సాహిత్యం – సమాజం - అచ్చంగా తెలుగు
సాహిత్యంసమాజం
బాలాంత్రపు రమణ 

"సహిత స్వభావః సాహిత్యం" "హితేనసహితం సాహిత్యం" - అంటే హితంతో కూడినది, హితాన్ని కూర్చేది సాహిత్యంసకల విద్యలకీ తల్లి అయిన సరస్వతీదేవికి సంబంధించినది సారస్వతంవాక్+మయం వాఙ్మయంఅంటే వాక్కుతో కూడుకున్నది. ఇది కూడా సాహిత్యంతో కూడుకుని ఉన్నదేపురాణాల్ని వాజ్మయాలన్నారు. పురాణం, కవిత్వం, కథ, నవల, నాటకం, లేఖాసాహిత్యం, జానపద సాహిత్యం - ఇలా అంతా  సాహిత్యమే.
హితాన్ని చేకూర్చేది, మేలుతో కూడినది సాహిత్యం అన్నప్పుడు - ఏది హితం? ఎవరికి హితం? వీటికి సమాధానo కాలాన్ని బట్టి, దేశాన్నిబట్టి, సంస్కృతిని బట్టి, సమాజం చెందే పరిణామాల్ని బట్టి మారుతూ ఉంటుందిఅయితే "విశ్వశ్రేయం కావ్యం" అన్నారుసమాజానికి మేలు చేకూర్చేది మాత్రమే ఉత్తమసాహిత్యంఅలాగే మధ్యమ సాహిత్యం, అధమ సాహిత్యం కూడా ఉన్నాయిమధ్యమ సాహిత్యం  సమాజానికి మేలు చేయకపోయినా, కీడు మాత్రం చేయదుఅధమ సాహిత్యం వల్ల సమాజానికి మేలు మాట అటుంచి, కీడే జరుగుతుంది.   చేతిలో కలం కదా అని ది బడితే అది వ్రాసి సమాజం మీదికి గుప్పించకూడదుహింసనీ, టెర్రరిజాన్నీ  గొప్పగా చిత్రీకరించటం, బూతు సాహిత్యం, మొదలైన వాటిని విష సాహిత్యం అని అనవచ్చుదీనివల్ల సమజంలో - ముఖ్యంగా యువతలోవిలువలు, నీతి వర్తనము అన్నీ క్షీణించిపోతాయిఅలాంటి పౌరులు అధిక శాతంలో కలిగి ఉన్న సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందో వెరే చెప్పనక్కఱలేదు.
కాబట్టి ఉత్తమసాహిత్యం దేశానికైనా, సమాజానికైనా, కాలానికైనా ఆవశ్యకము, అభిలషణీయము కదాఒక జాతి యొక్క సంస్కృతి జాతియొక్క సాహిత్యంలొనూ, అది చెందిని పరిణితిలోనూ ప్రతిఫలిస్తుంది. కాబట్టి రచియత సామాజిక స్పృహ కలిగిఉండి, బాధ్యతాయుతంగా రచనలు కొనసాగించడం శ్రేయస్కరం.
భక్తి సాహిత్యం భగవద్భక్తి కలవారికి ఆధ్యాత్మికతనీ, పాపభీతినీ  కలిగిస్తుందిభగవంతుడు లేడు అనుకునేవారికి కూడా ఋజువర్తనము, మానవతా విలువలు, ధర్మాధర్మ, లేదా న్యాయాన్యాయ విచారణ అవసరమే కదా.   సాహిత్యం వల్ల ఆస్తికులకీ, నాస్తికులకీ కూడా నైతిక ప్రవర్తన ఏర్పడుతుంది. ఆత్మవత్సర్వభూతాని అనే భావంతో సకల ప్రాణికోటినీ సమతా దృష్టితో చూసే నడవడిక సిద్ధిస్తుందిమనిషి ఉద్వేగరహిత జీవనం గడప గలుగుతాడు.
సాహిత్యానికీ సమాజానికీ అవినాభావ సంబంధం ఉంది. సమాజంలోంచి సాహిత్యం పుడుతుందిసాహిత్య సృష్టి చేసేవాడు కూడా సమాజంలోని వ్యక్తే కదా. ఒక జాతి యొక్క సంస్కృతిని, నాగరికతని  ముందు తరాలకి అందించడంలో సాహిత్యం పోషించే పాత్ర అత్యంత ముఖ్యమైనది. అలాగే సాహిత్యం మనుగడ కూడా సమాజంపైన ఆధారపడి ఉంటుంది. సమాజం నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి ఉత్తమమైన సాహిత్యమైనా మూలపడుతుంది.   దురదృష్టవశాత్తూ ప్రస్తుతం తెలుగు సాహిత్యం  నిరాదరణకి గురి అవుతోందిమన భాషని మనమే అశ్రద్ధ చేసుకుంటున్నాం.  
వైదిక మత పునురద్ధరణ కోసం, వేద ధర్మ ప్రచారం కోసం రాజరాజ నరేంద్రుడి ప్రేరణతో నన్నయ్య భారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడుతిక్కన భారతం  హరిహరాద్వైత బోధనకీ శైవ-వైష్ణవ మత సామరస్యానికీ దోహదపడిందిపురాణ గాధలు తెలుగులో రచియంచబడ్డాయి.   శివకవుల రచనలలో శైవమత ప్రాబల్యం దర్శనమిస్తుందిశతకరచన బహుముఖాలుగా సంఘంలో ఉండే లోటుపాట్లని విప్పి చూపించింది. సంస్కరణలకి దారి తీసింది.   ఆయా  కాలాల్లో  ఆయా సామాజిక ప్రయోజనాలతో బాటు సాహిత్యాభివృద్ధి జరిగిందిప్రబంధ యుగంలో భాషా సౌందర్యం వెల్లి విరియడమే కాక, అప్పటి భోగాలాలసతనీ, విలాస జీవన విధానాన్నీ వ్యక్తపరిచిందిఆధునిక సాహిత్యంలో సామాజిక తపన, మానవత్వ కాంక్ష, సమతా భావన చోటు చేసుకున్నాయి
సాహిత్య రచనైనా సమాజాన్ని మంత్రదండంలా మార్చి వేయజాలదుకాలక్రమేణ పరిణామానికి సాహిత్యం తోడ్పడుతుందిఉత్తమ సాహిత్యం మానవుని ఆలోచనకి పదునిపెట్టి సంస్కారాన్ని పెంచుతుందిహరిశ్చంద్రుని కథవల్ల మహాత్మా గాంధీ లాంటి వారొ ఒకరు ప్రభావితులు కావచ్చునుభారత రామాయణ, భాగవతాదులు చదివినంత మాత్రానా పాపాలు చేయకుండా ఉంటారాఅయితే మానసిక పరివర్తనకి, మానవతా విలువల్ని గ్రహించడానికి,  సన్మార్గoలో జీవించడానికి ఆధ్యాత్మిక సాహిత్యం దోహదపడుతుంది.  
శ్రీశ్రీ యుగంతో సమాజం  అభ్యుదయం వైపు మళ్ళింది. నేటి స్త్రీవాద, దళితవాద సాహిత్యం కొత్త కొణాలని ఆవిష్కరిస్తోందికాబట్టి సామాజిక ప్రగతికి, మంచిని పెంపొందడానికీ, మానవతా విలువలు వెల్లివిరియదానికీ  ఉత్తమ సాహిత్యం ఎప్పుడూ అవసరమేమంచి సమాజం కోసం సాహిత్యంమంచి సాహిత్యం కోసం సమాజం అనడం సమంజసంగా ఉంటుందిఎందుకంటే ఒక సమాజం, లేదా సంఘం, లేదా జాతి యొక్క సంస్కృతిని తెలియజేసేదీ, ముందు తరాలకి అందించేదీ సాహిత్యమే కదా
అయితే అభ్యుదయం పేరుతో మూలాలు కోసేసుకోనక్కరలేదుఆధునిక సాహిత్యానికి మూలాలు ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయిఒకదానికి పెద్దపీట వేసి రెండోదాన్ని నిరాదరించడం అభిలషణీయం కాదు.  దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం అదే జరుగుతోంది ధోరణి మారి మన ప్రస్తుత సమాజం ఉత్తమ సాహిత్య పునరుద్ధరణకి దారి తీస్తుందని ఆశిద్దాం. -  జై హింద్.

రమణ బాలాంత్రపు 

No comments:

Post a Comment

Pages