సుబ్బుమామయ్య
కబుర్లు:
శతకాలు
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
పిల్లలూ, మనం ఈవారం శతకాలు అంటే ఏవిటో తెలుసుకుందామర్రా!
లోకంలో
మంచి వాళ్లు, మహానుభావులు, చెడ్డవాళ్లు,
దుష్టులు, దుర్మార్గులు, నయవంచకులు ఉంటారు. మనం మంచివాళ్లమైనా, ఎదుటివాళ్లు మంచివాళ్లు
మంచిగా ఉండాలని లేదు కదా! అందుకని మనం నష్టపోకుండా, కష్టాలకు
గురవకుండా, మోసపోకుండా ఉండాలంటే లోకజ్ఞానం ఉండాలి.
మనం
స్కూలుకెళ్లి చదివే చదువులు మనకు విజ్ఞానాన్నిస్తాయి. తెలివిడి పెంచుతాయి. ఉపాధిని
కల్పిస్తాయి. సమాజంలో మంచి స్థితినిస్తాయి. కానీ జనాలతో ఎలా వ్యవహరించాలి? లావాదేవీలు ఎలా నిర్వహించాలి? అసలు మన జాగ్రత్తలో మనం
ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది శతకకర్తలు లోకమంతా తిరిగి అనుభవం సంపాదించి శతకాల రూపంలో
మనకు పంచిపెట్టారు. ఒక విధంగా మనపాలిట నిధి.
శతకాల్లో
వేమన శతకము, సుమతీ శతకము, కృష్ణ శతకము,
భాస్కర శతకము, దాశరథి శతకము, శ్రీ కాళహస్తీశ్వర శతకము, భర్తృహరి శతకము, కుమారి శతకము, కుమార శతకము, శ్రీ
నరసింహ శతకము, గువ్వలచెన్న శతకము, కవి చౌడప్ప
శతకము ముఖ్యమైనవి. ఇందులో కొన్ని భక్తిభావంతో భగవంతుని స్తుతిస్తూ, లీలల్ను ప్రస్తుతిస్తూంటాయి.
కవులు
ఒక్కో అంశం ఎంచుకుని వందకు పైగా పద్యాలల్లడం ఎంత గొప్ప విషయమో కదా!
ఒకప్పుడు
పిల్లలు పద్యాలు అలవోకగా భట్టీ పట్టేవారు. అందువల్ల శతకాలు వారి మెదళ్లలో జీర్ణించుకుపోయేవి.
వాటి సహాయంతో జీవితాన్ని ఆనందంగా గడిపేవారు.
సెల్
ఫోన్లలో, కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతూ కాలం వ్యర్థం చేసుకోకుండా మీ
అమ్మనాన్నల్ని అడిగి పద్యాలు చదివించుకుని అర్థాలు తెలుసుకోండి. నేర్చుకోండి. ఎంత బాగుంటాయో.
శతకాలు మన సంస్కృతి. వాటిని కాపాడుకోవాలి.
శతక
ఉదాహరణలు:
వేమన
శతకము!
అల్పుడెప్పుడు
పలుకు నాడంబరముగాను
సజ్జనుండు
పలుకు చల్లగాను
కంచు
మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ
వినుర వేమ!
భావం:
విశ్వానికి నీతిని భోధించే ఓ వేమనా! కంచు వస్తువు మ్రోగునట్లు బంగారు వస్తువు
మ్రోగదు కదా! అలాగే నీచుడు ఎప్పుడూ మంచివానిలా మాట్లాడలేడు!
***
సుమతీ
శతకము!
ఉపకారికి
నుపకారము
విపరీతము
గాదు సేయ వివరింపంగా;
నపకారికి
నుపకారము
నెపమెన్నక
సేయువాడు నేర్పరి సుమతీ.
భావం:
తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామాన్యమయున విషయమే.కానీ తనకు
అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.
***
Baga teluskunnam andi eroju.
ReplyDeleteGuru garu inkonni chepthe inka bagundedi...oka manchi neeti kada kuda chepthe inka better.
Maa lanti vallaki tondaraga ardham avutadi ;-)
..
I liked the illustration and the sayings. Recalled few more sayings which i read in childhood days of school.
Thanks for it.
Regards
m&k