పోల్చటమెందుకు? - అచ్చంగా తెలుగు
పోల్చటమెందుకు?
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

కుడికంటితో ఎడమకంటిని పోల్చటమెందుకు?
రెండూకలిసే కదా నీకు చూపునిస్తున్నాయి. 
పెద్దకొడుకుతో చిన్నకొడుకును పోల్చటమెందుకు?
ఇద్దరూకలిసే కదా నిన్ను ఆదరిస్తునారు.
పగలుతో రాత్రిని పోల్చటమెందుకు?
రెండూకలిసే కదా నిన్ను సేదతీరుస్తున్నాయి. 
జననంతో మరణాన్నిపోల్చటమెందుకు?
రెండూకలిసే కదా నీకు గుర్తింపునిస్తున్నాయి. 
వేసవితో వెన్నెలను పోల్చటమెందుకు?
రెండూకలిసే కదా నీకు సుఖంవిలువను తెలియజేస్తున్నాయి.
కలతో ఇలని పోల్చటమెందుకు?
రెండూకలిసే కదా నీకు విచిత్రమైన అనుభూతులిస్తున్నాయి.
ఇల్లాలితో ప్రియురాలిని పోల్చట మెందుకు?
ఇద్దరూకలిసే కదా నీకు అనుభూతులు,సానుభూతుల్ని అందిస్తునారు.
గతంతో వర్తమానాన్ని పోల్చటమెందుకు?
రెండూకలిసే కదా నీకు గుణపాఠం నేర్పిస్తున్నాయి.
అమ్మతో అర్ధాంగిని పోల్చటమెందుకు?
ఇద్దరూకలిసే కదా నీ జీవితాన్ని నడిపిస్తున్నారు.
సుఖంతో దుఃఖాన్ని పోల్చటమెందుకు?
రెండూకలిసే కదా నీకు సమభావాన్ని బోధిస్తునాయి.
              
***   

No comments:

Post a Comment

Pages