మనసుపాట మనసా వినవా
రెడ్లం చంద్రమౌళి
పల్లవి
వేల వేల వందనాల నీకు
ఓసి మనసా మాటే వినవా
తోచు మాటలన్ని పాటకూర్చనీవ
మనసుపాట మనసా వినవా
అను పల్లవి
ఊహలతో కలలకు రెక్కలు వేయకుమా
చెరిగినవో అతకవు ఆశలు రేపకుమా
కలను కరిగేవుమా నిజం విను నా మాటలు
||వేల వేల||
చరణం 1
నిజము మరిచేలా నిలువరించే
స్వప్నలోకం తలపులే మూయనీ
నిదురలోవున్నా నీడలాగే
వెంటసాగే కలతలే మాయనీ
జ్ఞాపకం నాటది ఆశయం నేటిది
అనుకుంటూ తనకంటూ మార్గం వేయని
||వేల వేల||
చరణం 2
చిగురు తొడిగేలా చీకటింట
కంటిపాప వెలుతురే చూడని
స్థిరముగా వున్నా మనసులోకి
మార్గమపుడు అడుగులే వేయని
జీవితం ఆశగా అనుభవం శ్వాసగా
దరిజేర్చే దారులుగా గమ్యం చేరని
||వేల వేల||
No comments:
Post a Comment