చదువుకో నాయనా - అచ్చంగా తెలుగు

చదువుకో నాయనా

Share This
చదువుకో నాయనా
సత్యం ఓరుగంటి

ఉదయం 9.30 గం  సతీష్ చాలా  బిజీ గా వున్నాడు ఆఫీస్ నుంచి  కాల్స్  వస్తున్నాయి, డ్రెస్ వేసుకుంటూనే  సమాధానం  చెబుతున్నాడు, అరుణ  టిఫిన్  టేబుల్ పైన పెట్టెనని సైగ  చేస్తూ  తను కూడా  ఆఫీస్ కు వెళ్ళడానికి  
తయారవుతున్నాది, స్కూల్  కు వెళుతున్న కొడుకు శ్రీఖర్ బై డాడీ అంటూ బాగ్  ఒక చేత్తో , వాటర్ బాటిల్ ఇంకొక  చేత్తో పట్టుకొని బయటికి పరుగు తీసాడు, హాల్ లో టివి లో  బ్రేకింగ్ న్యూస్  వేస్తున్నారు మరికొద్ది సేపటిలో లైవ్  శ్రీహరికోట  నుంచి 104  ఉపగ్రహాలు  ఒకే సారి నింగి లోకి ప్రపంచ రికార్డ్  పి. ఎస్. ఎల్. వి  ప్రయోగం అంటూ , వారం రోజుల నుంచి అనుకుంటున్నాడు ఎలాగైనా (సెలవు పెట్టయినా ) చూడాలి అని క్రిందటి సారి కూడా ఇలాగె చూడాలి అనుకున్నాడు కాకపోతే అప్పుడు జి. ఎస్. ఎల్. వి.  ,   సార్ క్లైంట్ విసిట్, డిస్కషన్స్   టైం  మారింది  ఈవెనింగ్  కాదు ఉదయం 10.30 గం  బాస్ మీకు చెప్ప మన్నారు ఫోన్  లో అసిస్టెంట్ భాస్కర్ చెపుతున్నాడు. రెడీ అయిన అరుణ ఇంకా టిఫిన్ తినలేదా?మళ్ళీ సైగ.
ఫోన్ సైలెంట్  మోడ్ లో పెట్టాడు సతీష్, గబ గబా టిఫిన్ ముగించి లాప్ , కేబుల్, మౌస్ అన్నీ బాగ్ లో  కి పుష్  చేసి ఫోన్  పోకెట్ లో తోసాడు అరుణ అప్పటికే తన లాప్ బాగ్ తో రెడీ గా వుంది, కార్  తాళాలు పట్టుకొని పరుగు లాంటి నడకతో  బయటికి నడిచాడు. అరుణ ఆఫీస్  సైబర్ టవర్స్  తనది  మైండ్ స్పేస్, ముందు  అరుణ ఆఫీస్  వస్తుంది అందుకే ఇద్దరు రెండు కార్లు  అవసరం లేకుండా  తన కార్లో వెళ్లి ముందు అరుణ ని దించి తరవాత తన ఆఫీస్ కి వెళతాడు సతీష్. వైబ్రేషన్  మోడ్  లో వున్న సెల్  లో కాల్ ఇండికేషన్  వస్తున్నాది కార్ కూల్ గా డ్రైవ్  చేస్తున్నాడు సతీష్ ఎస్. ఎం. ఎస్ భాస్కర్ నుంచి  "క్లైంట్  అరైవ్డ్". పక్కకి ఆపండి అరుణ మాటతో ఆలోచనలకి బ్రేక్ కారు పక్కకి ఆపేడు, అరుణ దిగుతూ చెప్పింది జాగ్రత్త ఆలోచిస్తూ డ్రైవ్ చెయ్యకండి  క్లైంట్ విసిట్, డిస్కషన్స్   ఎప్పుడూ ఉండేవే అంటూ కార్ డోర్ మూసింది. 
మెల్లగా కార్  పార్క్ చేసి ఆఫీస్ వైపు నడిచాడు సతీష్, కార్డు  స్వైప్ చేసాడు డోర్ తీసుకొని    హాల్  లో  కి  ప్రవేశించాడు పెద్ద వర్క్  స్టేషన్ హాల్ పక్క పక్కనే  కేబిన్స్ తన కేబిన్ లోకి వెళ్లి డోర్ మూసాడు. అసిస్టెంట్ భాస్కర్ ఫోన్ లో  సార్ కాన్ఫరెన్సు  హాల్ కి వచ్చెయ్యండి, అందరూ వెయిటింగ్ అన్నాడు. ఆఫీస్ బాయ్ కాఫీ తెచ్చి పెట్టాడు గుడ్ మార్నింగ్ సర్ అంటూ,  కాఫీ తాగే టైం లేదు లాప్ తీసుకొని  కాన్ఫరెన్సు  హాల్ వైపు నడిచాడు.

మెల్లగా కాన్ఫరెన్సు  హాల్ డోర్ తీసుకొని లోపలి వెళ్ళాడు సతీష్,  భాస్కర్ ఎదురొచ్చి విష్ చేసాడు అక్కడే వున్న క్లయింట్ టీం కి పరిచయం చేసాడు. ఫార్మల్ డిస్కషన్స్ అయిన తరువాత బిజినెస్ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యేయి,  ప్రాజెక్ట్ గురించి  ఎక్స్ప్లెయిన్ చేసాడు సతీష్ , వాళ్ళు చాల డౌట్స్  అడిగేరు చాల ఓపికగా సొల్యుషన్స్ అన్ని  ఎక్స్ప్లెయిన్ చేసాడు మనసులో మాత్రం  పి. ఎస్. ఎల్. వి  ప్రయోగం నడుస్తోంది.  తెలియకుండానే  2 హవర్స్     అయిపొయింది అందరూ లేచారు మిస్టర్ సతీష్ చాలా  బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు,  ప్రోగ్రాం చేసి పంపించండి  చెక్ చేసి ఇంకా ఏమైనా చేంజెస్ వుంటే మెయిల్ పెడతాము అంటూ కదిలేరు.
తన కేబిన్ కి వచ్చి కూర్చున్నాడు కాఫీ  చల్లారి పోయి అలాగే వుంది లంచ్ టైం దాటి పోయింది బాయ్ ని పిలిచాడు తను చెప్పే వరకు  ఎవ్వరిని  పంపకు అన్నాడు. భాస్కర్ క్లయింట్ టీం తో వెళ్లి పోయాడు వాళ్ళని డ్రాప్ చేసి వస్తాడు. రూమ్ లో చల్లగా వుంది స్ప్లిట్ ఎ.సి శబ్దం మెల్లగా వినిపిస్తోంది. ఆలోచనలో పడ్డాడు సతీష్.
చిన్నప్పుడు తను అన్నయ్య  స్కూల్ కి కలిసే వెళ్ళే వారు, అన్నయ్య బాగా చదివే వాడు ఎక్కువ మార్కులు వచ్చేవి, తనకు తక్కువ అవచ్చేవి తను నెమ్మది గా ఉండేవాడు,  అమ్మ  ఎప్పుడు  బాగా చదువుకోవాలి నాన్న 
అన్నయ్య లాగ ఎక్కువ మార్కులతో  పాసయితే మంచి ఉద్యోగం వస్తుంది నీ కుటుంబం హాయిగా నడుస్తుంది అని చెప్పేది, మంచి మార్కులు రాకపోతే ఉద్యోగం రాదా ? నా కుటుంబం అంటే ఏమిటి తెలిసేది కాదు. వీది గుమ్మం లో కూర్చొని చదవడం మొదలు పెట్టేడు, ఎగురుతున్న పక్షులు ఎలా ఎగురుతున్నాయి మనం ఎందుకు ఎగరలేము ? ఆలోచనలో పడ్డాడు, ఓహో  అవి మనకంటే చిన్నవి బరువు తక్కువ అందుకే ఎగరగలవు, చిన్నవన్నీ ఎగరగాలవా? మరి చీమలూ పురుగులు ఎగరలేవు కదా ?   ఓహో వాటికి రెక్కలు లేవు అందుకే ఎగరలేవు , అంటే చిన్నగా వుండాలి, రెక్కలు వుండాలి, వుంటే ఎగరవచ్చు మరి ఎక్కువ గాలి వస్తేనో ? గాలికి అనుగుణంగా తప్పించుకోవాలి అందుకే పక్షులకి ముక్కు సూదిగా ఉంటుందేమో ? ఒక్క సారి అమ్మ అదిలింపు ఇహలోకం లోకి వచ్చాడు పుస్తకాలు ముందు వేసుకొని ఆ పరద్యానం ఏమిటిరా చదువుకో నాయనా మంచి మార్కులు వస్తాయి అంది మళ్ళా. పుస్తకం లోకి తలదూర్చాడు పక్షులు నిలువుగా ఆకాశం లోకి ఎగిరితే చంద్రుడు మీది కి గాని సూర్యుడి మీదికి గాని వెళ్ళ గలవా? ఎప్పుడూ అడ్డం గానే ఎందుకు ఎగురుతాయి ? ఒరేయ్ పుస్తకం చూస్తున్నావా ? చదువుతున్నావా? చదువుకో రా మంచి మార్కులు వస్తాయి అంటున్నాడు అన్నయ్య.

ఒక్కసారి తలవిదిలించాడు సతీష్, ఫోన్ లో బాయ్ కి చెప్పేడు మరొక కాఫీ తెమ్మన్నాడు వేడిగా, లాప్ ఓపెన్ చేసాడు పెండింగ్ లో ఉన్న  ఫైల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసాడు, అవసరమైన వాటిని మార్క్ చేసుకున్నాడు, నిన్నటి నుంచి ఒక ఫైల్ లోడ్ చేస్తుంటే సిస్టం ఎర్రర్ చూపిస్తోంది, సార్ట్ అవుట్  చేసి ఫిక్స్ చెయ్యాలి, దానిని స్టడీ చేసి సాల్వ్ చెయ్యాలి, టైం స్పేర్ చెయ్యాలి, "సార్ కాఫీ"  ఆఫీస్ బాయ్ కాఫీ తెచ్చాడు.  కాఫీ తాగుతూ మరలా ఆలోచనలో పడ్డాడు సతీష్.
ఒక రోజు  రాత్రి  7 గం వేళా అమ్మ  ఎఅవరితోనో అంటోంది  "మా పెద్దవాడు బాగా చదువుతాడండీ" చిన్నవాడే కొంచెం జ్ఞానం తక్కువ ఎలాగైనా వాణ్ణి గాడి లో పెట్టాలి అని.  చదివింది చాలు గాని భోజనానికి లేవండి భోజనం చేసిన తరువాత హోంవర్క్ చేసుకొని పడుకోవచ్చు అంది అమ్మ . ఇద్దరు పుస్తకాలు పక్కన పెట్టి వంటింట్లోకి నడిచారు. అమ్మ కంచాలు పెట్టి అన్నం వడ్డిస్తోంది, గ్యాస్ పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి  మళ్ళీ ఆలోచనలో పడ్డాడు మంట అంత వేడి గా వుంటుంది కదా, పాలు గాని నీళ్ళు గాని వేడెక్కి మరుగుతాయి కదా, గిన్నె ఎందుకు మండిపోదు ? ఎక్కువ మంట ఉండాలేమో ? మంట ఎక్కువ ఉండాలా ? వేడి ఎక్కువ ఉండాలా? చిన్న మంటతో ఎక్కువ వేడి ఇచ్చే గ్యాసు ఉంటుందా ? ఎంత ఎక్కువ వేడి అయినా వేడి ఎక్కని గిన్నె ఉంటుందా ? అన్నం కెలుకుతున్నాడు, అమ్మ మళ్ళీ చెప్పింది అన్నం తినరా, ఇంత పరద్యానం అయితే ఎలాగ రా టైం కి అన్నం తినాలనే జ్ఞానం లేకపోతే ఎలాగమ్మ ?
సమయానికి తినాలి, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి వుద్యోగం తెచ్చుకోవాలి, అని బుజ్జగించి చెబుతోంది నిజమే ఈ పనికి రాని ఆలోచనలు మానెయ్యాలి టైం ప్రకారం అన్ని పనులు చెయ్యాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకొన్నాడు. భోజనం అయ్యింది హోంవర్క్ పూర్తి చేసాడు. అమ్మ మంచాలు వేసింది ఫ్యాన్ వేసింది  టైం కి పడుకోవాలి నాయనా తెల్లవారుజామునే లేపుతాను చదువుకోండి అంది. ఫ్యాన్ వేపు చూస్తూ మంచం పై వాలేడు   ఫ్యాన్ ఎలా తిరుగుతుంది ? కరెంట్ తో అంటారు
నాన్న గారి మోటార్ సైకిల్  లో ఇంజిన్ కూడా తిరుగుతుంది మరి దాని కరెంట్ వైర్  లేదే కరెంట్ ఎలా వస్తుంది ?
అమ్మ మళ్ళీ వచ్చింది, నాకు తెలుసు నువ్వు ఇంకా పడుకోవని టైం కి పడుకొని టైం కి లేస్తేనే బాగా చదువోస్తుంది అంది. అమ్మ చెప్పింది చెయ్యాలి , బాగా చదువుకోవాలి, టైం కి అన్నీ చెయ్యడం నేర్చుకోవాలి, అప్పుడే మంచి మార్కులు వస్తాయి,  అప్పుడే మంచి ఉద్యోగం వస్తుంది ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకొన్నాడు.

కాఫీ తాగటం పూర్తి అయ్యింది లాప్ ఓపెన్ చేసాడు, నిన్న ఆపిన ప్రోగ్రాం కంటిన్యూ చేసాడు అంతా కంప్లీట్ అయిపొయింది రెండు మూడు చోట్ల వార్నింగ్ చూపిస్తోంది, మళ్ళా  ఇన్పుట్ డేటా లోకి వెళ్లి తప్పు ఎక్కడ ఇచ్చేడో చెక్ చేసేడు, " ఎస్ "  దొరికేయి వాటిని కరెక్ట్ చేసేడు, సేవ్ చేసి మరలా  ప్రోగ్రాం లోడ్ చేసి రన్ చేసేడు,  ఇప్పుడు వార్నింగ్స్ పోయేయి. ఇది ఒకసారి భాస్కర్ ని చెక్ చేసి క్లైంట్ కి పంపమని చెప్పాలి అనుకున్నాడు.
జి. ఎస్. ఎల్. వి  ప్రయోగం  శ్రీహరికోట గుర్తుకోచ్చేయి, లైవ్ చూడ లేకపోయినా రాత్ర్హి న్యూస్ లో చూడవచ్చు ఈరోజైన  ఇంటికి త్వరగా  వెళ్ళాలి అనుకున్నాడు, ఫోన్ లో ఆఫీస్ బాయ్ అని అడిగేడు భాస్కర్ రిటర్న్ వచ్చేడా?  వచ్చేరు సార్ ఆఫీస్ బాయ్ సమాధానం, ఒకసారి నా కేబిన్ కి రమ్మను అంటూ ఫోన్ పెట్టేసాడు.  
భాస్కర్ తలుపు తోసుకొని వచ్చేడు, క్లయింట్ టీం బాగా ఇంప్రెస్స్ అయ్యేరుట తన ప్రేసేన్టేషణ్ కి, ఎం.డి గారు కూడా పొగిడేరుట సతీష్ ఒక అసెట్ మన కంపెనీకి అంటూ భాస్కర్ చెబుతున్నాడు. ఇవేమీ కొత్త కాదు సతీష్ కి, తను  ఏ పని చేసినా లాభ నష్టాలు ఆలోచించడు, త్రికరణ శుద్ది గా చేస్తాడు, మేనేజెమెంట్  ఇంప్రెస్స్ అవటం సహజం. 
ఏంటి  సార్  ఎదో  ఆలోచనలో  ఉన్నారు ?  కొత్త ప్రాజెక్ట్  గురించా ? దానికి ఫస్ట్ లెవెల్  స్క్రీనింగ్  అయిపోయి పది మంది మీ  ఫైనల్ ఇంటర్వ్యూ  గురించి  వెయిట్  చేస్తున్నారు , టైం  ఎప్పుడు ఫిక్స్ చెయ్య మంటారు ? 
కాదు కాదు వేరే విషయం లే  ,  ఎంతమందిని  సెలెక్ట్ చెయ్యాలి ?  ఐదు  మంది ,  ఒకే  రేపు లంచ్  తరవాత అరేంజ్ చెయ్యండి, ఈరోజు  వద్దా  సార్  ?  ఇంటర్వ్యూస్   పెట్టు  కుంటే  ఇంటికి  వెళ్ళటం  లేట్  అవుతుంది . ఏంటి  సార్  ఎప్పుడు  ఇంటికి  త్వరగా  వెళ్ళటం  గురించి  ఆలోచించరే  ?  ఓహో   ఈరోజు  104  ఉపగ్రహాలు  కదా ,   భాస్కర్   కూడా  తెలుసు  నా  వీక్ నెస్  సరే సార్   అలాగే  చేద్దాం భాస్కర్ వెళ్లిపోయేడు.

ఎదో  ఇంపార్టెంట్  వర్క్  మరిచిపోయేనే  ? టేబుల్  పైన  పాడ్ వేపు చూసేడు  ఆ  గుర్తుకి  వచ్చింది ఎదో  ఒక ఫైల్ లోడ్ చేస్తుంటే సిస్టం ఎర్రర్ చూపిస్తోంది, ఎస్  సిస్టం  ముందు  కూర్చున్నాడు  ఫైల్  ఓపెన్ చేసేడు ఎర్రర్  వచ్చింది ,  పెన్ పేపర్ తీసుకుని  రూట్  అడ్రస్  నోట్ చేసుకున్నాడు ,  హెల్ప్ లో చెక్ చేసేడు 2 సోలుషన్స్   ఇచ్చేడు  ,  ఫైల్ లోనికి వెళ్లి  కరెక్ట్ చేసి సేవ్ చేసి మళ్ళీ  లోడ్ చేసాడు ఎర్రర్ రిపీట్  అయ్యింది.  గూగుల్ చేసాడు చాలా మంది  ఇదే ఎర్రర్ మీద  డిస్కషన్స్  చేసి  సోలుషన్స్  ఇచ్చేరు, ఒక్కొక్కటి ఓపికగా చేసి ట్రై చేస్తున్నాడు ప్రాబ్లం  సాల్వ్ కావటం లేదు.
ఒక్కసారిగా  ట్రై  చెయ్యటం ఆపి  కూల్  గా  ఆలోచించటం  మొదలు పెట్టేడు, ఏరోజు నుంచి ఈ ప్రాబ్లం  స్టార్ట్ అయ్యింది, అంతకు ముందు రోజు సిస్టం  లో కొత్తగా  ఏమి చేసేడు ,  ఎస్,  గుర్తుకు  వచ్చింది ,  కమాండ్ ప్రాంప్ట్   ఓపెన్ చేసి  స్కాన్  రిపేర్  కమాండ్ కొట్టేడు ,  సిస్టం రన్అవుతోంది రిలాక్స్  అయి చూస్తున్నాడు కంప్లీట్  అయి  సెల్ఫ్  రీస్టార్ట్   అయ్యింది ,  ఒక్కొక్క  ఫైల్  లోడ్ అవుతున్నాయి ,   ఎస్,  ఎర్రర్ రాలేదు  ఫైల్  లోడ్ అయ్యింది ప్రాబ్లం లేకుండా , కేబిన్  తలుపు  తోసుకుని  భాస్కర్  వచ్చేడు  సార్  ఇంకా  ఇంటికి  బయలు దేరలేదా ? ఓహ్  గాడ్  మళ్ళీ  మరిచిపోయాను  వర్క్ లో పడితే టైం తెలియదు ఇల్లు గుర్తుకు రాదు .  మంచి పని చేసేవ్  భాస్కర్  అంటూ  గబా గబా  దొర లాగి  కేబిన్ బయటికి  వచ్చి  లిఫ్ట్ వేపు వడివడి గా నడవటం ప్రారంబించేడు .   
కారు లో కూర్చొని  మెల్లగా  ఆఫీస్ బయటికి  డ్రైవ్  చేస్తున్నాడు , సెక్యూరిటీ  వంగి మరీ  సెల్యూట్  చేస్తున్నాడు , వాళ్ళకి  కూడా  తెలుసు  , ఎం.డి ని ఎట్లా  ట్రీట్ చెయ్యాలి అతనికి  నచ్చిన  వారిని కూడా  అంతే రెస్పెక్ట్  చెయ్యాలి కారు మెల్లగా  పోనిస్తున్నాడు,  హైదరాబాద్  అప్పటికి చాలా  మారింది,  చీకటి పడింది రోడ్డు  నిండుగా లైటింగ్ పడుతోంది, కారు రైట్  కి  టర్న్  చేసాడు  కుడి  చేతి  పక్క  సైబర్  టవర్ , మెల్లగా  పోనిస్తున్నాడు, అరుణ ఉంటే  చెయ్యి  ఊపుతుంది  లేట్  అయితే  ముందే  వెళ్లి పోతుంది , తనకోసం  వెయిట్  చెయ్యకుండా , పిల్లాణ్ణి  చూసుకోవాలి కదా .  అరుణ  కనిపించ లేదు కారు  స్పీడ్ పెంచేడు మాదాపూర్ దాటింది , జూబ్లిహిల్స్  , పంజాగుట్ట , సోమాజిగూడ తన  అపార్ట్ మెంట్  వచ్చింది  కారు మెల్లగా  లోనికి  పోనిచ్చి  పార్క్ చేసాడు . లిఫ్ట్  లోకి ఎక్కి డోర్ వేసాడు 1,2,3 బయటికి వచ్చి ఇంట్లోకి  వచ్చేడు   హాల్  లో కొడుకు శ్రీఖర్ టి . వి చూస్తున్నాడు .  
అమ్మ డాడి వచ్చేరు , అన్నాడు తల తిప్పకుండానే ,  అరుణ  మంచి  నీళ్ళతో వచ్చింది ,  ఏంటి  ఈరోజు ఇంత త్వరగా ఇస్రో  గురించా ?  తనకి కూడా  మన విషయం  తెలుసు  ఆ  అదేలే , భోజనం పెట్టు  వివరాలు చూడాలి .
ఇంతలో  శ్రీఖర్  నాన్నా 104 ఉపగ్రహాలు  ఒకే సారి ఒకే వెహికల్ తో ఎలా ప్లేస్ చేస్తారు , ఒక్కొక్క  ఉపగ్రహానికి ఒక్కొక్క  x,y,z  కో ఆర్డినెట్స్  ఫిక్స్  చేసుకొని , వేరే వేరే  టైమింగ్స్  లో  ప్లేస్  చేసుకుంటూ  పోతారా ?  
సతీష్ చాలా  ఆశ్చర్య  పోయేడు ,  ఇంతలో  అరుణ  నాన్నా  గారిని విసిగించకు ,  ఎప్పుడూ టి. వి. యేన 
చదువుకో నాయనా మంచి మార్కులు వస్తాయి మంచి ఉద్యోగం వస్తుంది మీ నాన్న గారిలాగా.

***

No comments:

Post a Comment

Pages