సర్వాంతర్యామిగా అమ్మ
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
మురిసిన హృదయంలో అమ్మ,
మెరిసిన భావంలో అమ్మ,
అక్షరాల అల్లికలో అమ్మ,
పదాల పేర్పులో అమ్మ,
వాక్యాల వెల్లువలో అమ్మ,
వెలువడిన కవితలో అమ్మ,
కురిసిన తన్మయత్వంలోఅమ్మ,
చదివిన పాటకుల్లో అమ్మ,
మెచ్చుకున్న సహృదయుల్లో అమ్మ,
అక్షరమై అమ్మ,అక్షయమై అమ్మ,
అనంతమై అమ్మ,ఆసాంతము అమ్మ,
ప్రకృతిలో అమ్మ,దివ్యాకృతిగా అమ్మ,
జీవన శృతిగా అమ్మ,జీవిత గతిలా అమ్మ,
సుధలా అమ్మ,సుధయై అమ్మ,
కురిసిన వెన్నెలలో అమ్మ,
విరిసిన మల్లికలో అమ్మ,
వాడని కుసుమంలా అమ్మ,
వీడని సహనంలా అమ్మ,
మరచిన కర్తవ్యంగా అమ్మ,
గుర్తించని దైవంగా అమ్మ.
***
No comments:
Post a Comment