తరాల అంతరాలు..
సుజాత తిమ్మన.
93 91 34 10 29 ..
ఆచారాలకు మూడు ముళ్ళు వేసిన సంస్కృతే భారతీయత..
ప్రాంతాలు వేరైనా...భాషలలో తేడాలున్నా..యాసలో భేదాలెన్నైనా..
ప్రాచిన కాలం నుంచి తనదైన మొదటి స్థానంలో నిలిచింది...మహిళే...
ఎప్పటి కప్పుడు ఆవకాయ అన్నంలో అమోఘమైన రుచి దాగిఉందో...
అమ్మమ్మ గారి కథలు వింటూ ఉంటె...ఆ ఆహ్లాదము అంతేమరి..
ఎనిమిదేళ్ళ వయసులో బొమ్మల పెళ్లి మాదిరి వేడుక చేసి..
‘ఇతనే నీ మొగుడు’ అంటే...మెడలో తాళి చూసుకుంటూ...వెర్రి నవ్వు నవ్విందట....
పదేళ్ళ బావ..ఉరుకుతూ ఉంటె.. ఊడిన గోచిని పెట్టుకోవడం చూసి..
.తెలియని వయసులో కాపురం అయినా..ఒకరిపై ఒకరు కంటి చూపుతో కూడా
అధికారం చూపించనివ్వని గౌరవం పెంచుకొని..అరవై ఏళ్ళ దాంపత్యం సాగించారట...
గడప దాటకపోయినా ...పౌరాణికపుస్తకాలన్నీ చదివి ఆకళింపుజేసుకొని..
తనే మొదటి గురువుగా ...నడక ..నడవడికల గురించి చెప్పేది ....పిల్లలకి..
ఆడపిల్లలని బడికి పంపించి చదివించాలనే
ఆలోచనలు రేపెట్టిన కాలం అమ్మది..
‘ఉత్తరం రాయడం వస్తే చాలు ‘ అన్న నానుడిలోనుంచి...
ఉద్యోగం చెయ్యాడం సబబేననే ఉద్దేశ్యం పుట్టి..
ఇంటిని చక్కదిద్దుకోవడమే కాక కార్యాలయంలోను
ఉన్నతమైన పదవిని పొందిన ఘనత..అమ్మది..
ఒక్క చదువే కాదు..అన్ని కళలలోను
రాణించగలం మేము అని చెప్పే తరం మాదే కదూ..
ప్రతి పరీక్షలోను ప్రధమంగా ఉంటూ..పతకాలను ..గెలుచుకుంటూ..
ఆకాశపుటంచులను తాకే ఉద్యేగంతో ముందుకడుగువేస్తూ.. ..
అమ్మానాన్నల కలలను సాకారం చెయ్యటమే కాదు...
వారి కంటి చివరల చెమరింపులమై ..నిలిచి..
వృద్దాశ్రమాల విడిచే కొడుకు కంటే....’
నా కూతురు ‘ అనే గర్వాని వారికి సొంతం చేసి..చివరి శ్వాసవరకు..
వారితో కలిసి జీవిస్తూ...
ఆబోసినవ్వుల పంటలను ..
నా పిల్లల బోసినవ్వులకు జత చేస్తాను..’
నేను అమ్మాయిని...’.!!
************
No comments:
Post a Comment