శ్రీ వేణీమాధవ ఆలయం, ప్రయాగ
పంచ మాధవ క్షేత్రాలు - 3
శ్రీరామభట్ల ఆదిత్య
పవిత్రతకు నిలయం ప్రయాగ క్షేత్రం. హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయాగ పుణ్యక్షేత్రం వెలసియుంది. పవిత్ర త్రివేణీ సంగమంగా పేర్కొనే అలబాద్ నగరాన్నే ప్రయాగగా వ్యవహరించడం పరిపాటి. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళ మహోత్సవాలు ఈ ప్రయగా పుణ్యక్షేత్రానికి మరింత శోభను సంతరించిపెట్టాయి. దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ సంగమిస్తాయని వీటితోపాటు సరస్వతీనది కూడా ఇక్కడ అంతర్లీనంగా వచ్చి కలుస్తుందని చరిత్ర చెబుతోంది. అందుకే పవిత్ర నదులైన ఈ మూడు నదులు కలవడం ద్వారా దీన్ని త్రివేణి సంగమంగా భక్తులు వ్యవహరిస్తుంటారు. ఇంతటి మహత్యం ఉండడం వల్లే ఈ పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించడంతో పాటు మానవులకు ఇహ, పరలోక సౌఖ్యాలు అందివస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రయాగకు దగ్గరలోని దారాగంజ్ లో ఉన్నది. తీర్థరాజమైన ప్రయాగకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు... ఈ దారాగంజ్ ప్రాంతం అలహాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఈ ఆలయం ప్రయాగలో పవిత్ర యమునా నది తీరంలో సరస్వతీ ఘట్ కు దగ్గరగా ఉంది..అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించకముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట. ఇక్కడి వేణీమాధవుణ్ణి "వేణీ మాధో భగవాన్" కూడా అంటారు.. ప్రయాగలోని 12 మాధో ఆలయాల్లో ఈ వేణీ మాధవ ఆలయం చాలా ప్రముఖమైనది... తులసీదాసు తన "రామచరితమానసము"లో ఈ వేణీమాధవుణ్ణి ప్రయాగకు రాజుగా అభివర్ణించాడు... ఇంకా ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు ఈ వేణీమాధవుణ్ణి దర్శించకుంటే ఆ స్నాన ఫలం పొందరని కూడా తన రామచరితమానసంలో చెప్పాడు తులసీదాసు..
శ్రీ వేణీమాధవ స్వామి ఆలయం లక్ష్మీనారాయణులకు అంకితం ఇవ్వబడింది. ఈ ఆలయంలో మనకు లక్ష్మీదేవి తోపాటు నారాయణుని విగ్రహాలు కనిపిస్తాయి కాబట్టి ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ దేవాలయం అని కూడా అంటారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగ క్షేత్రానికి ఈ వేణీమాధవుడే అధిదేవత. ప్రయాగలో జరిగే కుంభమేళా మరియు అర్థకుంభమేళా సమయంలో ఈ ఆలయం కిక్కిరిసిపోయి ఉంటుంది. పవిత్ర క్షేత్రమైన ప్రయాగ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటని మనందరికీ తెలుసు. తమ వనవాసంలో సీతారామలక్ష్మణులు ఈ ఆలయాన్ని దర్శించినట్టు చెప్పబడి వుంది...శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ప్రయాగ వచ్చినప్పుడు ఇక్కడ కొంత కాలం గడిపారు..ఈ ఆలయంలోని రాధాకృష్ణుల మూర్తుల చాలా అందంగా ఉంటాయి.. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తారు..త్రివేణీ సంగమ స్థానం నుండి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది....ప్రయాగ వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి....
(సశేషం)
No comments:
Post a Comment