మార్గదర్శకం
పెమ్మరాజు అశ్విని
కాలేజీ
లో పని ముగించుకుని ఇంటి బాట పట్టి బస్సు ఎక్కి కూర్చుంది లావణ్య రోజు వెళ్లే దారి
అయినా కిటికీ లోంచి రోడ్ ను గమనించ సాగింది అలవాటు చొప్పున బస్సు నెమ్మదిగా
హనుమంతువాక జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి సిగ్నల్ పడగానే వాహనాల దగ్గరికి రకరకాల
వస్తువులు తెచ్చేఅమ్మడం అక్కడ మాములే . అయితే అక్కడ ఎప్పుడు కనిపించే మొహాలు
కాకుండా కొత్త మొహం కనపడింది అది కూడా ఒక పెద్దావిడ ,ఆ పెద్దావిడ మొహం బాగా
సుపరిచితం గా అనిపించింది లావణ్య కి.
ఆమెని చుసిన దగ్గర నుంచి
చాలా దగ్గరగా తెలిసిన మనిషి అనిపించింది ,కానీ ఎంత గుర్తుచేసిన తట్టలేదు .ఇంతలో బస్సు తానూ
దిగవలసిన స్టాపు చేరడం తో తన ఆలోచనల నుంచి బయట పడి ఇంటి దారి పట్టింది. ఇంటికి
వెళ్లేసరికి బోల్డు పని ఎదురుచూస్తోంది తనని స్వాగతిస్తూ , అమ్మా అంటూ వచ్చి
చుట్టేశాడు ఆరు ఏళ్ళ బంటీ "బంటీ బంగారం స్కూల్ అప్పోయిందా కన్నలు "అంటూ
వాడ్ని గారం చేసి,వాడికి
పాలు పట్టించి చిరుతిండి
పెట్టి వాడు
చెప్తున్న స్కూల్ సంగతులు అన్ని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వింటూ వాడితో
కేరింతలు కొడుతూ ఆడుతూ వాడ్ని చదివిస్తూ నేకగా తన పని
అంతా చక్కబెట్టేసింది
.
సాయంత్రం
ఎనిమిది కావోస్తుండగా వాడికి అన్నం పెట్టి తాను స్నానం చేసి లేత నీలి రంగు వాయిల్
చీర కట్టుకుని సాయంత్రం కొనుక్కువచ్చిన మల్లెల చెందు ని తల లో తురుముకుంది.లేత
నీలిరంగు చీరలో బాపు బొమ్మలా చక్కగా వెలిగిపోతోంది లావణ్య ,ఇంతలో పని ముగించుకుని
ఇంటికి దయ చేసాడు శ్రీకర్ .ఇంట్లోకి అడుగుపెడుతూనే "ఏమండోయ్ శ్రీమతి
గారు" అంటూ హుషారుగా పాత అందుకున్నాడు బయట తన పని లో యెంత ఒత్తిడి వున్నా
ముఖం లో చిరునవ్వు చెదర నివ్వకపోవడం శ్రీకర్ ప్రత్యేకత.
లావణ్య విశాఖపట్నం లో ఒక
కాలేజీ లో లైబ్రేరియన్ గా పని చేస్తోంది. అదే ఊరిలో ఒక ప్రైవేట్ బ్యాంకు లో ఆఫీసర్
గా పనిచేస్తున్నాడు శ్రీకర్ .ఇద్దరు చదువు కుని చక్కటి ఉద్యోగాలు చేస్కుంటూ
అన్యోన్యంగా వుండే జంట . పెళ్ళైన ఐదు సంవత్సరాల కి కడుపున పడ్డాడు బంటీ ,దానితో వాడు పుట్టగానే వాడే
లోకం ,వాడి
కోసం అన్ని సమకూర్చాలని తాపత్రయ పడుతుంటారు .రోజు కాలేజీ నుంచి వాస్తు ఇంటికి
కావాల్సిన వస్తువులు తెచ్చుకోవటం అలవాటు .
ఆ రోజు
రాత్రి భోజనాలు అయ్యాక లావణ్య కి వున్నటుండి తానూ రోడ్ మీద చుసిన పెద్దావిడ స్మృ
తి పధం లో మెదిలింది .ఆమెను ఇదివరకు ఎక్కడో చూశానని కానీ చాలా కాలం అవడం తో గుర్తు
రావడం లేదు అని శ్రీకర్ తో అంది . శ్రీకర్ నవ్వుతు అది "డే జావు "
అయివుంటుంది లేవోయ్ శ్రీమతి అన్నాడు తమాషాగా .,"డే జావు నా అంటే ఏంటి " అని అడిగింది లావణ్య
అప్పుడు శ్రీకర్ చెప్పాడు "డే జవు " అనేది ఫ్రెంచ్ పదం కొందరు
వ్యక్తులను కొన్ని సంఘటనలను జరిగినప్పుడు అవి ఇంతకూ మునుపే జరిగినట్టు,వారిని ఇంతకు ముందే
కలిసినట్టు అనిపించడం"
అంటూ చెప్పాడు . అంతే అయ్యుంటుంది లెండి అంటూ ఇద్దరు నెమ్మదిగా కలల ఒడి చేరేందుకు
ముద్దు మురిపాలు మొదలుపెట్టారు.
ఆ మరునాడు లావణ్య కి
డైరెక్ట్ గ బస్సు దొరకక షేర్ ఆటో
ఎక్కి హనుమంతవాక లో దిగి
ఇంకో ఆటో కోసం చూస్తోంది అంతలో ఎదురుకుండా ఏవో కూరలు ఉండడం గమినించి కొందామని
రోడ్డు దాటి ఆకుకూరలు ఎంతమ్మా అని అడిగింది ,కూరలు అమ్మే ఆవిడా "ఏవి కావాలమ్మా గారు " అంటూ తలతిప్పి
చూసేసరికి నిన్న తాను చుసిన పెద్దావిడ కనపడేసరికి లావణ్య కి వెంటనే జ్ఞాపకం
వచ్చింది ఆవిడా వాళ్ళ ఊరిలో ని శెట్టిగారి భార్య గౌరమ్మ గారు అని.
" మీరు
గౌరమ్మ గారు కదా ఇక్కడేంటి అమ్మా మీరు" అంటూ పలకరించగానే ఆవిడ చప్పున మొహం
తిప్పుకుని వినపడనట్టు అర్ధం కానట్టు ప్రవర్తించారు మీరు ఎవరనుకుంటున్నారో
అంటూ తడబడుతూ తప్పించుకోబోయారు.
ఆవిడ
కొంత వరకు ఊహించి గల లావణ్య ఆవిడ్ని ఇబంది పెట్టకుండా ఏవో కూరలు కొనేసి
పక్కకు తప్పుకుంది . కానీ ఆవిడ్ని అలా చూసేసరికి మనసు సమాధానపరుచుకో లేకపోయింది .
లావణ్య వాళ్ళ తాతగారి ది విశాఖపట్నం కి దగ్గర్లో వున్న నర్సీపట్నం పక్కన చిన్న
పల్లె లో లావణ్య తాతగారు గ్రామ కరణం ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా విశాఖపట్నం లో
వున్నా సెలవలు ఇస్తే అక్కడికి పారిపోయేది ..
శెలవలు
కి తాతగారి ఇంటికి వెళ్తే లావణ్య కి పండగే అది చిన్న ఊరు కావడం తో అందులోను కరణం
గారి మనవరాలు అనేసరికి ఊరంతా చుట్టాలే అన్నట్టు ఉండేది . ఆలా వారి తాతగారింటికి ఆ
వీధి లోనే ఒక ఆరు ఇళ్ల అవతల ఉండే కిరాణా కొట్టు ,ఆ కొట్టు వెనకాల ఇల్లు . ఇంట్లో ఏమైనా కావాలంటే
తూనీగ లాగ పరిగెత్తి వెళ్లిపోయేది శెట్టి గారి కొట్టు కి లావణ్య
శెట్టి గారి కొట్టు తో పాటు
పోస్టాఫీసు రెండిటి ని చూసుకోవడం లో గౌరమ్మ గారు శెట్టి గారికి సాయం చేసేవారు.
వారికీ ఒక్కడే సంతానం సుబ్బి లావణ్య తో కలిసి ఆడు కునేవాడు .
చక్కగా
రూపాయి కాసంత బొట్టు తో నిండయినా చీర కట్టు మేడలో కాసుల పేరు తో కాస్త రంగు
తక్కువైనప్పటికీ కళ గా లక్ష్మి దేవి లాగ ఉండేవారు గౌరమ్మ గారు. ఒక పక్క ఇంటి పనులు
చేస్తూనే శెట్టి గారు సామాన్లకి టౌన్ కి వెళ్తే కొట్టు ని పోస్ట్ ఆఫీస్ ని
చూసుకోవడం షాప్ లో కి అమ్మకానికి జంతికలు చేగోడీలు పప్పుండ లు లాంటివి
స్వయం గా చేసి పొట్లాలు కట్టే వారు ,పాత పేపర్లు తో మైదా పిండి రాసి కాగితం పొట్లాలు తయారు చేసేవారు .
లావణ్య కి ఆవిడ చేతి చేగోడీలు అంటే భలే ఇష్టం అని తెలిసి ప్రత్యేకం పంపించేవారు.
తర్వాత లావణ్య తాతగారు కాలం చేసాక ఇంకా ఊరు వెళ్లే పని పెద్దగా లేకపోయింది .
అలాంటి మంచి మనిషి ని ఇవాళ
ఈ పరిస్థితుల లో చూసి తట్టుకోలేక పోయింది లావణ్య ,నెమ్మదిగా కూపీ లాగి ఆవిడ ఉంటున్న ఇల్లు కన్నుకుని
వెళ్ళింది మొదట ఆమెను చూడగానే ఆవిడా తడబడినా ఎక్కువ సేపు నిలవరించ లేకపోయారు.
లావణ్య "పిన్నిగారు మీరు ఇలాంటి ఇంట్లో ఈ పరిస్థితుల్లో ఉన్నారేంటి,అసలు సుబ్బి ఎలా రాని
చ్చాడు ,బాబాయ్
గారు ఎక్కడ " అని ప్రశ్నల వర్షం కురిపించింది .
అంత వరకు
నిబ్బరంగా ఉన్ని గౌరమ్మ గారు లావణ్య అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లాయి ఒక్కసారి
లావణ్య ను పట్టుకుని బావురుమన్నారు .నెమ్మదిగా సంభాళించుకుని చెప్పుకొచ్చారు
నాలుగు అయిదు సంవత్సరాల నాడు శెట్టి గారికి పక్షవాతం వచ్చి చెయ్యి పనిచేయలేదు,నెమ్మది గా ధైర్యం
సన్నగిల్లింది ,వ్యాపారం
సుబ్బి చేతుల్లో కి వెళ్ళింది .వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాడికి
భార్య అయ్యింది కానీ మాకు కోడలు కాలేదు .
చిన్న విషయాలకే ఇల్లు రభస
చేసేది ,భార్య
మాటకి ఎదురు చెప్పేవాడు కాదు సుబ్బి . రాను రాను ఆలి వైవు వారు ఆత్మబంధువులైరి
చందాన కోడలి పుట్టింటి వారు మా ఇంట్లో కి చోరకొని పెత్తనం చేయడం కూడా
జరిగింది .శెట్టిగార్ని నానా మాటలు అంటుంటే అది చూసి తట్టుకోలేక ఆయనను తీస్కుని
ఇంట్లో నుండి వచ్చేసి,వున్నా
కాస్త డబ్బులు తో ఇల్లు తీస్కుని ,చిన్న గా కూరల వ్యాపారం మొదలు పెట్టాను."
ఆ మాట
విన్న లావణ్య కి పట్ట రాని కోపం వచ్చి అప్పటికప్పుడు
వెళ్లి సుబ్బి ని వాయించేద్దాం అన్నంత కోపం వచ్చినా సంస్కారం అడ్డువచ్చింది .
"పిన్ని అయిందేదో అయింది మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించింది" అయితే
ఆత్మాభిమానం గల ఆవిడా అందుకు ఒప్పుకోలేదు . ఆ రోజు రాత్రి లావణ్య తన భర్త తో మాట్లాడి
వారికి చేయూత నివ్వాలని నిర్ణయించుకోంది .
గౌరమ్మగారి
తో మాట్లాడి "పిన్ని నేను
మీకు కొంత పెట్టుబడి సాయం చేస్తాను అలాగే మీలాంటి కొందర్ని కూడదీసుకొని ఇంట్లోనే
చిన్నగా చిరుతిళ్ళు అంటే చేగోడీలు ,జంతికలు సున్నుండలు లాంటివి
ఊరగాయలు వంటివి తయారు చేయండి వాటిని అమ్మెందుకు కావాల్సిన సాయం నేను చేస్తాను ,ఇది మీరు అప్పు గానే
భావించండి. " అని ప్రోత్సహించింది. అలా మొదలైంది "అభయ పిండివంటలు
"నెమ్మద్ది గా ఆ చుట్టుపక్కల అంత స్వచంగా దొరకడం తో అనతి కాలం లోనే మంచి పేరు
వచ్చింది .లావణ్య శ్రీకర్ లు కూడా వారు పని చేసే చోట మొదట్లో తీసుకువెళ్లి రుచి ని
పరిచయం చేసారు.బ్యాంకు లోను కాలేజీ లో ను ఇష్టపడే వారి సంఖ్యా పెరిగింది నెమ్మది
గా ఇంటి నుండి ఒక చిన్న షాప్ సెంటర్ లో అద్దె కి తీస్కొనే స్థాయికి పెరిగింది .
గౌరమ్మ గారు ఆవిడా లాగానే పిల్లల చేత నిరాదరణ గురైన తల్లితండ్రులను చేరదీసి పనిలో
చేర్చుకున్నారు.
అదే
సెంటర్ లో ఎక్కువ మంది కాలేజీ పిల్లలు రూమ్ ల్లో ఉండడం గమినించి వారి కోసం
"అభయ కర్రీ పాయింట్" తెరిచారు ,తక్కువ ఖర్చు తో శుభ్రంగా అమ్మ చేతి కమ్మని వంట
లాంటి పప్పు ,కూరలు,పచ్చళ్ళు చుట్టుపక్కల
స్టూడెంట్ పిల్లలు బాగా అలవాటు పడ్డారు,దానితో గిరాకీ పెరగసాగింది. మధ్య మధ్యలో వీలున్నప్పుడు అల్లా లావణ్య
శ్రీకర్ లు వచ్చి కుసలం కనుకోవడం,వీలైన
సాయం చేయడం చేస్తుండేవారు
ఇలా రెండు సంవత్సరాల్లో "అభయ పిండి వంటలు
" "అభయ కర్రీ పాయింట్ " చాల ప్రజాదరణ పొంది రాబడి పెరిగింది.
ఒకరోజు గౌరమ్మగారు లావణ్య ఇంటికి వచ్చి "మీ ఇద్దరి తో ఒక విషయం
చెప్పాలనుకుంటున్నాను అంటూ బిడియం గా మొదలు పెట్టారు ,వెంటనే శ్రీకర్ మీరు మా
అమ్మ లాంటి ఏదైనా నిరభ్యంతరం గా చెప్పొచ్చు .అనేసరికి ఆవిడా మొహం సంతోషం తో
వెలిగిపోయింది "గత రెండు సంవత్సరాలు గా మేము పదిమంది పిల్లల నిరాదరణ గురైన
తల్లితండ్రులం కాస్త కండపుష్టి ,మీ ఆదరణ తో వ్యాపారాన్ని నిలబెట్టుకుని ఈ స్థాయి కి వచ్చాం . అయితే
మా లాంటి అనాధ తల్లితండ్రులు బోల్డు మంది వున్నారు,అందరికి కాకపోయినాకొందరికి చేయూత నివ్వాలన్న
సంకల్పం కలిగింది మాకు. అయితే అలా చేరదీసే వారికీ కొన్ని బాధ్యతలు
అప్పగిద్దాం, ఆ
చుట్టుపక్కల వుండే ఉద్యోగం చేసే వాళ్ళ పిల్లల్ని చూసుకునే డే కేర్ కూడా ఆ సదన్ లో
ఉంటుంది ,ఇంతే
కాదు వారికి ఏ విద్య లో ప్రావీణ్యం ఉంటే అది చేయొచ్చు సంగీతం,కుట్లు అల్లికలు,మొక్కలు పెంచి కూరగాయాలు
ఒఅందించడం,పూలమాలలు
కట్టడం వంటివి, ఇలా
చేయడం వాళ్ళ వారికీ కొంత రాబడి కాలక్షేపం అస్తమానం పిల్లల్ని తల్చుకుని కుమిలి
పోవడం అనే బాధ తీరుతుంది .
ఇలా వారి లో ఆత్మస్థైర్యం నింపుతూ పాన ఎటు
"అభయ పిండివంటలు ,అభయ
కర్రీ పాయింట్ " మీద వాచ్చే ఆదాయం ఉందనే ఉంటుంది. దీనికి మీ తోడ్పాటు మాకు
కావాలి అని అడిగారు,ఆవిడా
చెప్పిన విధానానికి ఆవిడా దొడ్డ మనసుకి శ్రీకర్ దంపతులు ముచ్చట పడిపోయారు .ఆ సదన్
కి "అభయముద్ర సదన్ " అని పేరు నిర్ణయించారు . "అమ్మ రేపే సదన్
రిజిస్ట్రేషన్ పనులు ,తగిన
స్థలం చూసే పనులు ప్రారంభిద్దాం" అన్నాడు శ్రీకర్. తనకి వున్న
కొద్దిపాటి పరపతి తో ఈ
పనులు తేలికగా అయిపోయాయి ,గౌరమ్మగారు
ఆ దంపతులు తమ పైన చూపుతున్న ఆదరణ కి మురిసి పోయారు,వారివురు పదికాలాలు చల్లగా ఉండాలని దీవించారు.
సత్సంకల్పానికి
ప్రోత్సాహం దైవ సహాయం ఎప్పుడు వుంటాయని ఇంకో సారి రుజువైంది , సదన్ రిజిస్ట్రేషన్,సముద్రానికి దగ్గరగా
విశాలమైన నాలుగు గదుల ఇల్లు చుట్టూ చిన్న పెరడువుండేట్టుగా తీసుకున్నారు .
ఇంతేకాకుండా ఒక డాక్టర్ గారు ,అలాగే
మార్కెట్ దగ్గర ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నారు, శెట్టిగారి ఆరోగ్యం కాస్త
కుదుట పడింది ,శెట్టిగారు
గౌరమ్మ గారి తో సహా మొత్తం ఇరవై మంది పెద్దవాళ్ళు చేరారు సదన్ అది వాళ్ళందరి ఇల్లు
ఒకరు ఇజ్జువా కాదు ఒకరు తక్కువ కాదు ,సంతోషం బాధ శ్రమ అన్ని సమానంగా పంచుకునే వారు. కొందరు షాప్ లు చుస్తే
ఇంకొందరు మొక్కలు బాలగోగులు చూసి కాయగూరలు పండించే వారు ,ఇంకొందరు లెక్కలు వ్యవహారాలు
చూసే వారు.
ముందుగా
అనుకున్నట్టే చుట్టూ పక్కల వున్నా పిల్లలకి డే కేర్ సెంటర్ అలాగే ట్యూషన్ చెప్పడం, అలాగే సదన్ లో వున్నా
అన్నపూర్ణమ్మ గారు సంగీతం లో పాండిత్యం వుంది ,అందువల్ల ఆవిడ సంగీతం పాటలు చెప్పేవారు,ఇలా ఎవరికీ తోచిన విధంగా
వారికి కాలక్షేపం,అలాగే
సంపాదన ఉండేది ,రోజు
రోజు కి సడన్ కి మంచి పేరు పెరగసాగింది ,దానిలో చేరే సభ్యులు పెరుగుతున్నారు . మొక్కలు ,పిల్లలు,సదన్ లో తోటి వారి తో
సరదాగా గడిచిపోయేది అక్కడ సభ్యులకి,ఒంటరి తనం ఛాయలకి వచ్చేది కాదు .
వారానికి
ఒకసారి వచ్చి డాక్టర్ గారు చెకప్ చేసేవారు ,మరీ అనారోగ్యం తో వున్నా వారిని మ పసిబిడ్డల్లా చూసుకునే వారు
. అక్కడ ఎవరు ఎవరికీ వారి భాద్యత ఇది అని చెప్పక్కర్లేదు.,ఇది వారి కుటుంబం కుల మత
వర్ణ భేదాలు లేవు,అన్ని
పండగలు ఆచరించే వారు .వారి లక్ష్యం ఒకటే బ్రతికి నంత కాలం సంతోషం గా మిగతా సదన్
సభ్యులతో ఆనందం గా ఉండడం. ఆ సదన్ లో ఏ పెద్దలు తమ పిల్లల ఊసు ఎత్తరు ,రోజు డే కేర్ కి వచ్చే
పిల్లలే వాళ్ళ మనవలు ,ఆ మాటకి
వస్తే వారు ఒకర్ని ఒకరి అక్క ఒదిన అన్న బావ అంటూ ఆప్యాయం గా పిలుచుకుంటారు .ఆ
పిలుపు పెదవి అంచు నుండి కాకుండా మనసులో నుండి వస్తుంది అందువల్ల ఆనందం గా
వున్నారు.
అయితే
అంతా వయసు మళ్ళిన వారు కావడం తో గౌరమ్మ గారు శెట్టి గారు సదన్ వ్యవహారాలు
చూసుకునేందుకు తలలో నాలుక లా మెలిగేందుకు ఒక మనిషి ని చూడ మని లావణ్య కి చెప్పారు.
లావణ్య ఆవిడకి లక్ష్మి ని పరిచయం చేసింది . లక్ష్మి ముప్పై ఏళ్ళ వయసుంటుంది , ఆవిడకి
ఒక నాలుగు ఏళ్ళ పాప వుంది ,లక్ష్మి
భర్త సైన్యం లో పని చేసే వారు ఆ మధ్య జరిగిన బోర్డర్ లో కాల్పులకి కాశ్మీర్ లో
అసువులు బాసాడు . లక్ష్మి అధైర్య పడలేదు తాను డిగ్రీ పాస్ అయింది ఇంటికి దగ్గర్లో
వున్నా స్కూల్ లో టీచర్ గా పనిచేసేది.
అయితే కార్పొరేట్ స్కూల్ ల తాకిడి కి ఆ స్కూల్ కొట్టుకు పోయింది లక్ష్మి ఇల్లు
లావణ్య ఇంటికి దగ్గర్లో నే ,లక్ష్మి
కి టైలరింగ్ తెలుసు తాను లావణ్య
కి బట్టలు కుడుతుంటుంది. అలా వారిద్దరికీ స్నేహం ఏర్పడింది . లక్ష్మి పరిస్థితి
మనస్తత్వం తెలిసి గౌరమ్మ గారికి చెప్పి సదన్ లో పనిలో పెట్టింది.
సహజంగా
కష్ట పడే మనస్తత్వం వున్న లక్ష్మి తన
కలుపుగోలుతనం తో మంచితనం తో సదన్ లో యిట్టె కలిసి పోయింది. పిన్ని బాబాయ్ అత్తా
మావయ్య అంటూ సదన్ లో ని సభ్యుల్ని ఆప్యాయంగా పిలుస్తూ ఎవరైనా మందులు వేసుకోకపోయినా
,తినకూడని
వస్తువులు చాపల్యం చేత తినాలని చూసిన అమ్మ లాగా దెబ్బలాడి గారం చేసి చూసుకునేది .
గౌరమ్మ గారు లక్ష్మి ని కన్న కూతురిలాగా చూసుకునే వారు ,లక్ష్మి తాను స్కూల్ లో
సంపాదించే జీతం కన్నా ఎక్కువే ముట్టజెప్పేవారు . అంతేగాక లక్ష్మి కూతురు ఐశ్వర్య
సదన్ లో అందర్నీ తాత,బామ్మా
అంటూ ముద్దు ముద్దు గా తిరుగుతూ ఆడు కునేది .
కాలం
ఎప్పుడు ఒకేలాగా ఉండదు ,మనిషి
తాను చేసిన పాపపు కర్మలు ఇక్కడే చెల్లించేయాలి అంటారు పెద్దలు,ఆ నానుడి కి తగినట్టే
గౌరమ్మ గారి అబ్బాయి సుబ్బి కి కిరాణా కొట్టు వ్యాపారం సువర్ మార్కెట్ల దెబ్బకి
రెపరెపలాడింది .,బావమరిది
సలహా తో తాను అప్పు చేసి సూపర్ మార్కెట్లాంటిది మొదలు పెట్టిన దానిలో మెళకువలు
తెలియక చతికిల పడ్డాడు . ఒకనాడు సుబ్బి ని ఆ ఊరి పెద్ద ఒకాయన కలిస్ మాటల సందర్భంలో
" ఒరేయ్ సుబ్బి మొన్న విశాఖపట్నం లో మీ అమ్మగార్ని చూసాను రా మద్దిలపాలెం దగ్గర
,తానూ
క్షేమంగా నే వున్నాను అని ,మీ
నాన్నగారు కూడా కోలుకున్నారని " చెప్పారు.
ఆ మాట
విన్న సుబ్బి ఒకసారి అమ్మానాన్న పట్ల తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది గుర్తుకు
వచ్చి కళ్ళ నీరు ఆగలేదు,ఎలాగైనా
అమ్మానాన్నలని కలిసి ఒప్పించి వెనక్కు తీసుకురావాలని విశాఖపట్నం వెళ్లి ఊరిపెద్ద
చెప్పిన అడ్రస్ కి వెళ్లి వాకబు చేస్తే అక్కడ వాళ్ళు "అభయ ముద్ర సదన్ "
కి పంపారు .సదన్ చేరిన కొద్దిసేపటికి తన తల్లితండ్రులు ఎంతటి ఉన్నత మైన వారో తానూ
ఎంత తప్పు చేసానో తనకి తెలిసి వచ్చింది. అయితే గౌరమ్మ గారు శెట్టిగారు సదన్ కట్టుబాట్లకు
కట్టుబడి సుబ్బి తో అక్కడ మాట్లాడేందుకు ఇష్టపడ లేదు.
తనని
అమ్మా అని పిలవ వచ్చిన సుబ్బి ని "నాయనా నువ్వు పక్క వీధిలో వున్నా రామాలయం
దగ్గర వుండు మేము అక్కడికి వస్తాము."గౌరమ్మ గారి మొహం గంభీరం గా వుంది ఆవిడ
నిండు కుండా మాదిరి తొణకలేదు. పక్కవీధి లో వున్నా రామాలయానికి శెట్టి గార్ని
తీస్కుని బయల్దేరారు . అక్కడి వారిని చుసిన వెంటనే ఒక్కసారి భోరు మని కాళ్ల మీద
పడిపోయాడు సుబ్బి "అమ్మ నువ్వు నాన్న వెళ్ళిపోయినప్పుడు నా భార్య ఆమె
పుట్టింటి వారు మాటలు తలకెక్కించుకుని దేవతాస్వరూపాలైన మిమల్ని కాలదన్నుకున్నాను ,నా తప్పు నాకు తెలిసి
వచ్చింది వ్యాపారం లో నష్టం వచ్చింది నా అత్తా మామలు ,బావమరిది,ఆఖరి కి నా భార్య కూడా
నన్ను చేతకాని వాడి లా గ చూస్తుంటే చచ్చిపోవాలి అనిపిస్తోంది,మీరు నాతో తిరిగి వచ్చేయండి
కలిసి బ్రతుకుదాం " అంటూ
వెక్కి వెక్కి ఏడ్చాడు .
ఆ
పరిస్థితి విన్న ఆవిడ అతను చేసిన తప్పులు మరిచి చంటి బిడ్డని ఓదార్చినట్టు అక్కున
చేర్చుకున్నారు .. ఎంతైనా "అమ్మ మనస్సు " కదా . సుబ్బి ని ఓదార్చి
కాసేపటి తర్వాత "చూడు సుబ్బిజరిగిందేదో జరిగింది నేను మీ
నాన్నగారు ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాము ఇప్పుడు మా మీద నమ్మకం తో ఎందరో
పిల్లలు చేత తృణీ కరించ బడిన తల్లితండ్రులు వున్నారు ,మా రెక్కల పట్టు ఉన్నంత
కాలం ఆ సదన్ ని జాగ్రత్తగా చూసుకోవడం
మాకు సంతోషకరమైన భాద్యత . ఆ
శ్రీరామచంద్రుడి దయ వాళ్ళ నాకు కోరకుండానే లావణ్య లక్ష్మి అని ఇద్దరు కూతుర్లని, శ్రీకర్ అనే కొడుకు ని
ఇచ్చాడు.
ఈ జన్మ
కి ఇక్కడే మా పెద్ద ప్రాణాల్ని వెళ్ళిపోని ఇప్పుడు మేము నీతో వచ్చేస్తే ఇందరు అనాధ
పెద్దలకి మేము నూరిపోసి న ఆత్మస్థయిర్యం అనే చెట్టు ని కూకటి వేళ్ళతో
నరికేసినట్టే. అయితే గిరి కి తరువు భారం కాదు ,నీవు మా బిడ్డవి,కనుక నీ
కష్టం లో ఆదుకునేందుకు ప్రతి నెల మీ నాన్నగారి పెన్షన్ డబ్బులు నీకు అందేలా
చెయ్యమని శ్రీకర్ బాబు కి చెప్తాను.ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టు,కాస్త కఠినత్వం ప్రదర్శించి
నీ ఇల్లు చక్కదిద్దుకో " అని చెప్పి తన చెంగున ముఠా కట్టి తెచ్చిన
జంతికలు సున్నుండల పొట్లం చేతిలో పెట్టింది,శెట్టిగారు ఆయన జేబు లో నుండి ఐదు వందల కాగితం చేతిలో పెట్టి"
వుంచు ప్రయాణపు ఖర్చులకి" అని చెప్పి ఆ డంపుతలిద్దరు సదన్ వైపు నడిచారు.
గౌరమ్మగారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆవిడ్ని మార్చటం ఎవరి తరం కాదు అని తెలిసిన
సుబ్బి మారుమాట్లాడకుండా మంత్రముగ్ధుడైన్నట్టు తల్లి మాట ఆచరణ లో పెట్టె దిశగా
అడుగులు వేసాడు.
***
chala bagunnadamma!
ReplyDeleteChaala Chaala baaga raasavu. Chaduvuthu unnantha sepu yevaru pedda writer raasini story laaga undi. Nuvvu kuda pedda rachayatri avvalani korukuntu with best wishes
ReplyDelete