సీసం
సూర్య కిరణములు సుందర దేవేరి
పైన బడిన పూల పైన నున్న
జల బిందువులు ముత్య జల్లులులాగను
కనిపించెనూగదా కమ్మగాను
జీవరాసులకును జీవము నీవేగ
జగమునందమ్మా సజావుగాను
జగములేలే జగ్తజనని నిన్ను కొలుతు
అమ్మా యెలపుడును అమితముగను౹౹
తేటగీతి
మమతల మకరందాల సుమలికలోలె
నీదు వునికి పార్వతిమాత నిరతముగద
మా మనసుపైన నీదివ్య మమతలన్ని
ముద్ర వేసినావు మమేకము. లలితముగ౹౹
కందం
పార్వతి మాతా నీపై
పర్వతమోలెనవ రత్నపాఱులు కనినా
పార్వతి జననీ మాకూ
పర్వతమోలే శుభాలు పంచితివిగదా౹౹
ద్విపదమాలిక
శివతాండవాలందు శివ లీలలందు
శివశంకరీ మాకు శివ కృపనివ్వు
శివ నామములుతోడ శివ కటాక్షములు
శివ దర్శనము మాకు శివరక్ష యేను౹౹
మంజరీ ద్విపద
మనసు పరితపించె మనవిలందునుగ
మానస జపమందు మన మదీదెనుగ
మనలోని తలపుల మడుగులు వెతికె
మనసార పార్వతీ మాతను కాద౹౹
ద్విపద
పరితాపమును తీర్చ పరదేవత బహు
పరిమళాలను పంచె పరిపూర్ణముగను౹౹
ఆటవెలది
అమృత కిరణుడోలె అమిత చల్లని మది
నీదు పార్వతమ్మ నిర్మలమగు
నీదు మనసు మేము నిరతం మనవిలతో
కష్ట పెట్టిన కనికరము చూపు౹౹
తేటగీతి
పార్వతీదేవిని మనము పలురకములు
తలచినంత కలుగునుగ తల్లి కృపయు
మనకు పరిపూర్ణత కలిగి మధువులిచ్చు
నాగమల్లికల సువాసనలను బోలి౹౹
ఉత్పలమాల
మానస పూలతోటలకు మాలివి నీవుగదమ్మ పార్వతీ
భానుని కాంతిలో మదుల భావనలన్నిను దిద్దెవూగదా
నీదునికీ ఉమా జనని నిత్య ఫలాలొసగూ జగత్తులో
నీ దయయేగ మాకు జననీ నిరతం శరణూ యెలప్పుడూ౹౹
ఉత్పలమాల
పర్వత రాజ పుత్రివిగ పాలన చేతువు మాత మమ్ముగా
సర్వము నీవె మా జనని సర్వము నీ దయయేగ పార్వతీ
మర్వము మాత నిన్నుగద మర్వక మా గతి అంబ చూపవా
గర్వము గాను నీ మనన గమ్యము చేరుకొనేల చేయుగా౹౹
***
No comments:
Post a Comment