ప్రపంచములోని బలమైన వైమానిక దళాలు
అంబడిపూడి శ్యామసుందర రావు ,గుంటూరు ,
ఫోన్ నం 9440235340.
1.యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ఆఫ్ అమెరికా:-అత్యధిక సంఖ్యలో యుద్దవిమానాలను కలిగిఉన్నది. ఈ సంఖ్య మిగిలిన దేశాల యుద్దవిమానాల మొత్తము సంఖ్యతో ఇంచుమించు సమానము సాంకేతికముగా అమెరికా యుద్ధవిమానాలు ప్రపంచములోనే ఉన్నతమైనవి సెప్టెంబర్ 11న ,"మా దగ్గరకు ఎవరు చేరలేరు" అన్న నినాదముతో ప్రారంభమయినది 2012 నాటికి 5,638 యుద్ద విమానాలు,450 ICBM లతో,63 ఉపగ్రహాలతో పటిష్టమైన శక్తిగా రూపొందింది . 140 బిల్లియన్ల డాలర్ల బడ్జట్,332,854 మంది సిబ్బంది అందులో 185,522 మంది సివిలియన్ సిబ్బంది,71,400 మంది ఎయిర్ ఫోర్స్ రిజర్వు ,మరియు 106,700 మంది ఎయిర్ నేషనల్ గార్డ్ సిబ్బందితో ప్రపంచములోనే అతి పెద్ద వైమానిక శక్తిగా ఎదిగింది . అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అనేక యుద్దాలలో క్లిష్ట పరిస్తుతులలో మిలిటరీ మరియు ఎయిర్ అపరేషన్సు ను సంర్ధవంతముగా నిర్వహించింది . అమెరికన్ వైమానిక దళ సిబ్బంది అరోగ్య పరముగా పూర్తీ ఫిట్నెస్ తో ఉంటారు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నేలపై యుద్దముచేసే దళాలకు పూర్తీ సహకారము అందిస్తూ ఉంటుంది.
.
2. రష్యన్ ఎయిర్ ఫోర్స్:-1991-92లో USSR (సోవియట్ యూనియన్ )విడిపోయినప్పుడు రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పడి అనతికాలములోనే ప్రపంచములోని శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ లలో ఒకటిగా రూపుదిద్దుకొన్నది . స్పానిష్
సివిల్ వార్ జపాన్ తో జరిగిన యుద్దాలలో పాల్గొని ప్రత్యక్ష అనుభవాన్ని సంపాదించుకొన్నది. 1980లోనె సుమారు 10,000ఎయిర్ క్రాఫ్ట్‌లను సమకూర్చుకొని 1990ప్రారంభానికి సోవియట్ యూనియన్ సూపర్ పవర్ అనిపించుకోవటానికి అవసరమైన వైమానిక దళాన్ని సంఖ్య పరముగా క్వాలిటి పరముగా ఏర్పరచుకోన్నది రష్యన్
.ఎయిర్ ఫోర్స్ లో 3000లకు పైగా బాంబర్ విమానాలు 4500ఫైటర్ విమానాలు వీటిలొ మిగ్ 29,ఫల్‌క్రమ్,మిగ్ 25 ఫాక్స్ బాట్ వంటి అత్యాధునిక విమానలుకూడా ఉన్నాయి . ఇవికాకుండా సు 24ఫెన్సర్ ,సు 25 ఫ్రాగ్ ఫుట్ ,మరియు సు 17ఫిట్టర్ యుద్ద విమానాలను కలిగివుంది 3.ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ :-28మే 1948లో "ఎయిర్ అండ్ స్పేస్ ఆమ్" గా పిలవబడే ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ప్రారంభిపబడినది మాములుగా ఎయిర్ కార్పస్ అని పిలుస్తూ ఉంటారు ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ లో చేకొస్లోవియా నుండి కొనుగోలుచేసిన ఇరవై ఐదు ఎవియా S -199 యుద్ద విమానాలు, 62 సూపర్ మెరైన్ స్పిట్ ఫైర్ యుద్ద విమానాలు ఉన్నాయి ఇవే కాకుండా అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ దళాలు ఉన్నాయి.చరిత్రను గమనిస్తే ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ శత్రువులను ఎదుర్కోవటములో చాలా పటిష్టమైనదిగా తననుతాను ఋజువుచేసుకొన్నది.
.
4.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ :-1,500ల యుద్ద విమానాలతో,170,000 సిబ్బందితో ప్రపంచములో నాలగవ ఎయిర్ ఫోర్స్ గా ప్రసిద్ది కెక్కింది అధికారికముగా అక్టొబెర్ ఎనిమిది,1932 లో స్తాపించబడినది అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ప్రపంచవ్యాప్తముగా పేరిన్నిక గల వైమానిక దళముగా ప్రసిద్ది చెందినది పొరుగుదేశాలైన చైనా పాకిస్తాన్ లతో జరిగిన యుద్దాలలో పదాతిదళానికి సహకరించి విజయాలను సాధించింది .1999లో జరిగిన కార్గిల్ యుద్దములో ఎయిర్ ఫోర్స్ పాత్ర గణనీయమైనది.
5. రాయల్ ఎయిర్ ఫోర్స్ ( యునైటెడ్ కింగ్ డమ్):-రాయల్ నావల్ ఎయిర్ ఫోర్స్ ,రాయల్ ఫ్లైయింగ్ కార్పస్ కలిసి ఏప్రిల్ ఒకటి 1918న రాయల్ ఎయిర్ ఫోర్స్ గా అవతరించింది కాబట్టి ప్రపంచములోని వైమానిక దళాలలో అతి పురాతనమైనది గా గుర్తించబడినది వ్యూహాత్మక బాంబు దాడులకు బాగా పేరిన్నిక కలది . బ్రిటిష్ మిలిటరి చరిత్రలోనే ప్రముఖమైన రెండవ ప్రపంచ యుద్దములో గణనీయమైన పాత్ర పోషించింది అప్పుడు"విపత్కర పరిస్తుతులనుండి నక్షత్రాలకు" అన్న నినాదముతో రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రసిద్ది చెందింది 2012 నుండి 826 యుద్ద విమానాలతో యూరోపియన్ యూనియన్ లోనే అతి పెద్ద వైమానిక దళముగాను,నాటో లొ రెండవ పెద్ద వైమానిక శక్తిగా (అమెరికా తరువాత ) ప్రాముఖ్యత సంతరించుకొన్నది.
6.పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (చైనా):- 1949 నవంబర్ 11న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారికముగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి అనుభంధముగా ఎయిర్ ఫోర్సును ప్రకటించింది ప్రస్తుతము 330,000 మంది సిబ్బంది 2500 కన్నా ఎక్కువ యుద్ద విమానాలను కలిగి ఉన్నది.ప్రమాదకరమైన యుద్దవిమానలతో ఆసియా లోనే పెద్ద ఎయిర్ ఫోర్స్ గా చెలామణి అవుతుంది సోవియట్ యునియన్ పతనము తరువాత రష్యా చైనాకు పెద్ద ఆయుధాల సరఫరాదారుడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానముతో ఆకాశములో శత్రు దాడులను సమర్దవంతముగా ఎదుర్కొనే శక్తిని గలది చైనా ఎయిర్ ఫోర్స్.
7. ఆర్మీ డీ ఎల్ ఎయిర్ (ఫ్రాన్స్):-1933లో స్వతంత్ర విభాగముగా ఫ్రాన్సు ఎయిర్ ఫోర్స్ రూపొందింది రెండవ ప్రపంచ యుద్దము తరువాత ఫ్రాన్సు యుద్ద విమానాల తయారీ ప్రారంభించింది ప్రాంచావ్యాప్తముగా మంచి యుద్ద విమానముగా పెరిన్నిక గల "మిరాజ్ " విమానాలు ప్రాన్సు ఉత్పత్తిచేసేవే ఇవి గల్ఫ్ యుద్దములో సమర్ధవంతమైన పాత్రను పోషించాయి ఫ్రాన్సుకు 300ల ఆధునికమైన యుద్ద విమానాలు ఉన్నాయి వీటిలో 158 దాస్సల్ట్ మిరాజ్ విమానాలు ,59దాస్సల్ట్ రాఫెల్ విమానాలు ఉన్నాయి ప్రస్తుతము A 400M మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని సమకూర్చుకోనే ప్రయత్నములో ఉన్నది.
8. లుఫ్త్ వాఫే (జర్మనీ ):-1935లో జర్మనీ వార్సైల్స్ ఒప్పందాన్ని కాదని జర్మన్ సైన్యములో వైమానిక విభాగాన్ని ప్రారంభించింది ప్రస్తుతము అమెరికా ప్రభుత్వము జర్మని ఎయిర్ ఫోర్స్ కు నాటో నూక్లియార్ షేరింగ్ ఒప్పందము
ప్రకారము అణ్వాయుధాలను సరఫరా చేస్తుంది. ప్రస్తుతము జర్మన్ ఎయిర్ ఫోర్స్‌లో 3,400,000 మంది సిబ్బంది 119,871 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రపంచములో రెండవ ప్రపంచయుద్దము నాటికి గగన తలములో యుద్దము చేయటములో మంచి అనుభవము ఉన్న దేశముగా జర్మనీకిపేరు ఉన్నది . 2005 నుండి 2008 వరకు నాటో
నిర్వహించిన బాల్టిక్ ఎయిర్ పోలిసింగ్ ఆపరేషన్ లో జర్మన్ F -4 ఫాంటమ్ ఫైటర్ విమానాలు పాల్గొన్నాయి చాలామంది జర్మన్ ఎయిర్ ఫోర్స్ లోని పైలట్లు అమెరికా కెనడా లలో శిక్షణ పొందినవారే!
9. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ (ఆస్ట్రేలియా):-ఇది మార్చ్ 31,1921లో ఏర్పడింది రెండవ ప్రపంచ యుద్దము,ఇతర ప్రముఖమైన యుద్దాలలో పాల్గొన్న అనుభవము ఉన్నది 13,991 మంది నేరుగా ఆపరేషన్స్ లో పాల్గొనే వారు, 4,316మంది రిజర్వ్ సిబ్బంది మరియు 275 యుద్ద విమానాలను కలిగి ఉంది వీరి నినాదముకూదా "విపత్కర పరిస్తితులనుండి నక్షత్రాలకు"అన్నదే .
10.జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జపాన్):- ఇంపీరియల్ జపనీస్ ఆర్మీమరియు నేవిలను రద్దుచేస్తూ 1954 జులై ఒకటవ తేదిన జపాన్ ఎయిర్ సెల్ఫ్‌డిఫెన్స్ ఫోర్స్ స్తాపించబడ్డది. తన రక్షణే ప్రధాన లక్ష్యముగా జపాన్ తన ఎయిర్ ఫోర్స్ ను ప్రారంభించింది జపాన్ చుట్టు ఎయిర్ పెట్రోలింగ్ వ్యవస్తను రాడార్ సిస్టం ద్వారా నెలకొల్పింది 2005 నాటికి 45,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నది 2010 నాటికి జపాన్ ఎయిర్ ఫోర్స్ 805 ఎయిర్ క్రాఫ్ట్స్ ను కలిగిఉన్నది వాటిలో 424 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లు ఇవండీ ప్రపంచములోని వివిధ దేశాల వైమానిక దళాల స్థితిగతులు అన్ని దేశాలు ఏ క్షణాన అయినా యుద్ధము వస్తే ఎదుర్కోవటానికి పూర్తి సిద్ధముగా ఉన్నాయి.
***
No comments:
Post a Comment