అమృత భాండం - అచ్చంగా తెలుగు
అమృత భాండం 
-హైమా శ్రీనివాస్ -చికాగో.

పూలవాసనకు హృదయం పరిమళిస్తే! ,- -పసిబిడ్డలనవ్వుకు మనసు నర్తిస్తే!,  
 ‘అంబా !’ అరుపుకు మది మురిస్తే!,--కోయిలగానాలకిహృది కుసుమిస్తే!,
 నదుల జలజలలకు ఒడలు పురివిప్పితే !,
  నీది ప్రేమించేహృదయ మే!! 

 పిడికెడు మెతుకుల్లేక  పక్కవాడిడొక్కమాడుతుంటే ,
   కప్పుకోను గుడ్డలేక గుడిసేలోవాడు ఒణుకుతుంటే,
 ఆకలికి ఆగలేక అడుక్కునే పిల్లలు అరుస్తుంటే,
  ముసలాళ్ళు దిక్కులేక దిగులుతో మూల్గుతుంటే, 
 పలక పట్టేవయసువాడు తట్టతో మట్టి మోస్తుంటే ,
 చూసిన నీమనస్సు స్పందిస్తే నీది ప్రేమ హృదయ మే!!!

మమత నే నవనీతంతో మనస్సంతా నిడిపోవాలి, - నీకున్నది లేనివానికి కొంతైనా పంచ గలగాలి
 నీ సంపదనలో పదో వంతైనా ధర్మచేయగలగాలి,--నీస్వార్జితం ధర్మబధ్ధమైందై ఉండాలి  .
 నీ మనస్సు ‘అందా’ నికి స్పందించినట్లే – -తోటిమానవుని ‘కష్టా’నికీ  స్పందించాలి.
 అపుడే నీది ‘ప్రేమ’హృదయం!—అపుడే నీవు ‘ప్రకృతిప్రేమికుడివీ’ -
 మానవత్వమున్న మనిషివీ!- నీమాతృభూమిఆరాధకుడివీనీ.

  ఫ్రేమ’ ప్రేమిస్తేనే’  తెలుస్తుంది,-- ప్రేమ’ మానవసేవ’ తోనే ప్రకటిత మవుతుంది.
  ప్రేమంటే కామమూ కాదు, మోహమూ కాదు,-తోటివారిని తనవారనుకోడమే ప్రేమతత్వం
   మనస్సున్న  ‘మానవత్వం’!—మమత వర్షించే’అమృత భాండం’ !!
 ***********   

No comments:

Post a Comment

Pages