కుల మంచిర్యాంక్ వచ్చింది. ఎమ్.సెట్. లో మంచి ర్యాంక్ వచ్చింది. బి.టెక్. లో  సీటొచ్చింది. వరంగల్ ప్రక్కనే వున్న నర్సంపేట బాలాజీ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు రాహుల్.బి.టెక్. లో మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నాడు. రోజూ లంచ్ బాక్స్ తీసుకొని బస్ లో వస్తుంటాడు. రాహుల్ ని కాలేజీలో చేర్పించటానికి అవసరమైన పనులన్నీచరణ్దగ్గరుండి చూసుకున్నాడు.
*****
కాలం రెండు సంవత్సరాలనివెనక్కి లాక్కెళ్లింది. కాలానికి మంచీ-చెడూ లేవు. అది ఎవరికోసం ఆగదు. దాన్నెవరూ ఆపలేరు. దానికున్న విలువ డబ్బుకి లేదు.ఎలాంటి గాయానైనా పైసా ఖర్చులేకుండా మాన్పుతుంది.
ఫ్యాక్టరీలో చరణ్ చూపించి పనికి అలవాటు పడిస్తోయింది మధురిమ,
రాహుల్ బి,టెక్. థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
ఫ్యాక్టరీ పనిలోనే చరణ్ బాగా బిజీ అయ్యాడు.
విక్రమ్ చరణ్కి మంచి ఫ్రెండ్ హైదరాబాదులో కాల్ సెంటర్ నడుపుతున్నాడు. తరచుగా చరణ్ దగ్గరకి వచ్చివెళ్తుంటాడు. విక్రమ్ ని  కూడా చరణ్ నిచూసినట్లే చూస్తుంది మధురిమ, విక్రమ్, చరణ్ ఒకేగూటి పక్షులు. లక్ష్యాన్నే జీవితంగా, ఊపిరిగా భావించి కష్టపడుతుంటాడు. అందుకే వాళ్లంటే మధురిమకుబాగా ఇష్టం. ఇష్టం కాబట్టేవాళ్ల ప్రవర్తనని, వాళ్లు మాట్లాడే తీరుని, వాళ్ల ఆలోచనా విధానాన్ని వాళ్లు పెట్టుకున్న టార్గెట్ని ఆసక్తిగా గమనిస్తుంటుంది.
విక్రమ్ కి ఇద్దరు చెల్లెళ్లు పెద్ద చెల్లెలు హైదరాబాదులో ఎం.బి.ఏచేస్తుంది. ఆ అమ్మాయిని చరణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలన్న ఆలోచన వుంది విక్రమ్ కి. ఆ విషయం చరణ్ కి కూడా తెలుసు.మధురిమకు కూడా చెప్పాడు చరణ్.సంతోషించింది మధురిమ.
ఇకపోతే రెండో చెల్లెలు మేధ, మేధను బి.టెక్ చేయించాలనుకున్నాడు విక్రమ్. మేధకి హన్మకొండ కాలేజీలో సీటొచ్చింది. మేధకి సీటొచ్చిన కాలేజీ హంటర్ రోడ్డుకి దగ్గర్లో వుంది.
ఆ కాలేజీకి దగ్గర్లో వుండే లేడీస్ హాస్టల్లో మేధను చేర్పించాలనుకున్నాడు విక్రమ్.  హంటర్ రోడ్డుకి దగ్గర్లో ఏదైనా లేడీస్ హాస్టల్ వుందేమోనని చరణ్ని తన బైక్ మీద ఎక్కించుకొని, హంటర్రోడ్డు ఏరియా అంతా తిరిగారు. ఆ ఏరియాలో వుండే హాస్టల్స్ విక్రమ్ కి  నచ్చలేదు.
చరణ్! నాకిక్కడ హాస్టల్స్ నచ్చలేదు. నయీంనగర్లో పెట్రోల్ పంపుకి  దగ్గర్లో చాలా హాస్టల్స్ వున్నాయట. అక్కడకెళ్లి చూద్దాం పద" అన్నాడు విక్రమ్.
మేధకి సీటొచ్చిన కాలేజీకి అది బాగా దూరమవుతుంది విక్రమ్! అక్కడ నుండి రోజూ కాలేజీకి ఆటోలో రావాలి. హాస్టల్ నుండి ఆటోస్టాండ్ వరకు తప్పనిసరిగా నడవాలి. టైం వేస్ట్ అవుతుంది. ఎప్పడైనా కాలేజీకి దగ్గర్లో వుండే హాస్టలయితేనే బెటర్ ఆలోచించు. ఇంకా ఈ హంటర్ రోడ్డు ఏరియాలోనే ఏమైనా హాస్టల్స్ వున్నాయేమో చూద్దాం పద" అన్నాడు చరణ్.
చరణ్ చెప్పినట్లే హంటర్ రోడ్డు ఏరియా అంతా తిరిగారు.
తిరిగి, తిరిగి ఏ హాస్టల్ నచ్చక విసిగిపోయారు.
ఆ విసిగిపోవటంతో విక్రమ్ కి  ఓ కొత్త ఆలోచన వచ్చింది.
వెంటనే చరణ్ వైపు తిరిగాడు విక్రమ్.
"నాకో ఆలోచన వచ్చింది చరణ్" అన్నాడు విక్రమ్
ఏమిటో ఆ ఆలోచన చెప్ప విక్రమ్!" అంటూ నెమ్మదిగా అడిగాడు
"మధురిమ పిన్నితో హంటర్రోడ్డు ఏరియాలో లేడీస్ హాస్టల్ పెట్టిద్దాం. ముందు మేధను, ఆమె ఫ్రెండ్స్ ని అందులో జాయిన్ చేద్దాం.ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్ని కాలేజీలల్లో చదివే అమ్మాయిలు వచ్చి అందులో జాయిన్ అవుతారు" అన్నాడు విక్రమ్. మధురిమను విక్రమ్ కూడా పిన్ని అనే పిలుస్తాడు.
పిన్ని చెయ్యగలదా విక్రమ్?" అన్నాడు చరణ్.
చెయ్యగలడు చరణ్! ఆమె కంత సామర్ధ్యం వుంది. ఇప్పుడు చూసిన హాస్టల్స్ అన్నిటికన్నా బ్రహ్మాండంగా నడవగలదు. కమాన్.బైక్ ఎక్కు హాస్టల్ కోసం ఏదైనా ఓ బిల్డింగ్ చూసివద్దాం" అన్నాడు విక్రం.
అంత సడన్ గా అంటే ఎలావిక్రం! పిన్నితో ఒక మాట చెప్పాలిగా, పిన్ని ఇప్పుడు ఫ్యాక్టరీ లో ఉంది" అన్నాడు చరణ్.
వచ్చాక చెబుదాం చరణ్! ముందు బిల్డింగ్ దొరకనీ, బిల్డింగ్ దొరికాక పిన్ని ఒప్పుకోకపోతే కన్విన్స్ చేద్దాం" అంటూ బైక్ స్టార్ట్ చేశాడు విక్రం.
వాళ్లిద్దరు అదాలత్ మీదుగా వెళ్లి, హంటర్రోడ్డంతా తిరిగారు అడ్వకేట్స్ కాలనీ కూడా వెళ్ళారు. చాలా బిల్డింగ్స్ చూసారు. వాళ్ళకి ఒకే ఒక బిల్డింగ్ నచ్చింది.
ఆ బిల్డింగ్మాస్టర్ జీ కాలేజీ ఎదురుగా ఉంది. దాని పేరు పి.బి.ఆర్. కాంప్లెక్స్. ఆ బిల్డింగ్ ఓనర్ రత్నాకర్ రెడ్డి ని కలిసారు విక్రం, చరణ్. వాళ్లను చూడగానే నవ్వుతూ మాట్లాడాడు రత్నాకర్ రెడ్డి  రత్నాకర్రెడ్డిలో వుండే స్పెషల్ క్వాలిటీ నవ్వుతూ మాట్లాడటం ఆయన ముఖంలో ఆ నవ్వే ఓ ఎస్సెట్. ఆ బిల్డింగ్ కి  అడ్వాన్స్, రెంట్ మాట్లాడు కున్నారు.
పి.బి.ఆర్అంటే ఏమిటిసార్ అదెవరి పేరు?" అడిగాడు విక్రమ్ రత్నాకర్రెడ్డిని. విక్రమ్ కి  ఏదైనా తెలుసుకోవాలనిపించినప్పడు వెంటనే తెలుసుకుంటాడు. అడిగితే సిల్లీగా వుంటుందేమోనని సందేహించడు
పి.బి.ఆర్? అంటే పులి బుచ్చిరెడ్డి అది మా నాన్నగారి పేరు సార్!" అన్నాడు రత్నాకర్రెడ్డి .
కొద్దిసేపు కూర్చుని రత్నాకర్రెడ్డి దగ్గర సెలవు తీసుకున్నారు చరణ్, విక్రం.
*****

 (సశేషం)

No comments:

Post a Comment

Pages