సమన్వయం
వై ఎస్ ఆర్ లక్ష్మి
రమ ఉదయమే వంటింట్లో అష్టావధానం చేస్తోంది.ఒక పొయ్య మీద పప్పుకూర,రెండో పొయ్య మీద కుక్కర్లో ఇడ్లీ ఉడుకుతున్నాయి.అన్నం కరెంటు
కుక్కర్లో ఉడుకుతోంది.చట్నీకి కావలిసిన వన్నీ సిధం చేసి మిక్సీ వెయ్యడానికి.
సిధమయ్యింది.ఇంతలో నాలుగేళ్ళ చింటూ "నానమ్మా పాలు"అంటూ వచ్చాడు. వాళ్ళమ్మ స్నానికి వెళ్ళి వుంటుంది అనుకుంటూ మిక్సీ జార్ పక్కన పెట్టి వాడికి పాలు గొరు వెచ్చగా కావాలని కొంచెం వేడి చేసి మనవడికి
తాగించింది. చట్నీ వేధ్ధామనే లోపు "కాఫీ
ఏదే "అంటూ అత్తగారు గావుకేక పెట్టారు. ఈవిడ లేచిందనుకుంటా అనుకుని "వస్తున్నాను అత్తయ్యా! ముఖం
కడిగారా "అని అడిగిది.
"లేచి గంట అయ్యింది.ఇంతవరకు కాఫీ తగలెయ్య లేదు."అంది విసుగ్గా.
గబగబా కాఫీ కలుపుకొచ్చి ముందుగదిలో ఉన్న అత్తగారికి అందించింది. ఆమె లేవ గలిగినా కొడలు తెచ్చి అందివ్వాలిసిందే.
వంటింట్లో కి వెళుతుంటే కోడలు మానస రెడీ అయ్యి
వచ్చింది."అత్తయ్యా!ఇవ్వాళ ఆఫీసుకి కొంచెం ముందుగా వెళ్ళాలి పని ఉంది.వంటf అయ్యిందా? "అని అడిగింది.
"ఇదుగో ఇప్పుడే అయిపోవచ్చిందమ్మా "అంటూ హడావిడిగా వెళ్ళి చట్నీ
మిక్సీ వేసి ఆమె కి ప్లేటులో టిఫిను పెట్టి
ఇచ్చి తింటూ ఉండగా బాక్సు సర్ద సాగింది. మానస టిఫిను తింటూనే సింకులో ఉన్న అంటు గిన్నెలు అన్నీ అలాగే ఉండటం చూసి "ఏం అత్తయ్యా ! కన్నమ్మ ఇంకా పనికి రాలేదా?"అని అడిగింది మానస.
"దానికి ఇంటి దగ్గర పని ఉందంటమ్మా కొంచెం ఆలస్యంగా
వస్తానన్నది." అంది రమ.
"పోన్లే వస్తుందిగా! చింటూని మీ అబ్బాయి ఆఫీసు కి వెళుతూ స్కూలులో
దింపుతాను అన్నారు."అంటూ అత్తగారు సర్ది ఇచ్చిన బాక్సు తీసుకొని అక్కడతో తన
బాధ్యత అయిపోయినట్లు హడావిడిగా
వెళ్ళిపోయింది మానస.
ఇంతలో వాకింగ్కి వెళ్ళిన రమ భర్త మాధవరావు వచ్చాడు.కొడుకు రాజా
కూడా నిద్ర లేవడం తో వారిద్దరికి టిఫిను పెట్టి కాఫీ కలిపి ఇచ్చింది. "అమ్మా! మానస ఆఫీసు కి
వెళ్ళినట్లుంది.చింటూని రెడీ చేయమ్మా.నేను ఆఫీసు కి వెళతా వాడిని స్కూలులో దించి
వెళతాను. మధ్యాహ్నం నాన్నగారు తీసుకువస్తారు."అని రాజా రెడీ అవడానికి వెళ్ళాడు.వచ్చే
సంవత్సరం స్కూలులో అలవాటు అవడానికి ఇప్పుడే ఒకపూట డే కేర్కి పంపుతున్నారు. మధ్యాహ్నం 12.30 కల్లా ఇంటికి
వచేస్తాడు.
రమ చింటూని రెడీ చేసి మధ్యలో తినడానికి బిస్కట్లు,వాటర్ బాటిల్ బాగ్ లో సర్ది ,కొడుక్కి బాక్సు టేబుల్ మీద
పెట్టింది.ఇద్దరూ వెళ్ళారు.
మాధవరావు పేపర్ చదువుతూ ,అత్తగారుr టివి చూస్తూ కూర్చున్నారు.ఇంట్లో ఎంత పనున్నా రమ ఒక్కతే తంటాలు పడాల్సిందే.ఇది నిత్య కృత్యం.ఈ టీం
టేబుల్ కి మార్పు ఉండదు.వాళ్ళను చూసి ఒక నిట్టూర్పు విడిచి వంటింట్లోకి వచ్చింది
రమ కుక్కర్లో వేసిన ఇడ్లీలు అందరికీ పెట్టగా ఇంకా రెండు మిగిలాయి.వాళ్ళకు టైం
అవుతుంది అన్న హడావిడిలో మూత పెట్టడం మరచిపోవడంతో అవి చప్పగా ఆరిపోయాయి.ఎక్కడ
పడితే అక్కడ ఉన్న అంటు గిన్నెలు చూడగానే నీరసం ముంచుకొచ్చింది రమకు.ఒక్క నిముషం అక్కడే ఉన్న స్టూలు మీద
కూర్చుంది. అంతలోనే అత్తగారు కి భోజన టైం అవుతోందని ఆమె కి వేరుగా చిన్న గిన్నె లో
బియ్యం కడిగిపెట్టింది.ఆమెకి ఉదయం 8.00 కల్లా స్నానం టిఫిను,11.30 కి భిజనం ,4.00కి స్నాక్ టీ,సాయంత్రం 6.30 కల్ల భోజనం చేసి
పడుకుంటుంది. ఇందులో ఏ లోపం వచ్చినా యాగీ చేసేస్తుంది.రమ కూడా సాధ్యమైనంత వరకు సమయం తప్పకుండా చూసుకుంటుంది.పొద్దున కొడుకు,కోడలుకి ఒకసారి, అత్తగారు కి
ఒకసారి ,ఆరిన అన్నం భర్త తినడని మరొకసారి
వండుతుంది.
ఆరిపోయిన ఇడ్లీలు ఎలాగో తిని అంటు గిన్నెలు అంట్ల బుట్టలో సర్ది,ష్టౌ గట్లు తుడుచు కొచేటప్పటికి కన్నమ్మ రానే వచ్చింది.ఆమెకి టీ
పెట్టి ఇచ్చి అది గదులు చిమ్ముతుంటే వెనకాలే ఉండి బెడ్రూముల్లో ఎక్కడవక్కడ పడేసిన తుళ్ళూ,దుప్పట్లూ సర్ది విడిచిన బట్టలన్నీ
తీసి నానబెట్టి ంచింది.అది కబుర్లు చెబుతూ ఇళ్ళు తుడిచి ,గిన్నెలు కడిగి బట్టలు ఉతకడానికి వెళ్ళింది.కన్నమ్మ పనులు
చేస్తుండగానే అత్తగారు కి అన్నం పెట్టింది.మాధవరావు చింటూని తీసుకురావడం తో వాడికి
కాళ్ళు చేతులు కడిగి అన్నం తినిపించి నిద్రబుచ్చింది. భర్తకు కూడా భోజనం పెట్టి చింటూ నిద్రలేస్తాడేమో చూస్తూ ఉండమని స్నానం చేసి వచ్చేటప్పటికి
రెండు అయ్యింది.ఒక అరగంట నడుం వాల్చి లేచి భర్తకు,అత్తగారు కి టీ పెట్టి ఇచ్చి
అలసివచే కొడుకు కోడలికి ఫలహారం తయారు చేసి ఉంచింది.సయంకాలం మరల వంట.ఇదీ రమ దినచర్య
.ఇంట్లో ఎవరికన్నా నలతగా ఉన్నా,బంధువులు వచ్చినా
పని భారం మరింత పెరుగుతుంది.
రమ చిన్ననాటి స్నేహితురాలు విజయ వచ్చి రెండు రోజులు ఉంటానని ఫోన్
చేసింది.ఇద్దరూ బి ఇడి చేసి ఉపాధ్యాయులుగా చేరారు. పెళ్ళిళ్ళై వేరు వేరు ఊళ్ళలో స్థిరపడ్డా
అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ స్నేహాన్ని కొనసాగించారు .
విజయకు ఒక అమ్మాయి,ఒక అబ్బాయి ఇద్దరూ పెళ్ళిళ్ళు అయ్యి అమెరికా లో స్థిరపడ్డారు.ఇక్కడ
విజయ దంపతులు ఇద్దరే ఉంటారు.ఆమె భర్త బాంకు ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు.ఆయనకు
పర్యాటకం అంటే ఇష్టం ఉండటం తో ఇద్దరూ ఎప్పుడూ టూర్లు వెళుతూనే ఉంటారు.ఏ విధమైన
బాదర బంధీ లేని జీవితం.
రమ పరిస్థితి అందుకు భిన్నం.మాధవరావు పదవీవిరమణ పొంది నాలుగు
సంవత్సరాలు అయ్యింది.రమ క్రితం సంవత్సరం రిటైరు అయ్యింది. ఇద్దరు కొడుకులు.పెద్ద కొడుకు అమెరికా లో ఉంటాడు. చిన్న కొడుకు,కోడలు ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం అవడం తో వీళ్ళతోనే కలసి
ఉంటారు.అంతకుముందే మామగారు పోవడంతో మాధవరావు ఒక్కడే కొడుకు అవడంతో ఇక్కడే
ఉంటున్నారు.రమకు సరదాగా బయటకు వెళ్ళాలని ఉన్నా ఒక పూట ఎక్కడకు వెళ్ళినా ఇంట్లో
వారికి ఇబ్బంది అని ఎక్కడికీ కదలదు.మాధవరావు ఆమె ఇష్టాఇష్టాల గురించి ,ఆమెను అసలు పట్టించుకోడు.దాంతో రమ నిర్లిప్తంగా తన పనులు తాను చేసుకు వెళ్ళడమే గాని దేని గురుంచి
ఆలోచించదు.
విజయ వచ్చిన ఒక్క రోజులోనే ఇంటి పరిస్థితి ని గమనించింది. మర్నాడు ఆదివారం కావడంతో విజయ రమను దగ్గర్లోని పార్కు కు లాక్కు
వెళ్ళింది.ఇద్దరూ జనానికి దూరంగా గుబురుగా ఉన్న చెట్టు పక్క బెంచి పై కూర్చున్నారు .
"ఎందుకు బలవంతానా తీసుకువచ్చావు?"అంది రమ.
"నిన్ను చూడలేక"
"నాకేమైంది.బాగానే ఉన్నానుగా?"
"ఆ ఉన్నావు.ఎంత హుషారుగా ఉండెదానివి.మన
ఫ్రెండ్స్ అందరూ నీతో మాట్లాడటానికి ఎంత ఉత్సాహం చూపించే వారు.ఇప్పుడు నువ్వు ఒక ప్రాణం ఉన్న బొమ్మలాగా
తిరుగుతున్నావు.యాంత్రికంగా పనులు చేస్తున్నావు.అదివరకటి మాటలేవి?"
"అప్పటిలా ఎలా ఉంటాను.భాధ్యతలు లేవా?అత్తగారికేమో నేను పెద్దదాన్ని నాకు అన్నీ కూర్చోబెట్ట్ చేయాలని ఉంటుంది.మానసకేమో నేను
ఉద్యోగానికి వెళుతున్నాను మా అత్తగారు ఇంట్లోనే
ఉంటారు అన్నీ ఆమె చూసుకుంటార్లే అనే భరోసా ఆమెది.ఇటు అత్తగారినీ అటు కోడల్నీ
సంతృప్తి పరచాలి.మరి నాకంటూ అస్తిత్వం ఏమి ఉంటుంది?మా అత్తగారిలా పెత్తనం చేయలేను,కోడలిలాగా బాధ్యతా రాహిత్యంగానూ ఉండలేను.రెండు తరాల మధ్య అంతరం తో
నేను సమర్ధించుకో లేకపోతున్నాను."అని ఒక నిట్టూర్పు విడిచింది.
"పెత్తనమూ అక్కర లేదు.బాధ్యతా రాహిత్యమూ అక్కరలేదు.రెండు పాత్రలను
సమన్వయం చేసుకుంటే చాలు.మీ అత్తగారు వెనుకటి తరం కాబట్టి మెల్లగా నీ పనుల ద్వారా నీకనుకూలం గా మార్చుకో.ఆవిడ తిరగ గలరు
కాబట్టి మిగతా వారితో పాటు టేబుల్ మీద పెట్టు.నువ్వు పది సార్లు తిరిగే పని
ఉండదు.మానసకు చిన్నచిన్న పనులు నిదానం గా చెప్పి చేయించుకో.తనకీ బాధ్యత
తెలియాలిగా.ఇప్పుడు తెలుసుకోకపోతే రేపు ఒక్కసారిగా ఒడ్డునపడ్డ ఛేప లాగ విలవిల
లాడతారు.మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా నువ్వు ఓర్పు గా ఉంటే అన్నీ అవే
సర్దుకుంటాయి.నీకైనా ఇప్పటివరకు చదువు,ఉద్యోగం,పెళ్ళి, పిల్లలు బాధ్యత లతోనే సరిపోయిందిగా.నీకూ కొంత విశ్రాంతి
అవసరం.వాళ్ళకు గమనింపు లేనప్పుడు మనమే ఆలోచించు
కోవాలి.మరుగునపడిన నీ హాబీస్ ని బయటకు తియ్యి.నీ కోసం నువ్వు కొంత సమయం
కేటాయించుకో.అదే నీకు వెయ్యేనుగుల బలాన్నిస్తుంది.లేకపోతే నిన్ను నువ్వే
కోల్పోతావు."
"నిజమే నువ్వు చెప్పింది వింటుంటే నేనే అవగాహన లేక
ప్రవర్తిస్తున్నానేమో!నువ్వు చెప్పింది బాగానే ఉన్నది.ఆలోచిస్తాను.పద మనం వచ్చి
చాలా సేపైంది."అంది రమ.
**********
నాలుగు నెలల తరువాత రమ విజయకు ఫోన్ చేసింది.వాళ్ళ ఊరిలో జరిగిన
సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఏకధాటిగా చెప్పుకుపోతోంది.ఆమె గొంతులోని హుషారుని
గుర్తించిన విజయ తృప్తిగా నిట్టూర్చింది.
*********
No comments:
Post a Comment