పుణ్యఫలం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
అమ్మ పంచే సుధలు అనంతం,
అందుకే అమ్మ పై నా కవితలూ అనంతం.
వేదనననుభవిస్తూ,వేడుకననుగ్రహించే దేవతగా
అమ్మపదవి అమోఘం,
కనుకే నా కవితలు అన్నీ ఆమెకే అంకితం.
ఒడుపు అన్నదేలేక బిడ్డల
కడుపునే చూసే మాతృమూర్తిగా
అమ్మ మనసెంతో మధురం,
అందుకే నాకవితలు ఎక్కువగా
అమ్మచుట్టూనే తిరుగుతూ ఉండటం.
అమ్మ ప్రేమ వర్ణించలేనిది,
వర్జించలేనిది,వివరించలేనిది,
అందుకే అమ్మ నా ప్రతి ఆలోచనలలో నిండటం.
ఎవరికైనా అమ్మని ప్రేమించలేకపోవటం,
పూజించలేకపోవటం, అమ్మ సన్నిధిని సహించలేకపోవటం,
జన్మజన్మల పాపఫలం,
ఇలా నేను అమ్మని గుర్తించగలగటం,కీర్తించగలగటం ,
ఇది నా ఎన్నోజన్మల పుణ్యఫలం.
*****
No comments:
Post a Comment