(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్ కి ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. దానితో అనాధలైన మధురిమ, బాబులను తనతో తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చి, మధురిమకు ఉద్యోగం ఇప్పిస్తాడు దామోదర్ రెడ్డి. మధురిమతో లేడీస్ హాస్టల్ పెట్టించాలని చరణ్, విక్రం కలిసి ఒక భవంతిని అద్దెకు తీసుకుంటారు.)
పి.బి.ఆర్ కాంప్లెక్ చూపిద్దామని మధురిమని తీసుకెళ్లాడు చరణ్. మధురిమా రోడ్డు మీదనుండే ఆ బిల్డింగ్ చూసి, హడలిపోయి, ‘మాస్టర్ కాలేజీ నేమ్ బోర్డు’ దగ్గరే ఆగిపోయింది.
“ఇంత పెద్ద బిల్డింగ్ ని మెయింటెయిన్ చెయ్యడం నా వల్ల కాదు చరణ్. అందులో లేడీస్ హాస్టలంటే సామాన్యం కాదు. అది అమ్మాయిలతో కూడిన పని. ఒకరున్నట్లు ఒకరుండరు. ఒకరు మాట్లాడినట్లు ఇంకొకరు మాట్లాడారు. నాకు లేనిపోని మాటలు వస్తాయి. ప్రతిరోజు ఈటెల్లాంటి మాటలు పడుతూ మనశ్శాంతి లేకుండా బ్రతకాలి. నాకీ హాస్టల్ ఫీల్డ్ వద్దు. నేనీ బిజినెస్ చెయ్యలేను” అంటూ కచ్చితంగా చెప్పింది మధురిమ.
ఆలోచించాడు చరణ్. ఎప్పుడైనా మనం ఎన్నుకునే వృత్తిగాని, లక్ష్యం గాని మనకు ఇష్టమైనదైతేనే ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరవచ్చు. లేకుంటే దారితప్పిన బాటసారిలా అవుతుంది. పిన్నిని బలవంతంగా ఈ ఫీల్డ్ లోకి దింపితే పర్యవసానం బావుండదని పించింది.
అంతలో విక్రమ్ అక్కడికి వచ్చాడు.
మధురిమ చెప్పిన మాటలు విక్రమ్ తో చెప్పాడు చరణ్.
"ఇష్టపడి చేసే పనిని ఎవరైనా చేస్తారు పిన్నీ అన్ని పనులు ఇష్టపడి చేసుకోవటంలోనే మన శక్తి సామర్వాలు కనిపిస్తాయి. విజయవంతంగా జీవిస్తున్న వ్యక్తుల్ని మీరొకసారి పరిశీలించండి! వాళ్లెన్ని సమన్యల్ని కషాలను ఎదుర్కొంటున్నారో! ఇతరులనుంచి గౌరవాన్ని ఏవిధంగా పొందుతున్నారో ఇతరులకన్నావాళ్ళెంత డిఫరెంట్గా జీవిస్తున్నారో మీకు అర్థం అవుతుంది" అన్నాడు విక్రమ్. విక్రమ్ ఆలోచనలెప్పడు భారీస్థాయిలో వుంటాయి. అతని ప్రవర్తన కూడా అలాగే వుంటుంది. అతని ప్రభావం అతని ప్రక్కనున్న వ్యక్తులపై కూడా పడుతుంది.
మధురిమ మాట్లాడలేదు. ఆమెకు ఆ ఫీల్డ్ అంటేనే భయంగా వుంది. అందులో వుండే రిస్క్ను తలచుకుంటేనే దడగా వుంది.
చూడు పిన్నీ మనం ఏదైనా ఓ పని చెయ్యాలనుకున్నప్పుడు తప్పకుండా రిస్ వుంటుంది. రిస్క్ లేకుండా ఏ పనీ వుండదు. ఈ ఒక్కసారి మీరు ఈ రిస్క్ ని పేస్ చెయ్యగలిగారంటే మీ బాధలు, భయాలు తగ్గి పోయి హాయిగా జీవించ గలుగుతారు. ఇది ఇప్పడు మీకు వచ్చిన అరుదైన ఛాన్స్ అనుకోండి!" అన్నాడు విక్రమ్.
“ఇది నాకు ఛాన్స్ లాగ కనిపించడం లేదు విక్రమ్! ఇదో పెద్ద సంస్థ. ఒక్కసారి ఇందులో దిగావంటే పైకి రాలేక, అందులో ఉండలేక గిలగిల కొట్టుకుంటానేమో ననిపిస్తుంది. ఇప్పడు పెనంమీద రొట్టెలా వున్న నేను ఒక్కసారిగా జారి పొయ్యిలో పడ్డట్లయితానేమోనని భయంగా వుంది. అయినా నాకిప్పుడు చరణ్ ఫ్యాక్టరీ పని ఉంది కదా ఇంకా ఏ పని అవసరం లేదు అంది మధురిమ.
మధురిమ అభిప్రాయం విని మౌనంగా వున్నాడు చరణ్.
విక్రమ్ మాత్రం పట్టువదలని విక్రమార్ముడిలా మధురిమను ఎలాగైనా ఒప్పించాలని ఒక్కక్షణం పెదవి కొరుకుతూ ఆలోచించాడు.
"మీ భయం చూస్తుంటే, చిన్నప్పుడు మా నానమ్మచెప్పిన కథ గుర్తిస్తుంది పిన్నీ! ఆ కథ మీకు చెబుతాను వినండి!" అన్నాడు విక్రమ్.
వినటానికి సిద్ధంగా వున్నట్లు విక్రమ్ వైపు చూశారు మధురిమ, చరణ్, చెప్పటం ప్రారంభించాడు విక్రమ్.
“ఒక శిల్పి ఒక దేవతామూర్తి విగ్రహం చెక్కటానికి ఓ మంచిరాయికోసం వెతుకుతూ కన్పించిన ప్రతి రాయినీ అడిగాడట. నిన్ను విగ్రహంగా చెక్కనా అని. "అమ్మో! విగ్రహంగా చెక్కడమంటే ఉలి, సుత్తితో మమ్మల్ని చిత్రహింసలు పెడతావు" అని ఏ రాయి ఒప్పకోలేదట. అందులో ఒకరాయి తనని చెక్కటానికి ఒప్పకుందట. ఆ రాయిని చక్కటి దేవతా విగ్రహం క్రింద చెక్కి ఒక దేవాలయంలో ప్రతిష్టించారట.ఆ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందటంతో అక్కడున్న మిగతా రాళ్లన్నిటినీ తీసుకువెళ్లి భక్తులు కొబ్బరికాయలు కొట్టటానికి వీలుగా అమర్చారట. ఇప్పడు ప్రతిరోజూ విగ్రహం అవ్వటానికి ఒప్పకోని ఆ రాళ్లన్నిటి మీద కొన్నివందల కొబ్బరికాయలతో రోజూ తలమీద మోదుతుంటే, స్వయంగా ఉలిదెబ్బలకి అంగీకరించిన రాయి దేవతామూర్తి అయి నీరాజనాలందుకుంటోంది" అన్నాడు విక్రమ్.
అది వినగానే విక్రమ్ ని ప్రశంసిస్తున్నట్లు చరణ్ కళ్లు తళుక్కున మెరిశాయి.
విక్రమ్ మాటలు మధురిమలో నిద్రాణమైవున్న శక్తిని రీచార్జి చేశాయి. ఆమె శక్తిమీద ఆమెకు నమ్మకం కల్గించాయి. అది ఎంతటి నమ్మకం అంటే పర్వతాన్ని సైతం కుదిపేసేటంతటి నమ్మకం. ఆ నమ్మకంలో అంత బలం ఉంది.
ఇంకేం ఆలోచించకుండా హాస్టల్ మెయింటెయిన్ చెయ్యటానికి మనస్పూర్తిగా ఒప్పకుంది మధురిమ.
*****
లేడీన్ హాస్టల్ ని పంతులుగారినడిగి మంచి మహూర్తం పెట్టించాడు చరణ్. హాస్టల్ కి ఏ పేరు పెడితే బావుంటుందో కూడా అప్పుడే అడిగారు పంతులుగారిని. ‘మ’ అక్షరం వచ్చేలా ఏ పేరుపెట్టినా దివ్యంగా వుంటుందన్నారు పంతులు గారు.
‘మ’ అక్షరంతో పెట్టమన్నారు కాబట్టి మధురిమ గర్ల్స్ హాస్టల్ అంటే బావుంటుంది అన్నాడు విక్రమ్. ఆ పేరు చరణ్ కి బాగా నచ్చింది. ఆ పేరు వినగానే మధురిమ ఆనందానికి అవధుల్లేవు. పేరైతే పెట్టారు. మరి పెట్టుబడి?
ఆలోచనలో పడింది మధురిమ.
“చరణ్! మీ బాబాయి చేయించిన నగలన్నీ నా దగ్గరే వున్నాయి. కష్టసమయంలో లో కూడా వాటిని నేను కదిలించలేదు. ఆ నగలు బ్యాంకు లో పెట్టి లోన్ తీసుకుందాం. ముందుగా బిల్డింగ్ అడ్వాన్స్ కడదాం. తర్వాత కాట్స్ కి ఆర్డర్ ఇద్దాం. వంట చెయ్యటానికి అవసరమయ్యే సామాన్లన్నీ రేపు మనిద్దరం వెళ్లి కొందాం” అంది మధురిమ.
“సరే"! అన్నాడు చరణ్.
"మధురిమ గర్స్ హాస్టల్ పేరుతో బేనర్లు తయారుచేయించి, అన్ని సెంటర్లలో కట్టిద్దాం. బాగా అవసరమైన చోట పెయింటర్ని పిలిపించి రాయిద్దాం. పాంప్లెట్స్,విజిటింగ్ కార్డులు కొట్టించి అన్ని కాలేజీలల్లో పంచుదాం" అంది మధురిమ. మధురిమకి తను జాబ్ చేస్తున్నటైంలో వంట చెయ్యటం బోరనిపించి దివ్యతో కలసి కర్నూల్లో కొన్ని హాస్టల్స్ తిరిగిన అనుభవం వుంది.
“సరే” అంటూ తమ ఉత్సాహాన్ని తెలియజేశారు విక్రమ్, చరణ్ ఆ కాలేజీల దగ్గరకెళ్లి పంచటానికి ఓ పిల్లవాడిని మాట్లాడుకోవాలనుకున్నారు. హాస్టల్ లో వంటచెయ్యటానికి ఒక వంటమనిషి, ఇద్దరు పనిమనుషులు కావాలని, ‘లేబర్ కాలనీ’లో ముందుగానే చెప్పివుంచారు.
హాస్టల్ కి సంబంధించిన పనులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ప్రశాంతమైన పరిసరాలకి తగినట్లుగా, అన్ని సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా ‘మధురిమా గర్ల్స్ హాస్టల్’ రెడీ అయ్యింది.
మడికొండ నుండి రాహుల్ ని తీసుకొని హన్మకొండ వచ్చింది మధురిమ. హాస్టల్ ని నడుపుకుంటూ రాహుల్ ని చదివించు కుంటుంది.
అన్ని కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జాయిన్ అయిన డిగ్రీ సూడెంట్స్ ‘మధురిమ హాస్టల్ లో ‘ జాయిన్ అయ్యారు.
డిగ్రీ అడ్మిషన్లు అడ్మిషన్ల పూర్తయ్యాక పి.జి కౌన్సిలింగ్ మొదలైంది. పి. జి కౌన్సిలింగ్ జరుగుతున్న టైం లోనే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ల పేరెంట్స్ వచ్చిమధురిమ హాస్టల్ చూసివెళ్లారు.
సూడెంట్స్ వచ్చినా, పేరెంట్స్ వచ్చినా మధురిమనే కలుస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెబుతుంది మధురిమ. ముందుగా మధురిమ హాస్టల్ డీటైల్స్ రూల్స్ చెబుతుంది. తర్వాత ఎవరికి, ఏ రూంలో ఏ బెడ్ యివ్వాలో తానే స్వయంగా వెళ్లి చూపిస్తుంది. వాళ్ళు ఓ.కే అన్నాక వాళ్ల చేత ఫాం పిలప్ చేయిస్తుంది. హాస్టల్ ఫీజు కట్టించుకొని, వాళ్లను హాస్టల్లో జాయిన్ చేసుకుంటుంది.
పిల్లలకి టైం ప్రకారం అన్నీ అందే విధంగా పనివాళ్లతో చెప్పి చేయిస్తుంది. రేషన్ గాని, కూరగాయలు గాని, సిలిండర్లు గాని అయిపోకముందే ఎప్పటికప్పుడు ఫోన్స్ చేసి తెప్పించుకుంటుంది. ఎలక్రిసిటీ బిల్లు, ఫోన్బిల్లు, బిల్డింగ్ రెంట్ నెలకోసారి తనే స్వయంగా వెళ్లి కట్టుకుంటుంది. హాస్టల్ మొత్తం తనదే అయినందువల్ల ఏ చిన్నప్రాబ్లమ్ వచ్చినా తనే సాల్వ్ చేసుకుంటుంది. మధురిమ హాస్టల్ ఫిల్డ్ లో సెట్టయ్యాక చరణ్, విక్రమ్ వాళ్ల పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు.
పి.జి. అడ్మిషన్లు మొదలయ్యాయి.
కొన్సిలింగ్ టైంలో వచ్చి హాస్టల్ చూసివెళ్లిన అమ్మాయిలు మాత్రం డైరెక్ట్ గా లగేజీలతో వచ్చి మధురిమ హాస్టల్లో జాయిన్ అయ్యారు.
మేధ, మేధ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చి మధురిమ హాస్టల్లో జాయినయ్యారు. డిగ్రీ, ఎం.సి.ఏ, ఎం.బి.ఎ., బి.టెక్ సూడెంట్స్ తో మధురిమ హాస్టల్ నిండిపోయింది మధురిమ హాస్టల్లో ఇంక ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు.
“మధురిమ హాస్టల్లో ఎక్కువగా కరీంనగర్, అదిలాబాదు ఖమ్మం వరంగల్ జిల్లాల అమ్మాయిలు వున్నారు. ఒక్క మేధది మాత్రం హైద్రాబాదు. మేధ ఫ్రెండ్స్ ది నల్గొండ.
మేధ చదువుతున్న కాలేజీలోనే బి.టెక్. ఫస్టియర్లో జాయినయ్యింది వర్ష. వర్ష వాళ్ల మమ్మీ రోజామణిని, అమ్మమ్మ రుద్రాణిని వెంటబెట్టుకొని నేరుగా మధురిమ హాస్టల్కి వచ్చింది. లగేజీ కూడా తెచ్చుకుంది.
“నా హాస్టల్లో వెకెన్సీ లేదమ్మా!" అంది వర్షవాళ్లను చూడగానే మధురిమ. హాస్టల్ లో ఖాళీ లేదని తెలియగానే రోజామణి ,రుద్రమణి భయపడ్డారు.
నవ్వు ముఖంతో ప్రశాంతంగా కన్పిస్తున్న మధురిమను చూడగానే రోజామణికి ధైర్యం వచ్చింది. మధురిమతో మాటలు కలిపింది. హాస్టల్లో వెకెన్సీ లేదని ఎంత చెప్పినా రోజామణి వినలేదు. రిక్వెస్ట్ చేస్తూ మధురిమ దగ్గరే కూర్చుంది. మధురిమకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఎలాగైనా చూడండి మేడమ్! నేను మీ హాస్టల్ గురించి మా హైదరాబాదులోనే విన్నాను. మావారు కూడా వర్షను మీ హాస్టల్లోనే జాయిన్ చెయ్యమని చెప్పారు. మీ హాస్టల్ ప్రక్కన రూరల్ డి.యస్.పి. ఆఫీసు వుందట కదా! అందుకే మీ హాస్టల్లో వుండే అమ్మాయిలకి సెక్యూరిటీ ఎక్కువగా వుంటుందన్నారు. ఎప్పడైనా అమ్మాయిల్ని ఓ చోట వదిలేటప్పడు తగినంత సేప్టి కూడా చూసుకోవాలిగా మేడమ్! మా వర్షను మీ హాస్టల్లోనే వుంచాలని వుంది. అదీకాక మిమ్మల్ని చూస్తుంటే, మీ సాఫ్ట్ నెస్ చూస్తుంటే మాకే ఇక్కడ వుండాలనిపిస్తోంది. “ అంటూ చేతులు పట్టుకొంది రోజూమణి. రుద్రాణి కూడా మధురిమనే చూస్తూ కళ్లతోనే బ్రతిమాలింది.
అప్పటికే రుద్రాణి ఆ హాస్టలంతా తిరిగి చూసివచ్చింది. తన మనవరాలిని ఉంచితే ఆ హాస్టల్లోనే వుంచాలనుకొంది.
“చూడండి! రోజామణిగారు! మీరు చెప్పేది బాగానే వుంది. బెడ్ ఖాళీ వుంటే వర్షను నేను తప్పకుండా తీసుకొని వుండేదాన్ని మీరు కాస్త ముందుగా వచ్చివుంటే ఈ ప్రాబ్లమ్ వుండేది కాదు" అంది మధురిమ.
”నేను ముందే వచ్చేదాన్ని మేడం! మా వారు దీన్ని బలవంతంగా డిగ్రీలో చేర్పించారు. బి.టెక్ అయితే సీటు కొనాలి. డబ్బు ఎక్కువ అవుతుందని ఆయన బాధ. అదేమో డిగ్రీ చెయ్యనని మొండికేసింది. నేను చిట్టీలు కడుతుంటాను. అందరిచేత కట్టిస్తుంటాను. డబ్బులెప్పుడైనా సంపాయించు కోవచ్చు మేడమ్! చదువులు సంపాయించుకోలేము కదా! అందుకే నేను వేస్తున్న ఒక చిట్టీని వర్ష కోసం మధ్యలోనే పాడుకున్నాను. ఆ డబ్బు తెచ్చి కాలేజీలో కట్టి వర్షకి బి.టెక్ సీటు కొన్నాను” అంటూ వర్షను ఎందుకింత లేట్ గా తీసుకొచ్చింది , తానెంత కష్టపడి సీటుకొన్నది వివరంగా చెప్పింది రోజామణి.
రోజామణి చెప్పేది విన్నది మధురిమ. రోజామణే కాదు ఎవరేం చెప్పినా సహనంగా వింటుంది, ఏవరినీ నొప్పించదు. కసిరినట్లు మాట్లాడదు. విసుక్కుంటూ సమాధానం చెప్పదు.
“ఇదిగో! ఇక్కడో బెడ్ వేయించండి మేడమ్!ఖాళీ స్థలం బాగానే ఉంది. ఇబ్బందేం వుండదు" అంటూ మేధ బెడ్ ప్రక్కనే కొంత స్థలం వుంటే అక్కడ చూపించింది రోజామణి. రోజామణికి గ్రహింపు శక్తి ఎక్కువ. తనేదైనా కావాలను కున్నప్పుడు ఎక్కడికక్కడే అడ్డస్టయిపోతుంది.
మధురిమ మాట్లాడలేదు. అక్కడ బెడ్ వేస్తే మేధకి ఫ్రీగా వుండదు. మేధను ఇబ్బంది పెట్టడం మధురిమకు ఇష్టం వుండదు. మధురిమ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొంది రోజూ మణి.
ఆఖరి ఆయుధంగా మేధ దగ్గరకెళ్లి కూర్చుంది రోజామణి మేధనుబ్రతిమాలింది, ప్రాధేయపడింది. ఆమె అలా అడుగుతుంటే కాదనలేకపోయింది మేధ. వర్షకి తన బెడ్ ప్రక్కన ఓ బెడ్ వేయటానికి ఒప్పుకుంది మేధ. బెడ్ వేయించాక, దగ్గరుండి ఆ బెడ్ పై ఓ బెడ్ షీట్ వేసి, వర్ష లగేజి మొత్తం తనే స్వయంగా మీ సెల్ఫ్ లో సర్టింది రోజామణి, హాస్టల్ ఫీజు మధురిమకు కట్టింది.
నా బిడ్డ ఎప్పడూ మమ్మల్ని వదిలి ఉండలేదు మేడమ్! ఇదే కొత్త.అది పుట్టినప్పటి నుండి హైదరాబాదులోనే వున్నది. కనీసం మా అమ్మవాళ్ల ఊరు బనగానిపల్లికూడా అదెప్పడూ వెళ్లలేదు. మేం కూడా దాన్ని విడిచిపెట్టి ఎప్పడూ వుండలేదు. అన్నం కూడా సరిగా తినదు మేడమ్! తినేటప్పుడు కాస్త చూడండి మేడమ్! తినమని చెప్పండి! ఇకముందు అన్నీ మీరే మేడమ్! మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నా అంటూ కళ్లనీళ్లుపెట్టుకుంది రోజామణి. కొంతమంది అమ్మాయిల తల్లులు అలాగే కళ్లనీళ్లు పెట్టుకుంటారు. అది మధురిమ ఎప్పుడూ చూస్తున్న దృశ్యమే. కొత్తకాదు.
మనం అంతలా చెప్పాలా రోజా! ఆమెను చూస్తుంటేతెలియట్లేదా? వర్షను మనకన్నా ఎక్కువగా చూస్తుంది. నాకా ధైర్యం వుంది. ఇక బయలుదేరు. ముందా కళ్లనీళ్లు తుడుచుకో, లేకుంటే నాకళ్లు తడుస్తాయి" అంది రుద్రాణి. తల్లి కళ్లనీళ్లు పెట్టుకోవటం మొదలైతే ఆపటం ఎవరివల్ల కాదు. ఆ కన్నీళ్లతోనే ఆమె తన జీవితంలో ఎన్నో సాధించుకున్న రోజులున్నాయి. ముఖ్యంగా రోజామణిని మాత్రం ఆ కన్నీళ్ళతోనే కంట్రోల్ చేస్తుంది రుద్రాణి. అదంతా గుర్తొచ్చి టక్కున కన్నీళ్లు తుడుచుకుంది రోజా.
నవ్వింది మధురిమ, ఆ నవ్వు చాలా కూల్ గా వుంది. ఆ నవ్వు చూడగానే వాళ్లలో వుండే ఆందోళన మొత్తం ఆవిరైపోయింది.
“ఏం పర్వాలేదు రోజామణిగారు! మీరేం వర్రీ కాకండి! నా క్యాంపస్లో వున్నంత వరకు మీ అమ్మాయి బాధ్యత నాది. బయటకెళ్ళాక మాత్రం వాళ్ళ బాధ్యత వాళ్లదే. వాళ్ళేం చిన్న పిల్లలు కారు. మీరంతగా భయపడవలసిన పనిలేదు” అంటూ వాళ్లకి ధైర్యం చెప్పింది మధురిమ,
మధురిమ దగ్గర సెలవు తీసుకొని హైదరాబాదు వెళ్లారు రోజామణి,రుద్రాణి.
******
మధురిమ పూర్తిగా హాస్టల్ ఫీల్డ్ కి అంకితమైపోయింది. తన శక్తియుక్తులను వాస్తవధృష్టితో అంచనావేసుకొని దానికి తగిన విధంగా తన హాస్టల్ని మలచుకొంది. తనకి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, కలలో కూడా ఊహించని విధంగా తన హాస్టల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది.
ఒకరోజు దామోదర్ రెడ్డి వచ్చి మధురిమను చూసి వెళ్ళాడు. ఆయనకు దగ్గరుండి హాస్టల్ మొత్తం చూపించింది మధురిమ.
నిన్నింత ఉన్నతమైన స్థితిలో చూస్తానని అనుకోలేదు మధూ ! గాడ్ ఈజ్ గ్రేట్, కాలం చేసే అద్భుతాలలో నీ అభ్యున్నతి కూడా ఓ అద్భుతం” అంటూ సంతోషపడుతూ ఆమెను మెచ్చుకున్నాడు.
అలాంటి పొగడ్తలు ఆమె చాలామంది నోటి వెంట విన్నది. ఆ పొగడ్త పన్నీరులా పైన చల్లుకున్నదే కానీ తాగుతూ కూర్చోలేదు.
రాత్రి పది దాటింది.
అప్పటివరకు చదువుకొని, తనఇష్టదైవమైన శ్రీ ఆంజనేయస్వామిని ధ్యానించుకొని నిద్రపోయాడు రాహుల్. రాహుల్ బాగా కష్టపడి చదువుతున్నాడు. బిటెక్ లో మంచి పర్సంటేజి తెచ్చుకొని, మంచి కంపెనీలో జాబ్ చెయ్యాలన్నదే రాహుల్ లక్ష్యం.
మధురిమకు నిద్రపట్టటం లేదు.
పగలంతా పనుల వత్తిడితో అలసిపోతుంది. రాత్రి అయ్యేసరికి నిద్రరాదు. మనోహర్ గుర్తొస్తాడు. ఆదమరచి నిద్రపోయినా, కలలో కొస్తాడు. ఎలా వున్నావు మధూ? బాగా కష్టపడ్లున్నావు కదూ!” అంటూ తను పడుతున్న కష్టాన్ని గుర్తుచేస్తాడు. ఓదారుస్తాడు. చూద్దామన్నా కంటికి కన్పించని భర్త జ్ఞాపకాలతో జీవిస్తోంది మధురిమ.

No comments:
Post a Comment