కృష్ణ ప్రతీకారం - అచ్చంగా తెలుగు

కృష్ణ ప్రతీకారం

Share This
కృష్ణ ప్రతీకారం
.....అఖిలాశ


ఊరికి చివర కొండల నడుమ ఒక ఆవును పెంచుకుంటూ కృష్ణ వారి అమ్మ కాంతమ్మ ఉంటారు.భర్త చనిపోవడంతో ఆవు పాలు అమ్ముకొని బతుకుతూ ఉంటారు.కృష్ణ ఐదవ తరగతి చదువుతుంటాడు.ఒక రోజు కాంతమ్మ ఆవు పాలు కోసమని పితకడానికి వెళ్తుంది.కాని ఆవు పాలు ఇవ్వడం మానేసింది.కాంతమ్మ దిగులుపడుతూ ఉంటుంది. ఎలా బతకాలి అని అప్పుడు కృష్ణ తన తల్లి బాధ చూసి అమ్మ నేను ఒక పని చేస్తాను ఈ అవును అమ్మి వేసి డబ్బులు తీసుకొస్తాను దానితో మనము ఏదైనా చేద్దాము అంటాడు.
కాంతమ్మ వద్దు అన్న వినకుండా ఆవును తీసుకోని వెళ్తాడు. మార్గ మధ్యలో ఒక ముసలివాడు కనిపించి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు.కృష్ణ జరిగిన విషయం చెప్తాడు.సరే నేను నీకు ఒక ఉపాయం చెప్తాను నా దగ్గర మ్యాజిక్ బీన్స్ ఉన్నాయి అవి నాటితే పొద్దున్నకి పెద్ద తీగ అయిపోతుంది అంటాడు.సరే చూపించు అంటే ఆ ముసలివాడు చూపిస్తాడు అవి అరచేతిలో రత్నల్లాగా మెరిసిపోతూ ఉంటాయి. వెంటనే ఆవును ముసలివాడికి ఇచ్చి ఆ బీన్స్ ని తీసుకోని ఇంటికి చేరుతాడు.
తల్లికి చూపించి విషయాన్ని చెప్తాడు. తల్లి నిన్ను ఎవరో మోసం చేసారు నేను ముందే చెప్పా కదా వద్దు అని అయినా వినలేదు నువ్వు అని కృష్ణ పై కోప్పడి వెళ్లి పడుకో అని చెప్పి ఆ బీన్స్ ని కిచెన్ కిటికీ నుండి బయటకి పడివేస్తుంది.
కృష్ణ ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంటాడు,ప్రొద్దునే లేవగానే ఒక పెద్ద తీగ ఆకాశం పై వరకు ఉంటుంది.కృష్ణ ఆనందంగా ఆ తీగాను పట్టుకొని పైకి వెళ్తాడు.ఆ తీగ కొనకి వెళ్ళగానే ఒక వింత ప్రపంచం కనిపిస్తుంది.అప్పుడే ఒక అందమైన అమ్మాయి కనపడుతుంది.హాయ్ కృష్ణ నువ్వు నాకు తెలుసు కాని నేను నీకు తెలియదు నీ గురించి మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఒక పెద్ద భవనం చూపించి ఈ భవనం మీదే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ నాన్న గారిని చంపివేసారు.ఆ విషయం మీ అమ్మ నీతో చెప్పలేదు ఎందుకంటే నిన్ను కూడా చంపుతారు అని చెప్పి మాయమౌతుంది.
ఆ భవనం దగ్గరికి కృష్ణ వెళ్తాడు,తలుపు తిట్టాడు. ఒక వికారమైన ఆడ మనిషి తలుపు తెరిచి ఎవరు నీవు?ఏమి కావలి? నీకు అని అడుగుతుంది.కృష్ణ అమ్మ నేను ఒక వారం నుండి అన్నం తినలేదు నాకు అన్నం పెట్టండి అని అడుగుతాడు.తను సరే లోపలికి రా అని చెప్పి అన్నం పెడుతుంది కాని నువ్వు త్వరగా తిని వెళ్ళు లేదంటే మా ఆయన వచ్చి నిన్ను తినేస్తాడు అని చెప్పగానే అప్పుడే ఎవరో తలుపు తట్టుతారు? కృష్ణను ఒక బల్ల కింద దాచిపెట్టి.ఆమె వెళ్లి తలుపు తెరవగానే ఆమె భర్త కనకారావు ఇంట్లోకి వచ్చి ఆకలిగా ఉంది మాంసం పెట్టు అంటాడు సరే అని వెళ్లి తీసుకోని వచ్చి వడ్డిస్తుంది.
తిని నా డబ్బులు తీసుకోని రా అంటాడు వెంటనే భార్య వెళ్లి డబ్బు మూట తీసుకోని వచ్చి ఇస్తుంది. దానిని లెక్క పెడుతూ అలసి పోయిన కనకారావు అలాగే పడుకుంటాడు.వెంటనే తేరుకున్న కృష్ణ ఎవరు లేనిది చూసి ఆ డబ్బు మూట తీసుకోని తీగ దిగి వెళ్ళిపోతాడు.ఆ డబ్బుతో ఆనందంగా వారి జీవనం కొనసాగుతూ ఉంటుంది.
ఒక రోజు కృష్ణ కి పైన ఏమి జరుగుతుందో అని తెలుసుకోవాలని కుతూహలంతో పైకి వెళ్తాడు.రహస్యంగా ఒక కిటికీ నుండి లోపలి వెళ్తాడు.అందరూ నిద్రపోతూ ఉంటారుసరే అని ఇల్లు అంతా వెతుకుతాడు ఒక బంగారు కోడి కనపడుతుంది వెంటనే దానిని తీసుకోని బయటికి రాబోతుంటే ఆ కోడి ప్రభు ప్రభు అని కేకలు వేస్తుంది అది గమనించిన కనకారావు లేచి కృష్ణను వెంబడిస్తాడు.కృష్ణ త్వరగా పరిగెత్తుకుంటూ తీగ సహాయంతో క్రిందికివస్తూ అమ్మ త్వరగా గొడ్డలి ఇవ్వు అని చెప్తాడు.అది గమనించిన తల్లి కృష్ణ కు గొడ్డలి ఇస్తుంది.కృష్ణ గొడ్డలితో ఆ తిగాను నరికివేస్తాడు. కనకారావు క్రింద పడి చనిపోతాడు.
తల్లి కాంతమ్మ కృష్ణ తో చూడు నాయన కనకారావు మీ తండ్రిని అత్యాశతో చంపి వేసాడు కాని వాడికి తగిన విధంగా బుద్ధి చెప్పావు కాని నువ్వు కూడా అలాగే అత్యాశకు పోతున్నావు అలా చేయను అని మాట ఇవ్వు అంటుంది.సరే అని తల్లి మాటకు ఏకీభవిస్తాడు.తర్వాత ఆనందంగా జీవనం గడుపుతారు.
నీతి :-మనము బీదరికములో ఉన్నాము అని ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని దొంగతనాలు చేయరాదు. సన్మార్గంలో సంపాదించిన డబ్బు మాత్రమే నిలబడుతుంది.కథలో కృష్ణ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్న విధానము తప్పు,దొంగతనము చేయరాదు.

 ***

No comments:

Post a Comment

Pages