పురిటేళ శోకాలు... - అచ్చంగా తెలుగు

పురిటేళ శోకాలు...

Share This
పురిటేళ శోకాలు...
 @చైతన్యం...
9010968966


పురిటేళ శోకాలు...
బుజ్జాయి శ్లోకాలు... 

ఉయ్యాల... జంపాల... 
ఉయ్యాల... జంపాల... 

ఆ బుజ్జాయి, 
ఊ... కొడితె ఉగ్గులు... 
బోర్లడితె బొబ్బట్లు... 
నవ్వులకు జీడిలు... 
పలుకులకు చిలకలు... 

ఉయ్యాల... జంపాల... 

పరవాన్నమేమో, 
పాప పారాడుతుంటే... 
గారెలన్నీ, 
తను గడపదాటుతు ఉంటే...

ఉయ్యాల... జంపాల... 

మాటలకు బూరెలు... 
అడుగులకు అరిసెలు... 
అల్లరికి చిల్లర... 

ఉయ్యాల... జంపాల...  

ఈ ఆచారాలు,
ఏమయ్యినట్లో.. 
ఎటుపోయినట్లో.. 

ఉయ్యాల... జంపాల... 
ఉయ్యాల... జంపాల... 

పురిటేళ శోకాలు.. 
బుజ్జాయి శ్లోకాలు... 

ఉయ్యాల... జంపాల... 
ఉయ్యాల... జంపాల... 
***

1 comment:

Pages