నాకు నచ్చిన కథ-నీలి-శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ-నీలి-శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు

Share This
నాకు నచ్చిన కథ-నీలి-శ్రీ పురాణంసుబ్రహ్మణ్యశర్మ గారు 

శారదాప్రసాద్ ​(​టీవీయస్.శాస్త్రి

​)


శ్రీ పురాణం సుబ్రహ్మణ్య గారు(1929 -1996 ) ప్రఖ్యాత కథకులుగా,నవలా రచయితగా,పత్రికా సంపాదకులుగా అందరికీ చిరపరిచితులు.కథలు వ్రాసి చదివించటమే కాదు,ఆనందం, ఆలోచనను 'గారంటీ'
​ ​
గా హామీ ఇవ్వగల గొప్ప సత్తాగల రచయిత ఈయన.చలం గారిని గురించి 'తెలుగు వెలుగు -చలం'అని ఒక్కోటి మూడు వందల పేజీలకు తగ్గకుండా మూడు భాగాలుగా చలం గారిని పూర్తిగా ఆవిష్కరించిన మహానుభావుడు శ్రీ శర్మ గారు.ఇవన్నీ ఒక ఎత్తైతే,వారి'ఇల్లాలి ముచ్చట్లు'
​ ​
మరో ఎత్తు.పురాణం సీత అనే కలం పేరు మీద వారం వారం అందరినీ అలరించిన ఆ ముచ్చట్లు మరచిపోలేనివి.
​ ​
చాలా మంది
​ ​
పురాణం సీత వారి ఇల్లాలని కూడా భ్రమించారు.మునిమాణిక్యం వారి 'కాంతం'ఎంత మురిపించిందో అంతకన్నా తక్కువ కాకుండా పురాణం సీత కూడా ఒక ఊపు ఊపింది.ఇల్లాలి ముచ్చట్లు
--నిజం చెప్పాలంటే ఒక సరసురాలు,గడుసరి అయిన ఇల్లాలి స్వగతాలు.మంచి చెణుకులు,చక్కని భాషా ప్రయోగాలు,భర్తలను ఏ మాత్రం బాధ పెట్టకుండా ఇల్లాలు వేసే జడదెబ్బలు అవి.ఆ దెబ్బలు 
ఎంత ఆనందం కలిగిస్తాయో చెప్పతరం కాదు."మొగుళ్ళు పెళ్ళాలను తన్నటం బూర్జువా సంస్కృతి. పెళ్ళాలు పళ్ళాలు
​ ​
గిరాటెయ్యటం,మొగుళ్ళను తన్నటం విప్లవ సంస్కృతి.సత్యభామ సిసలైన సోషలిస్ట్ 
​. 
అందుకనే మొగుణ్ణి ఫెడీల్మని తన్నింది"."మీరు ఇంటలెక్చువల్స్ అయితే కావచ్చు,నేను వంటలెక్చువల్,పనిమనిషి అచ్చమ్మ అంటలెక్చువల్."
​ ​
ఇలాంటి ముచ్చట్లు చదువుతుంటే,
​ ​
మరుసటి వారం ఎప్పుడు వస్తుందా అని మగవాళ్ళు ఎదురుచూసిన రోజులు నాకింకా జ్ఞాపకం.శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు గిలిగింతలు పెట్టే కథలు వ్రాయటంలో మంచి దిట్ట.దాదాపు మూడు వందలకు పైగా కథలు వ్రాశారు.అందులో,నా మస్తిష్కంలో నిలిచిపోయినవి ముఖ్యంగా
​ ​
కోతి,మరచెంబు,శివకాంత,రాజనీతి,నీలి.వీటిల్లో ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన కథ మాత్రం'నీలి' అని చెప్పవచ్చు.అమెరికాకు చెందిన' న్యూయార్క్ ట్రిబ్యూన్'వారు నిర్వహించిన రెండవ ప్రపంచ కథానికల పోటీకి తెలుగులో ఎన్నికయిన కథల్లో 'నీలి'కి ప్రధమ బహుమతి లభించింది.శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి 'గాలివాన'కు అంతర్జాతీయ పోటీల్లో ప్రపంచం మొత్తం మీద ద్వితీయ బహుమతి లభించింది
​. ​
'నీలి' కథలోమనిషిలోని సాధారణ మనస్తత్వాన్ని మనకు ఎన్నో కోణాల్లో అతి చక్కగా చూపిస్తాడు శ్రీ శర్మ గారు.ఇక కథలోకి వెళ్లుదాం.
***
నేను
​ ​
ఒక రైల్వే ఉద్యోగిని.ఇంకా పెళ్లి కాలేదు.ఒక చిన్న లాడ్జిలో నెలవారి అద్దెకట్టుతూ ఒక గదిలో
ఉంటున్నాను.ఆ లాడ్జి యజమాని పేరు మల్లయ్య.అతని మేనకోడలే 'నీలి'.ఆమెకు అందంతో పాటు చదువూ సంధ్యలు కూడా లేవు.నిజం చెప్పాలంటే
​ ​
నిరక్షరకుక్షి.వీటిని మించి
​ 
కుంటిది కూడా ఆమె.కుంటికాలు ఈడ్చుకుంటూ,కర్ర చప్పిడి చేసుకుంటూ ఏవగింపు కలిగిస్తుంది చూపరులకు.మల్లయ్యకు ఒక కొడుకు 
​ఉ
న్నాడు.వాడు పుట్టుకతోనే వెర్రివాడు.వెర్రివాడైనా
​ ​
'మగవాడు' కాబట్టి ,తన కొడుక్కి నీలినిచ్చి పెళ్లి చేయాలని మల్లయ్య ఆలోచన.వీళ్ళతో 
​​
​ఉం
టున్న ముసలమ్మకు కూడా అదే ఇష్టం.ఆ వెర్రి వాడికి,నీలి అంటే ప్రాణం.వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగానే 
​ఉ
న్నాడు.గదులన్నీ ఊడుస్తూ,మామ గారింట్లో బండెడు చాకిరీ చేసే నీలికి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు.ఇది నేను లాడ్జిలో దిగక ముందునుంచీ 
​ఉ
న్న కథ.ఆ తరువాతి కథను చెబుతాను.రోజూ గదిని 
​ఊ
డవటానికి వచ్చే ఆమెను చూస్తే నాకు చచ్చేటంత ఎలర్జీ.ఆ రూ
​​
పం,కుంటి తనం చూస్తే నాకు కడుపులో దేవినట్లు 
​ఉం
డేది.
​ ​
కానీ
​ ​
నీలికి మాత్రం
​ ​
నేనంటే అంతులేని ఆరాధనా భావం.నాకు ఏ మాత్రం కష్టం వచ్చినా,ఆమె మనసు విలవిల లాడిపోతుంది.నాకు ఒకసారి జ్వరం వచ్చి,గది అంతా వాంతులు చేసుకుంటూ 
​ఉం
టే,గదిని శుభ్రం చెయ్యటమే కాకుండా,ఒక తల్లిలా,స్నేహితురాలిలా నాకు మరువలేని సేవలు చేసింది
​ ​
నీలి!నీరసంగా 
​ఉం
డి నేను భోజనానికి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితులలో
​ ​
నీలే కుంటికాలు ఈడ్చుకుంటూ,హోటల్ నుండి కేరియర్ లో భోజనం కూడా తెచ్చేది.నేనూ మనిషేనే కదా! నీలి చేస్తున్నఈ సేవ,ఆత్మీయత నాలో ఆర్ద్రతా భావాన్ని నాకు తెలియకుండానే కలిగించాయి.ఈ భావం క్రమంగా పెరిగి,ఆమె కాలికి ఆపరేషన్ చేయిద్దామనుకున్నాను.దానికోసం ఆమెకు పుష్టికరమైన ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశాను.జీవితం పట్ల ఆమెకు
​ ​
 
ఆశను
​ ​
కలిగించాను.
​ ​
నా ఈ భావనలో ఏ స్వార్ధం లేదు,
​ ​
ఆమె పట్ల జాలి తప్ప!మంచి అందగత్తెను పెళ్ళాడనుకునే నాలో,నీలి పట్ల మరో భావం ఉండటానికి ఆస్కారంలేదు.
​ ​
కానీ
​ ​
నేను చేస్తున్న ఈ పనులు నీలిలో మరో రకం భావనను కలిగించాయి.నా గురించి కలలు కూడా కంటుందేమో!ఆపరేషన్ వికటించినపుడు
​ ​
ఆమెకు జీవితంపట్ల ఆశ కలిగించి ఆపరేషన్ విజయవంతం కావటం కోసం,చావు బతుకుల మధ్యలో నున్న ఆమెతో,"నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను"అని అసత్యం పలికాను.ఆ అసత్యమే ఆమెకు దివ్యమైన ఔషధంగా పనిచేసింది.ఆమెకు పూర్తి స్వస్థత చేకూరింది.నేను ఆడిన అబద్ధం యొక్క  పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు!అందుకే,ఆమె హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేసరికి ,చెప్పాచెయ్యకుండా
​ ​
గుట్టు చప్పుడు కాకుండా లాడ్జి నుండి పారిపోయాను.నేను నాటకంలో నా పాత్రను సమర్ధవంతంగా 
నిర్వహించాననుకుంటున్నాను. తరువాత నీలి ఏమైందో నాకు తెలియదు.తెలుసుకోవాలనికూడా లేదు.

​******​
కథ ముగిసింది.ఈ కథలో
​ ​
నేను త్యాగాలు చేసే సినిమా హీరో
​ ​
'త్యాగరాజును' కాదు,అమాయకురాలైన స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించే రాక్షసుడినీ కాదు.ఒక సగటు మనిషిని.సాయం చెయ్యటం,ఉదారత చూపటం,మానవత్వం అన్నీ నాలో 
​ఉ
న్నాయి.అందుకే ఆమెకు ఆపరేషన్ చేయించాను.ఆమె మనసులోని భావాలకు నేనెలా కారకుడిని?తరువాత
​ ​
ఆమె జీవితం
​ ఎ
లా సాగింది?ఆ వెర్రి వాడినే పెళ్లి చేసుకుందా?ఆ పిల్లకు నేనేమైనా అన్యాయం చేశానా? వీటన్నిటికీ నేటికి కూడా నాకు సమాధానం లభించటం లేదు.సమాధానం దొరకని ప్రశ్నల్లోనే గొప్పతనం 
​ఉం
టుంది.ఆ గొప్పతనం ఏమిటంటే,అవి మనల్ని నిరంతరమూ 
వెన్నుతట్టుతుంటాయి.తప్పులేమన్నా చేస్తే,వాటిని పునరావృతం కానీయవు.మనలోలోపాలేమైనా 
​ఉం
టే సరిదిద్దుతాయని నా అభిప్రాయం.
 శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి నా నివాళి!

2 comments:

  1. ఇందులో నీలిని అతనుగాయ పరచాడు అనటం సబబు కాదు అనిపిస్తుంది.అతను జాలి చూపాడు.ఆమె మరోలా అర్ధం చేసుకుంది. అతను ఏమీ గమనించ నట్లు..వెళ్లిపోయాడు.మంచి వాడు కనుక ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకు ఆమె ని వాడుకోలేదు

    ReplyDelete
    Replies
    1. మీ సుస్పందనకు ధన్యవాదాలండీ!

      Delete

Pages