పుష్యమిత్ర - 16
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. బృహద్ధ్రధుని అనుజ్ఞమేరకు ఆంధ్ర దేశానికి స్వయంవరానికి వెళ్ళిన పుష్యమిత్రుడు వసంతసేనను ఆలయంలో చూసి ప్రేమలో పడతాడు. అనుకోకుండా వారిద్దరికీ వివాహం అవుతుంది. సైనిక కవాతు సమయంలో సింహకేతనుడు వసంత సేనను బంధించి తీసుకువస్తాడు. పుష్యమిత్రుడు సింహకేతనునితోబాటూ, బృహద్ధ్రధునీ వధించి సింహాసనం అధిష్టించి సుపరిపాలన సాగిస్తూ, బౌద్ధులను అదుపులోపెడతాడు. కొంతకాలం తరవాత కుమారుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి, రాణి వసంతసేన మరణానంతరం హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీని దర్శిస్తాడు. బాబాజీ పుష్యమిత్రునికి జ్ఞానబోధ చేసి కైలాసానికి వెళ్తాడు. ఈ ఫ్లాష్-బ్యాక్ ఇది ఇలా ఉండగా, వర్తమానంలో కరిముల్లా కూపీ లాగడానికి వచ్చిన జిలానీ బాషాను బంధించి చిత్రహింసలు పెడుతూ లై డిటేక్టర్ తో నిజం చెప్పించాలని నిర్ణయిస్తారు. (ఇక చదవండి)
గుహలో ధ్యాన నిమజ్ఞుడయిన పుష్యమిత్రునికి కాలం తెలీడంలేదు. ఒకరోజు సూర్యోదయాన ఒక దివ్య కాంతితో పుష్యమిత్రునికి బాహ్యస్మృతి కలిగింది. కనురెప్పలపై ఏదో దివ్య తేజస్సు ఇంద్రధనుస్సులా కనిపిస్తోంది. ఇదంతా ధ్యానంలో కలిగిన దివ్యానుభూతిగా భావిస్తున్నాడు. కనులు విప్పి ఎదురుగా చూసే సరికి దివ్య తేజస్సుతో బాబాజీ ప్రత్యక్షమయ్యారు. పుష్యమిత్రుడు ఆశ్చర్యపోయాడు. బాబాజీకి తెలీని ప్రదేశం అంటూ ఏమీ లేదు. ఎక్కడికైనా వెళ్ళగలరు అనుకుంటూ పాదాలపై మోకరిల్లి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. ఆయన దివ్య శరీర స్పృహ అనాడు మొదటిసారి కనిపించిన దానికంటే ఎక్కువగా ఉంది. "బాబాజీ చెప్పండి. నా ఈ జీవితానికి పరమార్ధం ఏమిటి? పాప పంకిలమైన నా జీవితం మళ్ళీ పుణ్యలోకాలను అందుకునే యోగ్యత ప్రసాదించండి" అని కన్నీటితో బాబాజీ కాళ్ళు కడుగుతూ ఉండగా.. బాబాజీ "నాయనా పుష్యమిత్రా! భౌతిక కర్మలను అనుభవించే మానవులకు, ధర్మ సంస్థాపన కోసం చేసే యజ్ఞంలో భాగంగాను, సహాయంచేసే నిమిత్తం గాను కొంతమంది ప్రవక్తలను, మహాపురుషులను భగవంతుడు భూమి మీదకు పంపుతూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాడు. వారిలో నీవూ ఒకడివి. అధైర్య పడకు. నీకు సూక్ష్మలోకం ప్రాప్తించాలని పునర్జన్మలు లేకుండా చేయాలనే నేను కోరుకున్నాను కానీ.." అని... బాబాజీ ఆగారు. “ఏమైంది బాబాజీ! నాకు ఇక ఉత్తమగతులు లేవా?” అని పుష్యమిత్రుడు అడగగానే బాబాజీ చిరునవ్వు నవ్వి "నీ ఉత్తమ గతులగురించి కైలాసంలో పరమశివుడు మేధా దక్షిణామూర్తిగా ఉండగా అడగడం జరిగింది. ఆ మూర్తి పుష్యమిత్రునికి ఇంకా ఈ భూగోళంతో సంబంధ బాంధవ్యాలు తెగలేదని కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలనీ, వేల సంవత్సరాల తర్వాత హిందూ దేశంలోని పరిస్థితులను చక్కబరచవలసి ఉందనీ, ఈలోపు సశరీరంగా, చిరంజీవిగా ఉంటావనీ.. అయితే ఇదే శరీరంతో నిద్రాణమైన స్థితిలో ఉండాలనీ ఆదేశించారు. పుష్యమిత్రుడు ఆశ్చర్య పోయాడు. స్వామీ! ఇది సాధ్యపడే విషయమేనా? శరీరానికి బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశలను జయించి వేల సంవత్సరాలు జీవించి ఉండడం సాధ్యమేనా? అని అడుగగానే బాబాజీ నవ్వి "పుష్యమిత్రా! నా వయసు ఎంతని అనుకుంటున్నావు? నేను కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాను. పుష్యమిత్రా! మానవుని ఆత్మను వివిధ శరీర కోశాల్లో భగవంతుడు భద్రపరచి ఉండడం నీవెరిగినదే కదా! నీ శరీరం కూడా జరా మరణాలు పొందకుండా ఆ కైలాసవాసి ఏదో విధానం ఏర్పాటు చేసే ఉంటాడు. అధైర్య పడకుండా నీ జ్ఞాన సమాధిలో నీవు ఉండు. భగవంతుని కృప కలిగే వరకూ మనిషి కోశాలలోనుండి బయటపడడానికి రకరకాల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అయితే చరమ స్వేఛ్చ సాధించిన వారు ఇతర మానవులను దేవ లోకానికి తీసుకువెళ్ళడానికో లేక నాలాగా సూక్ష్మ విశ్వంలోనూ భామిమీద కూడా ఉందామని నిర్ణయించుకోవచ్చు. ఆ తరువాత కారణలోకం ప్రవేశించి అక్కడ కారణ శరీరంలో తమ జీవిత కాలాన్ని తగ్గించుకొని కైవల్య ప్రాప్తి పొందవచ్చు. నీవు కోరిన విధంగా కడపటి దశలో ఆత్మ శాశ్వత పరబ్రహ్మంలో కలిసిపోతుంది. అయితే మళ్ళీ భూలోకంలో నీవు తిరుగాడే సమయంలో ఇవన్నీ ఏమీ గుర్తు రావు. గతం గుర్తున్నా నీవు పునర్జన్మ పొందినట్లుగా మాత్రమే స్పృహ ఉంటుంది. ఆశ్చర్యపోయాడు పుష్యమిత్రుడు. ఇదేమిటి? నాకు మరణమే లేదా? చిరంజీవినా? ఎన్నాళ్ళు ఇలా పాపoచేసిన పశ్చాత్తాపంతో జీవించాలి? అని పరి పరివిధాలుగా ఆలోచిస్తున్నాడు. స్వామీజీ! మీరు ఇలా సశరీరంగా ఇన్ని వేల యేళ్ళనుండి ఎలా ఉండగలుగుతున్నారు? అనగానే, అవును ఈ శరీరం నా పాత శరీరానికి నకలు మాత్రమే! ఈ రూపాన్ని నేను సంకల్పానుసారం ఎప్పుడైనా ప్రత్యక్షం, అదృశ్యం చెయ్యగలను. కాంతి రధం మీద ఒక గ్రహం నుండి మరో గ్రహానికి ఒక లోకం నుండి మరో లోకానికి వెళ్ళగలను. భూలోకానికి, సూక్ష్మలోకానికి, కారణ లోకానికి క్షణాల్లో ప్రయాణంచేస్తుంటాను. ఇవన్నీ నీకు నేను తరవాతి కాలంలో వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి నీవు జ్ఞాన సమాధిలో ఉండు అని చెప్పి బాబాజీ అంతర్ధానమయ్యారు.
* * *
సార్! వీడు ఎన్ని విధాల హింసించినా నిజం చెప్పడంలేదు. ఇలాంటి ముస్లింస్ వలననే మా హిందూ ముస్లింస్ కు చెడ్డపేరు వస్తున్నది సార్. అల్లా పేరు చెప్పి అన్యాయాలు చేస్తున్నారు సార్. జీహాద్ పేరుతో వీరు చేస్తున్న దారుణ మారణ కాండలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ముస్లిం అంటేనే జనం భయపడే స్థితికి తెచ్చారు వీళ్ళు. లై డిటెక్టర్ టేబుల్ పై పెట్టి ఒక్కసారి తీవ్రంగా జిలానీ బాషా వేపు చూసి అడిగాడు. “ జిలానీ బాషా ఒక్క మాట చివరి సారిగా విను. జీహాద్ అంటే ధర్మపోరాటం కాదు, మతపోరాటం. ధర్మం అంటే రెండు సమానమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి మతం, రెండోది న్యాయం. ఈ రెండిటికీ సంతృప్తిగా న్యాయం చేసినప్పుడే ధర్మం అనే పదాన్ని వాడాలి. ప్రపంచవ్యాప్తంగా చేసే జీహాద్ అనేది మతం కోసం చేసే యుద్ధం. ముస్లింలకు తమ మతం చెప్పేదే న్యాయం. మతానికి వ్యతిరేకమైనది అనైతికం. అందువల్ల ముస్లిమేతరులను చంపడం ఇస్లాం ప్రకారం న్యాయం. కాని మిగిలిన వారి ప్రకారం అది న్యాయం కాదు. కనుక ఇక్కడ జీహాద్ అనే పదం మతాన్ని సంతృప్తి చేస్తోంది తప్ప న్యాయాన్ని కాదు. అందువల్ల ధర్మపోరాటం అని వాడేకన్నా మతపోరాటం అంటే సరిగ్గా ఉంటుంది. అమాయకులను చంపుతూ న్యాయపోరాటం అంటే ఎలా? ఎవరో దుర్మార్గులు జీహాద్ అని అరిచి ఈ పదాన్ని వాడుకుని పాడు చేశారంటున్నారు కదా, జీహాద్ అని అరిచి మంచి చేసిన ఏ ఒక్క ముస్లిం నైనా ఈ ప్రపంచంలో చూపించగలవా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం ఇది. జీహాద్ అంటే ధర్మపోరాటం అంటే ఎవడూ ఒప్పుకోడు. ధర్మపోరాటాలలో అమాయకులు చనిపోరు. కాని జీహాద్ లో ఎప్పడూ అమాయకులే చనిపోతారు. జరుగుతున్న వాస్తవాన్ని వదిలేసి దాన్ని సమర్ధించడం పాపంలో పాలుపంచకోవడమే. ఒసామా బిన్ లాడెన్ ఇస్లామిక్ దేశాలలో ఒక పెద్ద హీరో. అక్కడ ముస్లింలంతా అతడిని ధర్మరక్షకుడిగా భావిస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో అతడు తన మతాన్ని తన న్యాయాన్ని మాత్రమే కాపాడాడు. కాని ఇతరుల దృష్టిలో అతడు మతం కోసం పోరాటం చేశాడు. కాని న్యాయం కోసం కాదు. కనుక అతడిని ప్రపంచం మొత్తం ద్వేషించింది ఒక్క మీ మతం తప్ప. అవునా కాదా? చెప్పు గర్జించాడు అధికారి. జిలానీ బాషా చేతి వేళ్ళంతా రక్తమయం అయ్యాయి. రక్తం ధారలుగా కారుతోంది. వూపిరి బిగపట్టి ఇలా అన్నాడు. "మీరు నన్ను చంపవచ్చు. కానీ జీహాద్ పోరాటాన్ని ఆపలేరు. మా పోరాటానికి అనేక ఇస్లామిక్ సంస్థలు మద్దతిస్తున్నాయి. అనేక ఇస్లామిక్ సంస్ధలు కలిసి ఏర్పడిన సంఘమే ఐక్య జీహాద్ సంఘం. ఇందులో సభ్యులుగా ఉన్న సంస్ధలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, హర్కతుల్ అన్సార్, జమాయిత్-ఉల్-ముజాహిద్దీన్, అల్-జీహాద్, అల్-బర్క్, అల్-బద్ర్, ఇఖ్వాన్-ఉల్-ముస్లమీన్, తెహ్రీక్-ఉల్-ముజాహిద్దీన్. ఇన్నిటినీ అణచగలదా మీ హిందూ దేశం?" అనగానే అధికారి పెద్దగా నవ్వి "మా దేశంపైకి ఎందరో దండెత్తి వచ్చారు. వారందరూ కాలగర్భంలో కలసిపోయారు. ఇప్పుడు మీ చరిత్రా ఈ విధంగానే అంతమౌతుంది" అంటూ బూట్ కాలితో గుండెల మీద తన్నిన దెబ్బకు కుర్చీతోసహా వెనక్కు పడిపోయాడు అల్లా! అని అరుస్తూ. వాడిని లేచి కూర్చోబెట్టి లై డిటెక్టర్ అమర్చారు.
జిలానీ బాషా బ్లడ్ ప్రెజర్ బాగా పెరిగిపోయింది. అడిగినదానికి సరిగ్గా సమాధానం చెప్పు. అబద్ధం చెప్పావా? అంటూ మోకాళ్ళు మోచేతుల వద్ద రంధ్రాలు చేసే సన్నని సూదుల యంత్రాన్ని దగ్గరగా పెట్టారు.
"ఎవరు పంపించారు నిన్ను?"
"మా పాకిస్తాన్ వాళ్ళు"
"ఎందుకు?"
"కరిముల్లా మా దేశంలో పని చేస్తూ డబుల్ గేం ఆడుతున్నాడని మా మిలిటరీ వాళ్ళకు తెలిసిపోయింది. అందుకే కరిముల్లా పుట్టు పూర్వోత్తరాలకోసం వచ్చాను."
"ఏమి తెలుసుకున్నావ్?"
"ఏమీ లేదు మీ అధికారి సుమంత్ నన్ను మారు వేషం లో పట్టుకున్నాడు"
"వీడిని మనం పట్టుకున్నమని ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా మీడియా వాళ్ళకు. వీడిని అండర్గ్రవుండ్ లో డార్క్ సెల్ లో వేయండి. ఏమాత్రం లైటింగ్ కూడా వద్దని చెప్పండి."
రికార్డు చేసిన పెన్ డ్రయివ్ తీసుకుని హోం మినిస్టర్ను మిలిటరీ అధికారులను కలవడానికి బయలుదేరాడు అధికారి.
-o0o-
No comments:
Post a Comment