ఉగాది శోభ
ఉత్పలమాల
వచ్చె వసంత కోకిలలు వన్నెలుతోను వసంతలక్ష్మిలా
తెచ్చెను సంబరాల మధు తేనెలు మాకు ఉగాది నాడుగా
తెచ్చె వసంత కాలమున తేట వనాల శుభాలు మర్వకా
పచ్చని పక్షులా కళలు పాఱె ఉగాది వసంత శోభలో౹౹
ఉత్పలమాల
వచ్చెను వచ్చెనూ కనక వర్షపు జల్లుల మా యుగాదిగా
తెచ్చెను పక్షులా నగవు తేట వనాల గమత్తులందుగా
తెచ్చెను తెచ్చెనూ పసిడి తేటదనం జగమందు కమ్మగా
వచ్చెను ఆమనీ పసిడి వచ్చలు మాకును యివ్వ చల్లగా౹౹
ఉత్పలమాల
కోకిల పాట మా మదికి కోరికమీరను శాంతమిచ్చునూ
కోకిల గుంపులా రవళి కొమ్మలలో విన సొంపుగుండునూ
కోకిల మాట మా మనసు కొల్నులొ అందముగాను పాఱునూ
కోకిల మా వసంతముకు కోరిక మీరగ శోభలిత్తునూ౹౹
***
No comments:
Post a Comment