గీతం: రామ రాజ్యం కావాలయ్యా
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు
9642618288
పల్లవి
రామ రామ శ్రీరామ మమ్ము పాలించంగా రావేల
మళ్ళీ రామ నీ రాజ్యం మాకు కావాలయ్యా ఈవేళ
ముల్లోకాలు రక్షించే ఓ సీతారామ రావేల
కల్లోలాలు సృష్టించే ఈ మోసం ద్వేషం మమ్మే వీడి పోవాల
||రామ రామ శ్రీరామ||
చరణం:1
కన్నతల్లిదండ్రులే నేడు బరువని విడిచేరు కొందరు
కొనలేని మమకారమే వీడి స్వార్ధాన్ని ప్రేమించే బిడ్డలు
వరమని పెంచినదే నేడు బరువని తుంచేరు కొందరు
పసిమొగ్గ విచ్చకనే సిరిమల్లె ప్రాణాలు తీసేరు మర మనుషులు
||రామ రామ శ్రీరామ||
చరణం:2
కన్నతల్లి పాలకే కరువని ఆకలి తీర్చిన తల్లిని
తనబిడ్డ సమమేనంటూ ఆ తల్లి పాలిచ్చి తన ప్రేమ పంచెను
ఈనాడు ఆ తల్లినే కడకు బలి పసువు చేసిరి పాపులు
చేసిన మేలు మరిచి ఆ తల్లి ప్రాణము తీసిరి యమ సుతులు
||రామ రామ శ్రీరామ||
చరణం:3
ఏమని చెప్పెదను నా దేశము పడుతున్న బాధను
ఈనాటి సీతమ్మను చెరబట్టే రక్కసి రావణులెందరో
మానము ప్రాణములే కొనిపోవ అబలల వేధింతురు
మొరవిని వెను వెంటనే మము కాపాడరావయ్య రణభీమ
||రామ రామ శ్రీరామ||
***
No comments:
Post a Comment