శివమ్మ కధ -5 - అచ్చంగా తెలుగు
శివం- 29 
( శివుడే చెబుతున్న కధలు)
శివమ్మ కధ – 5
రాజ కార్తీక్
 9290523901


(శివమ్మ భక్తి కి మెచ్చిన శివుడు ..తను వర్షం లో ప్రమాదానికి గురి అవ్వబోతుండగా కాపాడి ..ఆమెతో పాటు ఇంటికి వస్తాడు ...వెంటనే శివుడిని వెతుకుతూ నంది కూడా వస్తాడు ...అక్కడ శివుడి ప్రవర్తన చూసి నంది ఆశ్చర్య పడతాడు....శివుడు శివమ్మ పెట్టే పాయసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.)
"నంది  ..శివమ్మ ఏమి చెప్పినా మనం చేయాలి , తన భక్తికి నేను కట్టుబడి ఉండాలి, స్వయానా  మహాదేవుడినే ఐనా నేను నియమాలు పాటించాలి ,కానీ శివమ్మ కోరిక మేరకు చేసిన ఏ పని ప్రపంచానికి హాని చేయదు అందుకే ఆమె ఉమ్మమంటే ఉమ్మాను  ," అన్నాను నేను.
నంది "నాకు తెల్సు ప్రభు ,తమరు ఊరికే భోలా శంకరులు అనిపించుకుంటారా.." అన్నాడు.
"అమ్మా పాయసం అయ్యిందా ..నీకోసం నేను చూస్తున్నా " గట్టిగా పిలిచాను.
విష్ణు దేవుడితో సహా పార్వతి మాత ,బ్రహ్మ దేవుడు ,సరస్వతి ,అందరు దేవతలు... ఇక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్నారు...
పార్వతి మాత "సరిపోయింది సోదరా ..ఈ తల్లి కొడుకులు ఇక మనలని ఎలా ఆటపట్టిస్తారో" అంది.
విష్ణు దేవుడు "అదీ సరే కానీ సోదరీ! ముందు ఆ పాయసం పెట్టిస్తావా నాకు ..." అని అడిగారు.
లక్ష్మి దేవి "అంతేలే ముందు వచ్చిన మాకన్నా, వెనక వచ్చిన భక్తులే మిన్న "అంటూ చిరు కోపం ప్రదర్శించింది. 
విష్ణు దేవుడు "చూడవయ్యా శివయ్య ,ఈ పాయసం నారదుడు చేసే పనులు చేస్తుంది .."అన్నారు ఆటపట్టిస్తూ.
ఈ లోపు వచ్చాడు అక్కడికి  నారదుడు కుడా " నారాయణ నారాయణ !ఏంటి శివయ్య ఏమిచేయబోతున్నాడో ఎవరికీ అర్ధం కాకుండా చేసాడు " అంటూ.
నేను "అమ్మా అమ్మా ! తొందరగా పాయసం తీసుకురా.....అసలు మంచి పాయసం తిని చాల కాలం అయ్యింది " అని తొందరపెట్టసాగాను.
పార్వతి మాత "చూడు సోదరా ... హాలాహలం మింగి నప్పుడు వైకుంఠం వచ్చి పాలసముద్రంలో  పాలు తీసుకొని వచ్చి మరీ ఎంత పాయసం చేసి పెట్టానో ! నోటికి తీయగా ఉంటుందని పెడితే, చూడు మహా దేవుడికి  అది గుర్తు రావట్లేదు  "అంది చలోక్తిగా.
ఇక చూడండి దేవతలు ..ద్విమూర్తులు అందరు ..ఆ పాయసం కోసం ఎదురుచూపులు చూడసాగారు.
నేను "అమ్మ పాయసం ఎంత సేపు ...." అని అరవసాగాను.
శివమ్మ "వస్తున్నా శివయ్య ...నీకోసం ఎంతో  ప్రత్యేకంగా చేస్తున్నా " అంది.
అందరికి నోరు ఊర్తుంది .....ఆ పాయసం ఘుమ ఘుమ ..అన్ని లోకాల్లోనూ వస్తోంది ...
శివమ్మ "శివయ్య పాయసం  తీసుకువస్తున్నా " అంది.
నేను "ఐ ఐ ఐ భళీ భళీ " అన్నాను
నంది ఆశ్చర్యపోయి చూస్తున్నాడు .....గుటకలు వేస్తున్నాడు ...
శివమ్మ పాయసం తెస్తుంది ..నా మనసు ఆ భక్తురాలి ప్రేమ కోసం పరితపిస్తుంది ....
శివమ్మ  "శివయ్యా నువ్వీ  పాయసం తాగాలి అంటే  నాదొక షరతు" అంది.
అందరు ఆశ్చర్యపోతున్నారు .... మహాదేవుడు ఇంతసేపు ఎదురుచూసిన ప్రసాదం కోసం షరతు ఏంటి అని..
నేను "అమ్మా, నువ్వు ఏది చెపితే అది చేస్తా ,నాకు షరతులు ఎందుకు ,నీ మాట జవదాటి నేను ఏమన్నా చేస్తనా ,కొడుకుని ఎవరైనా ఆజ్ఞాపించాలి కానీ ఇలా అడగకూడదు " అన్నాను.
శివమ్మ "అవును శివయ్య ఈ ముసలిదానికి చాదస్తం ఎక్కువ అయ్యి అలా అన్నా" అంది.
నేను లేచి వెళ్లి అమ్మ దగ్గరకు వెళ్ళి "అమ్మా నువ్వు నా దగ్గర ఎలాగయినా ఉండవచ్చు. నీకు నీ కొడుకు దగ్గర  కాక ఎవరి దగ్గర చనువు చెప్పు ..నాతో నువ్వు ఆడవచ్చు, పాడవచ్చు .నీకేం కావాలంటే అది చెయ్యవచ్చు ." అన్నాను.
శివమ్మ "స్వామి అని కాళ్ళ మీద పడబోయింది. "అమ్మ ఏంటిది ఎవరైనా బిడ్డ పాదాలు పట్టుకుంటారా ...మా మంచి అమ్మవి కదూ ..""అంటూ వాటేసుకున్నా ...
శివమ్మ నా ఆలింగనం లో ఎంతో ఆనందాన్ని పొందింది ..
శివమ్మ "అయ్యా ! అన్ని లోకాలకు..నువ్వు పితవి ..అన్నిటికీ సృష్టి  స్తితి లయ  కారకుడివి నువ్వు..అలాంటి  ఓ మహాదేవుడా! ఎందుకు ఈ పూజ కూడా చేయటం చేతకాని ఈ  భక్తురాలిపై నీకు ఇంత ప్రేమ ..అంటు బోరున ఏడుస్తుంది  "
అందరూ చూసి ఆనందబాష్పాలు తుడుచు కున్నారు....పార్వత మాత ఐతే ' స్త్రీ యొక్క పుత్రా ప్రేమ ఎంత గొప్పదో 'అందరికి ఉదహరిస్తోంది.
నేను  "అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ..నేను ఉండగా నీకు భయం ఎందుకు ...అమ్మా, నీ ప్రేమకి ఎప్పుడో బానిసను అయ్యాను ..వీరికి నేను ప్రభువును ఏమో కాని, నీకు ,నీ ప్రేమకు నేను ఎప్పుడూ బానిసను ." అంటూ ఆమె కన్నీరు తుడిచాను ...
శివమ్మ కి పట్టలేని ఆనందంతో కన్నీరు కారుస్తోంది ...
నేను "నా బుజ్జి అమ్మ , నా కన్నలు ,నా బంగారు కొండ ,కదా "ఇప్పుడు ఏమి అయ్యిందని....నేను ఉన్నాను కదా " అన్నాను.
నంది మాత్రం ధారకట్టిన కన్నులతో శివమ్మ అదృష్టం చూసి ఆనందపడుతున్నాడు ...
నంది "మహదేవా! నీ గురించి తలిచిన ఎంత పుణ్యమో ..నీ భక్తులను కొనియాడిన అంత పుణ్యం ..." అన్నాడు.
నేను "అమ్మా, ఎందుకు అంటూ ప్రేమగా విసుక్కున్నా ....అమ్మ నా చిత్రపటాన్ని చూసి ముద్దు పెట్టుకుంటావుగా. నా చక్కనయ్య! అని. ఇప్పుడు నేను ఎదురుగ ఉన్నా మరి" అన్నాను.
శివమ్మ "అవునయ్యా !ఆనందంతో మరిచిపోయా...."అంటూ చేతులు తీసుకొని నా మొహాన్ని పట్టుకుంది ..
ఒక తల్లి తన ఎదిగిన బిడ్డని చూసినట్టు చూస్తోంది ....
శివయ్యా, అంటూ ఒక్కసారి నా కళ్ళలోకి చూసి ..గట్టిగా నా నుదురు మీద ముద్దు ఇచ్చింది ...
నేను ఊరుకుంటానా ...అమ్మా అంటూ ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నా.
చిన్న పిల్లాడ్ని ఒక తల్లి ముద్దు పెట్టుకున్నట్లు ...నా మొహం అంతా మా అమ్మ ముద్దులతో నింపేసింది ..
నేనేమో ..ఆనందము గా నవ్వుకుంటున్నా ..
విష్ణు దేవుడు "ఈ తల్లి చూడు లోకాలను సృష్టించిన వాడికే తల్లి .." అన్నారు.
పార్వతి మాత "ఎప్పుడూ విరాగిగా ఉంటాడు మహాదేవుడు ...ఆయనికి ప్రేమ బాధ, దుఃఖం, ఆనందం ఉండదు ..కానీ ఈ భక్తురాలి ప్రేమకి చూడు ఎంత ఆనందంగా నవ్వుతున్నాడో " అన్నది.
నంది "మహాదేవుడ్ని ముద్దులాడాలని నాకు ఎందుకు ఎప్పుడూ అనిపించలేదు "అని మనసులో అనుకుంటున్నాడు.
ఇక చూడండి,  నేను మా అమ్మ ఒకరినొకరం హత్తుకుపోయాము..ఎంతో ప్రేమగా శివమ్మ  నెలల బిడ్డను ముద్దాడినట్టు నన్ను ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది ..
అందరు ఆమె భాగ్యానికి  ఈర్ష్య పడుతున్నారు ..
శివమ్మ నన్ను తన బిడ్డ అని పూర్తిగా అనుకుంటుంది ..
నన్ను వాటేసుకొని ఉన్న శివమ్మ "నా బంగారు తండ్రి! నా దగ్గరకు రావటానికి ఇంత కాలం పట్టిందా ?చెప్పు, ఈ తల్లి నీకోసం ఎన్నాళ్ళ నుండి చూస్తుంది  చెప్పు"
అంది.

నేను "వచ్చాను కదా! నేను ఇక నీ దగ్గర ఉంటా, ఎప్పుడు నువ్వు నా దగ్గర ఉంటావు .." అన్నాను.
ఏమో ఆ తల్లి ఆనందం నన్ను ఎంతప్రేమగా వాటేసుకుందో ....ఉన్నట్లుండి ఆమె కిందకు కూలబడిపోయింది ..
అందరు నిర్ఘంతపోయారు ..
నేను "అమ్మ ఎందుకు ఏమైంది ఎందుకు పడిపోయావ్ "అని ఒక సాధారణ మనిషి లాగా బెంగపడిపోయాను ..మా అమ్మను చూసి అలా ఉండలేకపోయాను ..
(సశేషం)

No comments:

Post a Comment

Pages