శ్రీధరమాధురి – 40
(యోగా గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు)
ప్రార్ధనలు/ధ్యానం/యోగా/మెడిటేషన్ అనేవి ధృడ
విశ్వాసంతో, అంకితభావంతో సమర్ధుడైన గురువు మార్గదర్శకత్వంలో చేసినప్పుడు, అది
మిమ్మల్ని విశ్వసత్యం వైపుకు తీసుకుని వెళ్తాయి.
***
అతను ఇంద్రియాలను జయించేందుకు నేను దారి చూపాలని కోరాడు...
నాకు ఇంద్రియాలే లేవు. అందుకే నాకు వాతో జ్ఞానమే లేదు. ఇక నేను
అతనికి ఏమి దారి చూపగలను?
ఈ ప్రపంచంలో జ్ఞానేంద్రియాలు కల ఎంతో మంది మార్గదర్శులు ఉన్నారు.
వారంతా తాము ఇంద్రియాలను నియంత్రించామని ప్రకటిస్తూ ఉంటారు. నియంత్రించడం అంటే
బలవంత పెట్టడం. వారు వారి ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించి, అదుపులో పెట్టారు.
బలవంతంగా మీరు దేన్నైనా క్రమశిక్షణలో పెడితే, ఎక్కువ కాలం అది మౌనంగా ఉండదు. ఏదో
ఒకరోజున అది తిరగబడుతుంది. అలా తిరగబడ్డప్పుడు ఆ వాంఛ సునామీలా మిమ్మల్ని
చుట్టేస్తుంది. ఇందుకోసం మీరు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతుల్ని వాడచ్చు,
కాని అది మీ ఇంద్రియాలను/మనసును మళ్ళించడానికి ఆడే ఒక ఆట మాత్రమే ! మీరు నిరంతర
ధ్యానం/జాగృత స్థితి లో ఉంటే కాని, లేక ఇంద్రియాలన్నీ దైవేచ్చ ప్రకారమే
పనిచేస్తాయని అంగీకరిస్తే కాని, లేక వాటంతట అవే విముఖత చెందే దాకా నిరీక్షిస్తే
కాని, ఇంద్రియాలను నియంత్రించడం అనేది కేవలం ఒక మిధ్య. మీరు నటిస్తూ, మిమ్మల్ని
మీరే మోసం చేసుకుంటున్నారు. జ్ఞాని మిమ్మల్ని చూసి నవ్వుతారు.
***
నిజమైన యోగికి మానసిక సంభావన ఉంటుంది.
***
నిజమైన యోగి ప్రకృతి యొక్క ఆకృతిని వాస్తవికంగా
అంగీకరిస్తారు, వారు ఏ పరిస్థితిలోనూ దుఃఖించరు.
***
జీవితంలో అనుకూలమైన పరిస్థితి అయినా, ప్రతికూలమైనదైనా
నిజమైన యోగి వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.
***
యోగా అనేది అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. యోగా మీ
వ్యక్తిత్వానికి కొత్త అర్ధాన్ని ఇస్తుంది. కాని, దాన్ని మీరొక నిజమైన యోగి ద్వారా
ఆరంభించాలి. లేకపోతే అది మీకు శారీరకంగా, మానసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది.
***
మీరు కూరలు, పళ్ళు, సరుకులు కొనేటప్పుడు నాణ్యతను
పరిశీలించి కొంటారు కదా? మరి యోగా అనే అంశంపై
మీరి డీవీడీలు/సీడీలు కొనేటప్పుడు ఆ సాధకుడు నిజమైన యోగో కాదో, చూడకుండా
ఎలా కొంటారు?
***
యోగా అంటే ఏరోబిక్స్ కాదు, అది అంతకంటే చాలా గొప్పది.
***
యోగా అనేది ప్రదర్శనకు కాదు. యోగా అనేది
వ్యక్తిగతమైనది. నిజమైన యోగి ప్రదర్శించరు, నిజమైన యోగి డబ్బు, కీర్తి కోసం
పాకులాడరు. ఆయన వాటన్నిటికీ అతీతమైనవారు.
***
పతంజలి యోగ సూత్రాలను ఆచరణలో
పెట్టేందుకు మార్గదర్శకత్వం కోసం అతను అనేకమంది సన్యాసులను కలిసాడు. మఠంలో ఉన్న ఒక
సన్యాసి అతనికి యోగ సూత్రాలను చదవమని, భావాన్ని అర్ధం చేసుకోమనీ, కాని ఆచరణలో
పెట్టడం చాలా కష్టం కనుక వద్దనీ, చెప్పారు. అతనికి తెలిసిందే ఆ సన్యాసి చెప్పాడు,
నిజానికి మఠంలో ఉన్న ఎవరికీ ఈ విషయంలో ఆచరణాత్మకమైన అనుభవం లేదు.
అవగాహన లేని వ్యక్తి యోగ సూత్రాలు అతి
క్లిష్టమైనవని అంటారు. చాలా వినోదాన్ని కలిగించే అంశం. వీరు సన్యాసులుగా
వ్యవహరిస్తారు, దైవం ఇవన్నీ చూసి, నేను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.
***
యోగా అంటే సంగమం... ఏకం కావడం...
ఒక నిజమైన సన్యాసి నిజమైన యోగిగా
ఉంటారు. (ప్రతి నిజమైన యోగి సన్యాసి కానక్కర్లేదు.) ఆయన సాక్షాత్తూ ‘ఆది నారాయణుడు’.
అటువంటి నిజమైన సన్యాసి సంఘాన్ని కలుపుతారు కాని, విడగొట్టరు. ఆయన భేద భావాలు
చూపరు. ఆయనకు జాతి, కులం, మతం, రంగు, లింగ భేదాలనేవి అర్ధరహితంగా అనిపిస్తాయి.
ఆయనకు మొత్తం ఉనికి ఒక్కటే. ఆయన ఎల్లప్పుడూ ఈ ‘ఏకత్వం’ కోసమే పోరాడుతూ ఉంటారు.
***
జీవితాన్ని క్షణక్షణం ఆస్వాదిస్తూ
జీవించండి. ఎందుకంటే పరిణామం అనేది ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. నెమ్మదిగా మీరు మీ లోపలున్న సామర్ధ్యాన్ని
గుర్తిస్తారు.
“క్షణ-ప్రతియోగి పరిణామ-అపరాంత
నిర్హ్రాహ్య కర్మః “ – పతంజలి యోగ సూత్రాలు
దీనికి అర్ధం పరిణామ ప్రక్రియ
ప్రతి క్షణం జరుగుతూ ఉంటుందని.
***
పతంజలి యోగ సూత్రాలు...
“తత్ జయత్ ప్రజ్ఞా లోకః”
మీరే అన్నింటినీ జయిస్తారు. మీరే విజేత అవుతారు. కాని, మీరు జ్ఞానులు అవ్వాలంటే ప్రాపంచిక విషయాలను
మీలోని చైతన్యం దూరంగా పెట్టాలి. ఒక నిజమైన యోగి అటువంటి విజేత. కాని, విశ్వా
జాగృతి నుంచి జనించిన ఆయన జ్ఞానం ప్రాపంచిక విషయాలను ఆయనకు దూరంగా పెడుతుంది. ఆయన
ఖచ్చితంగా ఆత్మ జ్ఞానం కలవారు. ఆయన ప్రతి దానిలో పాల్గొన్నా, ఆయన దేనికోసం ప్రాకులాడరు.
అటువంటి వ్యక్తే నిజమైన యోగి, ఆయన ప్రపంచాన్ని పెద్ద మొత్తంలో జయించడమే కాదు, తనను
తాను కూడా జయించి ఉంటారు.
***
“బాలేషు హస్తి- బల-అధిని” –
పతంజలి.
గజ బలంపై సమయమం (దృష్టి నిలపడం, ధ్యానించడం)
ద్వారా, ఒకరు ఆ గజబలాన్ని పొందుతారు.
ప్రతీదీ మన భావనలోనే ఉంది కదా?
***
అనుభవపూర్వకమైన మాటలు వాస్తవికతను
ప్రతిబింబిస్తాయా?
నా అనుభవాల్ని మీకు చెబుతూ ఉండగా నాకు
పతంజలి గుర్తుకు వస్తున్నారు.
“శబ్ద జ్ఞానానుపతి వస్తు –శూన్యో
వికల్ప” –
మాటలతో ఒకరి అనుభవాన్ని వివరించడం అనేది సాధ్యం కాదు.
నేను ఎంతగా వివరించినా, నేను వాస్తవికంగా ఆస్వాదించిన వాటిని చాలా తక్కువే చెప్పగలవు.
అయినా నేను మీతో పంచుకుంటాను.
***
నేను చాలామంది గుళ్ళకి వెళ్లి పూజలు
చెయ్యడం చూసాను. కొందరు ఇంట్లోనే శ్లోకాలు, స్తోత్రాలు చదువుతారు. కొందరు యోగా,
ధ్యానం చేస్తారు. కొందరు గురువుల, సాధువుల,జ్ఞానుల ప్రవచనాలకు వెళ్తారు. ఇదంతా వీరు కొన్ని దశాబ్దాల నుంచి చేస్తూ
ఉంటారు. మామూలుగా ఇవి వారి దైనందిన జీవనాల్లో కలిసి, వారి ఆతృతను తగ్గించి ఉండాలి.
ప్రతీదీ దైవం యొక్క బహుమతిగా భావించే సంయమనాన్ని కలిగించి ఉండాలి. కాని, వాస్తవం ఇందుకు విభిన్నంగా ఉంటుంది. వీరిలో
చాలామంది పూర్తి అహంతో, గర్వంతో, స్వార్ధం, లోభం, అసూయతో నిండి ఉంటారు.
కొన్నిసార్లు వారు పూర్తి కోపంతో, అసంతృప్తితో, స్వసానుభుతితో కూడుకుని ఉంటారు.
ఇదంతా చూసినప్పుడు,
ఇన్నేళ్ళుగా వీరు ఆచరణలో పెట్టిన విధానాలు, వీరిలో ప్రతీ దానిలో దైవాన్నే దర్శించి
అంగీకరించేందుకు తగినంత పరిణితిని కలిగించలేకపోయాయని
నేను భావిస్తాను. వారు ఈ విధా నాలన్నీ యాంత్రికంగా చేస్తున్నారు, ఇవన్నీ కేవలం
గొప్పలు కొట్టుకోడానికి పనికొచ్చే అహపు యాత్రలు. అటువంటి వారి జీవితం మొత్తం
అబద్ధం, నిజానికి ఒక జీవితం పూర్తిగా వృధా చెయ్యబడింది.
అయినా, భగవంతుడి ప్రణాళికలను ఎవరు ప్రశ్నించగలరు? అందుకే అదీ
దైవేచ్చే, ఇతరులకు ‘ఎలా ప్రవర్తించకూడదో’ బోధించేందుకు ఆయన విధానాలు ఆయనకు
ఉన్నాయి. మా ప్రార్ధనలు.
***
ఎవరో గురువుని
ఇలా అడిగారు, “గురువర్యా, నాకు యోగా నేర్చుకోవాలని ఉంది. నా ఆలోచనల్ని నేను
మెరుగుపరచుకోవాలని అనుకుంటున్నాను. ఎన్నేళ్ళు పడుతుంది?”
గురువు పదేళ్ళు పడుతుందని బదులిచ్చారు.
“నేను పగలూ, రాత్రి పనిచేస్తాను. అప్పుడు ఎంత కాలం
పడుతుంది?” అని అతను మళ్ళీ అడిగాడు. “ఇరవై ఏళ్ళు” అన్నారు గురువు.
నిజానికి ప్రయాస అనేదే లేదు. ప్రతీదీ దాని స్థానంలో
ఇమిడిపోతుంది. జీవితం సులువైనది. ఆధ్యాత్మికత సులువైనది. మీరు ప్రయత్నం చేసే
కొద్దీ, అది మీ అహాన్ని తృప్తి పరుస్తుంది, కనుక అది కేవలం ఒక అహపు యాత్ర. యోగ
పేరుతో, యాగాల పేరుతో అహపు యాత్రల్ని చెయ్యడం మీకు నేర్పారు. ఇవన్నీ ఆహాపు
యాత్రలు, నటనలు, అంతే. ఇవన్నీ విడనాడండి.
***
మనకు మనఃశాంతి ఎందుకు లభ్యం కావట్లేదు? డబ్బు
ప్రశాంతతను ఇవ్వట్లేదు, ఆలయాలకు, చర్చ్ లకి, మసీదులకి వెళ్ళటం, ఆధ్యాత్మిక
దిగ్గజాలను కలవడం ప్రశాంతతను ఇవ్వట్లేదు. యోగ, ధ్యానం చెయ్యడం వంటివి ప్రశాంతతను ఇవ్వట్లేదు. తనను తాను
మెరుగుపరచుకునే పేరుతో, యోగా, ధ్యానం అనేవి వ్యాపారంలా కొనసాగుతున్నాయి. “నేనిది
చేస్తే, నాకది దక్కుతుంది” అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీకు ముందే ఏర్పరచుకున్న
భావనలు ఉంటాయి. మీ ప్రణాళిక ప్రకారమే అంతా జరుగుతుందని మీరు భావిస్తారు. ఎన్ని
సార్లు మీరు మీ ఆలోచనలు, భావనలు, ఉద్వేగాలకు సమాధానం ఇచ్చారు? మీ పరిధులు
తెలియకుండా మిమ్మల్ని మీరు ఆదర్శవంతంగా చేసుకున్నారు. అంతా మీ చేతుల్లోనే ఉందని
భావించడం వలన మిమ్మల్ని మీరు త్రోసిపుచ్చుకున్నారు. మరుక్షణం అనిశ్చితమైనది. ఆ
అనిశ్చితిని మనిషి అంగీకరించలేడు. మీకు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. అసలు సమస్య ఇక్కడే
ఉంది. ఇదే ఆశించడం అనే దానికి జన్మ స్థానం. మీరు జీవితాన్ని సొంతం చేసుకోలేరు.
జీవితానికే మీరు సొంతమవ్వండి. అప్పుడే సరైన మార్గం దొరుకుతుంది.
ప్రాపంచిక విషయాల పరంగా పురోగతిని సాధించే లక్ష్యంతో కొనసాగే సంఘం,
సుప్తావస్థలో ఉన్న మనసును జాగృతం చేసే అసలైన యోగాని తిరస్కరించి, “హఠ యోగానికి”
ప్రాధాన్యతను ఇచ్చింది. ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్షును
పెంచుతుంది. అంతే కాక, తాము ‘హఠ యోగులమని’ కొందరు గొప్పగా, గర్వంగా చెప్పుకునే
అవకాశాన్ని ఇస్తుంది. నిజానికి యోగా, అహం అనేవి విరుద్ధమైనవి. పతంజలి నిర్దేశించిన
సూత్రాలు బాహ్య పద్ధతుల ద్వారా అంతర్గత వృద్ధిని పొందేవి. దురదృష్టవశాత్తూ, ప్రజలు
బాహ్యానికే అలవాటు పడి, అంతరంగాన్ని మరిచారు.
***
యోగా అంటే కలయిక, అంటే మన ఆత్మను పరమాత్మలో సంలీనం చేయటం. విడివడింది ఎప్పుడు?, సంలీనం చెయ్యటానికి. సముద్రం లోని నీటిబొట్టు తాను ప్రత్యేకం అనుకోవటం లాంటిది, ఆ అహాన్ని వీడడమే యోగా! గురుదేవులకు నమస్సులు __/|\__
ReplyDeleteఓం శ్రీగురుభ్యోనమః
ReplyDelete