బాల గేయాలు - అచ్చంగా తెలుగు
బాల గేయాలు 
టేకుమళ్ళ వెంకటప్పయ్య

"కాళ్ళాగజ్జ కంకాళమ్మ" అనగానే బాల్యంలో దాగుడుమూతలాటలు గుర్తొస్తాయి. దాగుడు మూతలు ఆడేముందు పిల్లలందరం దొంగ ఎవరో డిసైడ్ చేయడానికి కొన్ని సార్లు చెమ్మ చెక్క ఆట మరికొన్ని సార్లు పిల్లలందరం కింద రౌండుగా కాళ్ళు చాపుకుని కూర్చుని పాటని

“కాళ్ళా గజ్జ కంకాళమ్మా 
వేగు చుక్క వెలగ పండు
కాలు తీసి కడగా పెట్టు.” 

అని పాడుతూ చేత్తో కాళ్ళు చూపిస్తూ "కడగాపెట్టు" అన్న పదం ఎవరి కాలి మీదకి వస్తే వాళ్ళు దొరలు.  చివరిగా మిగిలిపోయిన వాళ్ళని దొంగగా నిర్ణయించే వాళ్ళం.
మీకు గుర్తుందా ఈ పాట.  ఇంకా... ఆలస్యం చేయకుండా పిల్లలకు నేర్పించండి. తెలుగు బాలల పాటల్ని ముందు తరాలకు తీసుకెళ్ళండి.
కాళ్ళా గజ్జ - కంకాళమ్మా
వేగుల చుక్కా - వెలగ మొగ్గ
మొగ్గ కాదు - మొదుగ నీరు
నీరు కాదు - నిమ్మల బావి
బావి కాదు - బచ్చల కూర
కూర కాదు - గుమ్మడి పండు
పండూ కాదు - పాపాయి కాలు
కాలు తీసి - కడగా పెట్టు!

ఈరోజుల్లో వీడియోలు, టీవీల్లో కామిక్స్ వచ్చేశాయి గానీ ఒక 30-35 సంవత్సరాల క్రితం శలవలు వస్తే పిల్లల అల్లరే అల్లరి. ఆరోజులు తిరిగి వస్తాయని కాదుగానీ తిరిగివస్తే బావుండన్న ఆశ మాత్రం ఉంది.

No comments:

Post a Comment

Pages