శివమ్మ కథ.. - అచ్చంగా తెలుగు
శివం- శివమ్మ కథ

ఫణి రాజ కార్తీక్ 

శివమ్మ .........
అవును పేరుకు తగ్గ ప్రేమ ,ప్రేమ కు తగ్గ భక్తీ ..ఆమె ఎవరో కాదు నా తల్లి ..అవును పుట్టుక చావు లేని నాకు తల్లి ఏంటి అనా..భక్తులకోసం నేను ఏమన్నా అవుతాను. నన్ను వారు ఎలా ధ్యానిస్తే వారికీ అలా కనపడతాను. నేను జగత్పితను అయినా ఒక భక్తురాలి కోసం ఏమి చేసానో ..ఆ లీల వినండి..

అది ఒక అందమైన ఇల్లు ..అందులో మా అమ్మ శివమ్మ. అవును శివమ్మ కి నేను అంటే ఎంతో ఇష్టం. తన చిన్నతనం నుండి నన్ను పూజిస్తు నే ఉంది .నా యందు ఆమె భక్తీ ఎంతో పరిపూర్ణమైనది.

శివమ్మ శివ లింగానికి అభిషేకం చేస్తుంది –
“శివయ్య, చిన్నతనం నుండి నాకు అన్ని ఇచ్చావ్. నేను ఇప్పుడు ముసలి దాన్ని అయ్యాను ..ఇది వరకు లాగా ఉత్సహంగా నేను పూజద్రవ్యాలతో పూజిమ్పకున్న నా మనసలో మాత్రమూ ఎప్పుడు నీ ధ్యానమే  చేస్తున్నా” అంటుంది.
ఇంటి బయట నుండి ఒక పిలుపు –
‘’అమ్మ తల్లి నాకు అన్నం పెట్టు ”అని.
శివమ్మ లేచి వెళ్లి లోపలి రమ్మని ఉన్నదాంట్లో తనకు చేత నైన విధంగా కడుపు నింపింది ..అతను “అమ్మ! శివమ్మ !ఎప్పుడు వచ్చినా ఆకలి తీరుస్తావు ,నీ చేతులతో ఏమి పెట్టినా అది శివయ్య ప్రసదమే.” అన్నాడు.
అవును శివమ్మ ఏమి చేసినా ఎప్పుడూ నా తల౦పు లో ఉంటుంది. 
అతగాడు మనసులో ఇలా అనుకున్నాడు “శివమ్మ ఎంతో గొప్పది .కాబట్టే కదా తనకు నా అనీ వారు లేకపోయినా అందర్నీ తన సొంతవారి లాగా చూసుకుంటుంది . తన భర్త చనిపోయిన తర్వాత నుండి తను ఒంటరిగా ఉంటుంది ..తను ఎప్పుడు తన తో 'నువ్వు ఒక్కదానివే ఎందుకు ? మాతో ఉండవచ్చు కదా అంటే.. నేను ఒక్కదాన్నీ కాదు నాయనా ! నేను నా  శివయ్య ఇద్దరం ఉంటాo” అంటుంది .అది సత్యము కాబట్టీ నేను ఎప్పుడు ఆమెను కనిపెట్టుకొని ఉంటాను .
సరే వెళ్ళివస్తా అంటూ వెళ్ళిపోయాడు ఇంతలో మరొకడు వచ్చి “శివమ్మఅత్త నేను పని మీద వెళ్తున్న నీ చేతితో నాకు కొంచెం మజ్జిగ ఇచ్చావు అంటే  నా పని అయిపోయినట్టే “ అని అడిగాడు.
శివమ్మ “ఇదిగో నాయన నీ కోసమే చూస్తున్న..చెప్పు నాయన మొన్న ఏదో పుణ్యక్షేత్రాలు చుసివచ్చావు కదా వాటి వివరాలు చెప్పు”
అతడు “అత్తా నా చిన్న తనం నుండి నేను ఎప్పుడూ నీతోనే దేవాలయాలు దర్శించే వాడిని ..ఐనా నువ్వు చూడని పుణ్యక్షేత్రం ఏముంది శివమ్మ అత్త ..మరల చూద్దుగాని రా అంటే ఓపీక లేదు అన్నావ్. అయినా శివమ్మ అత్త ,నువ్వు నీ శివయ్య మీ ఇద్దరు కలిసే ఉంటారుగా! ఇక నీకు ఆ శివయ్య కోసం దేవాలయాలు తిరగాల్సిన పని ఏమి ఉంది ?”
శివమ్మ “అలా కాదు నాయనా .శివయ్య నాతో ఉన్నా మనలో ఉన్నా, దేవాలయ సందర్శన వల్ల కలిగే అనుభూతి అక్కడ స్థల పురాణాలూ ,చరిత్రలు ఎంతో భక్తీ కలిగిస్తై ”
అతడు “అత్త! ఓపీక లేక రాలేకపోయావ్ గాని లేకపోతే నువు చూడని దేవాలయాలు ఉన్నాయా ..సరే అత్త నేను పని చూసుకొని వస్తాను ”అంటూ తన యాత్ర అనుభవాలు చెప్పి మజ్జిగ తాగి వెళ్ళిపోయాడు.
శివమ్మ నాకు పాలతో అభిషేకం చేస్తుంది.
“శివయ్య నిన్ను తలవటం తప్ప నాకు ఏ పూజ విదానం తెలిదు, ఏదో తెలిసిన౦తలో నాకు తెలిసిన పూజ చేస్తుంటాను  ” అంది.
ఇంతలో "నాయనమ్మ!" అంటూ ఒక పిలుపు వచ్చింది. శివమ్మకి మనవరాలి వయసు ఉన్న పాపను ఒక తల్లి ఎత్తుకొని వచ్చి౦ది. ఆ పాప ఏడుస్తుంది “నాయనమ్మ, మా ఇంట్లో పాలు విరిగిపోయాయి ..వంటకి సమయం పడుతుంది. కొంచెం పాలు ఉంటె పాపాకు ఇస్తావా ?“
శివమ్మ దగ్గర నా అభిషేకం చేస్తున్న పాలు మాత్రమే ఉన్నాయ్ ,కానీ శివమ్మ మనసు ఎంతో గొప్పది ఆమె మనసులో ఇలా అనుకుంది ...
“శివయ్య! నాకు తెల్సు నీకు అభిషేకం చేసే కన్నా ఆ పాప ఆకలి తీరిస్తేనే నువ్వు ఆనందపడతావ్ ”అంటూ ఆ పాపాకి పాలు ఇచ్చి తన ఇంట్లో కూడా వంటకు సమయం అపుతుంది అని చెప్పింది.
విషయం తెలుసుకున్న ఆమె “నాయనమ్మ అదేంటి అభిషేకానికి ఉంచుకున్న పాలు ఇచ్చావా ..ఎందుకు అలా  .ఆ శివయ్య ఏమైనా ...” 
“ఆ శివయ్య ఏమి అనుకోడు, నిజానికి ఆయిన ఇక్కడ  ఉంటె తను కూడా ఇదీ పని చేసేవాడు .” అంది శివమ్మ. 
ఇలా శివమ్మ ఎవరు అడిగినా తనకు చేతనైన సాయం చేస్తుంది .అదీ నిజమైన మానవత్వం.
ఇంతలో మరొకడు వచ్చాడు “పెద్దమ్మ నువు కూరగాయలు తెమ్మన్నావు కదా, తెచ్చాను .ఇక నీ చేతితో చేసిన వంట తినకుండా కదిలేది లేదు ”అన్నాడు చనువుగా.
శివమ్మ “నీ కోసమే చూస్తున్న చెప్పు ఏం చేయమంటావ్ ” అని అడిగింది.
అతడు మనసులో “మా పెద్దమ్మ శివమ్మ ఎంతో ధన్యురాలు .తనకు ఉన్న సంపదలు తనుకు కొంచెం ఉంచుకొని, మిగిలింది అంతా అక్కడ ఒక శివాలయ నిర్మాణంకి, మాన్యానికి ఇచ్చింది. దానికి ఆమె చెప్పిన మాట ‘శివయ్య ఇచ్చింది మళ్ళీ ఆయనకు ఇవ్వటమే కదా ! అయినా  ఎవరు లేని ముసలిదాన్ని. నాకు ఎందుకు ఆస్థి ’అని ,ధనం ఉన్నవాడు కాదు ఐశ్వర్యవంతుడు ,దాన గుణం, భక్తీ ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు అలా చూస్తె మా పెద్దమ్మ కన్నా ఐశ్వర్యవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు ”అనుకుంటూ  "పెద్దమ్మ" అన్నాడు ప్రేమగా.
అతడు “పెద్దమ్మ నువు ఏమిచేసినా బాగుంటుంది ..ఇదిగో పెద్దమ్మ నేను ఒకటి చెబుతా విను ..నీకు ఎప్పుడైనా శివయ్య నిజంగా కనపడితే  ఒక వరం కొరుకో ..అదేంటి అంతే శివయ్యను నా  చేతి వంట తినిపో ఇక చూడు శివయ్య ఎక్కడకి  పోడు ” అన్నాడు చనువుగా.
శివమ్మ “ఎందుకు రా” అంది ముద్దుగా
అతడు ”పెద్దమ్మ నీ చేతి వంట తింటే శివయ్య ఇక కదలడు,ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఇక చూడు పార్వతి మాతా, బ్రహ్మ సరస్వతులు ,విష్ణు దేవుడు, లక్ష్మి దేవి, వినాయకుడు, కుమారస్వామి, నంది, బృంగి, అందరు దేవతలు వచ్చి మా శివయ్యని మాతో పంపు అని గొడవ చేస్తారు ” అన్నాడు నవ్వుతూ.
ఆ మాటకి ఇద్దరు నవ్వుకున్నారు ..
అవును అతగాడు చెప్పింది నిజమే. ఆమె నాకు నైవేద్యం పెట్టింది తింటూ ఉంటా కదా .ఆమె వంట కన్న తల్లి ప్రేమను గుర్తింపచేస్తుంది.
అతడు “ఏం పెద్దమ్మ నేను చెప్పిన వరం కోరుకో ,నీకు ఎలాగో ముక్తి ఖాయం ” అన్నాడు.
శివమ్మ అతగాడికి శుష్టుగా భోజనం పెట్టింది.
కానీ శివమ్మ మనసులో ఒక అసంర్ణమైన కోరిక ఉంది ..ఆ కోరిక తీర్చటానికి నేను చేసిన లీల ,నాకు సైతం ఆనందబాష్పాలు వచ్చేలా చేసింది...
(సశేషం)

No comments:

Post a Comment

Pages