శ్రీధరమాధురి - 41 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 41

Share This
 శ్రీధరమాధురి - 41 
(చీకటివెలుగుల గురించి పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
‘తమసోమా జ్యోతిర్గమయా...’
మీ ప్రార్ధనలలో నిజాయితీ ఉంటే, మీకు వెలుగు(జ్ఞానం) కనిపిస్తుంది. చీకటి(అజ్ఞానం) తొలగిపోతుంది. చాలామంది ప్రార్ధనలు చేస్తూ ఉంటారు, కాని వారు చీకటితో, ప్రతికూల శక్తులతో ఆవరించబడి ఉంటారు. చీకటి తొలగిపోవాలంటే మీ ప్రార్ధనలలో నిజాయితీగా ఉండండి.
 ***
‘అసతోమా జ్యోతిర్గమయా...’
శక్తికి ఉండే చాకటి వైపు మిమ్మల్ని ఏదీ గుర్తుచేసుకోనివ్వడు. అజ్ఞానం మిమ్మల్నిఏదీ జ్ఞప్తికి తెచ్చుకోనివ్వదు. అందుకే పరమానందాన్ని చేకూర్చే గురువు మీకు తెలిసినా, మీరు పూర్తిగా మర్చిపోయి, గుర్తు చేసుకోలేనిదాన్ని జ్ఞప్తికి తెచ్చేందుకే వస్తారు.
                                                          ***

మైనం గురువు, లోపల మండే ఒత్తి, దాసుడు. వారిద్దరూ కలిసి ఈ చీకటి జగతికి వెలుగులు పంచుతారు. ఒత్తి (దాసుడు/భక్తుడు) కాలుతున్న కొద్దీ, మైనం (గురువు) కూడా కరిగిపోతుంది. తద్వారా ఇరువురూ కలిసి లోకంలో జ్ఞాన దీపాల్ని వెలిగిస్తారు. వీరిద్దరినీ విడదియ్యలేము, వీరు కలిసికట్టుగా పని చేస్తారు. వారిద్దరూ ఒకరినొకరు ఆశ్రయించుకుని పని చేస్తారు.
                                                    ***
జీవితంలో ధైర్యం అన్నది చాలా ముఖ్యమైన విషయం. భయం అనేదే మీకు జరుగగల అతి చెడ్డ అంశం.దైవం ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో మీ చుట్టుప్రక్కలే ఉంటారు కనుక ఎన్నడూ భయపడకండి. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. ప్రశ్నించలేనంత గొప్ప విశ్వాసం కలిగి ఉండండి. మీకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఆయన మీ గురించి బాగా శ్రద్ధ తీసుకుంటారు. ఆయన్ని మీరు మర్చిపోయినప్పుడు అంతా చీకటిగా కనిపిస్తుంది, నిస్తేజంగా అనిపిస్తుంది.
 ***
చీకటిని చెడుగా, వెలుగును మంచిగా భావించే అపోహలు ఎందుకంటే, చీకటిలో చూడలేక భయపడే మన అసమర్ధత వల్ల. చీకటిలో చూడగల నిశాచరులకు వెలుగే చెడు కావచ్చు. కాబట్టి వెలుగును మంచని, చీకటిని చెడని ఆలోచించే అజ్ఞానానికి చికిత్స చెయ్యాలి. అన్నింటిలో ఒక అందం ఉందని, ఆ అందమే అంతటా నిండి ఉన్న దైవమని, జ్ఞానికి బాగా తెలుసు.
 ***
యోగా ద్వారా మీలోని అనుకూల శక్తులన్నీ కలిసి, మీలోని చీకటిని, ప్రతికూలతలను నాశనం చేస్తాయి. ఇది చెడుపై మంచి సాధించే విజయం. కాబట్టి యోగా, ధ్యానం, ప్రార్ధనలు చేస్తూ ఉండండి.

 ***
విషయాలన్నీ ఉదసీనంగా, అగమ్యగోచరంగా జరుగుతున్నప్పుడు, విశ్వాసం అనే దీపం సాయంతో నడవండి. భయమనే చీకటి సొరంగం,  విశ్వాసపు వెలుగువంటి దైవం ద్వారా మాయం చెయ్యబడుతుంది.

 ***
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చీకటి ఛాయలు ఉంటాయి. దీని గురించి అపరాధ భావనతో దిగులు పడకండి. మీరు కర్తలు కాదు. అది దైవేచ్చ, అలా జరగాల్సి ఉంది కనుక జరిగింది. చీకటి గతాన్ని మరచిపోయే అలవాటు చేసుకోండి. దాన్ని విడిచి ముందుకు సాగిపోండి. ఆత్మా న్యూన్యతా భావంతో బాధపడకండి. మీ చీకటి గతాన్ని తిరగతోడి మీ ప్రస్తుతాన్ని పాడుచేసే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకండి.
                                                      ***

ఆయన నశించిపోయే వాటిల్ని అన్నింటినీ నాశానం చేస్తారు. ఆయన చీకటిని కాల్చేస్తారు, మనలో శాశ్వతమైన జ్ఞాన దీపాన్ని వెలిగిస్తారు.
                                                       ***

ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు ఇతరులలో భయాన్ని, జాడ్యాన్ని సృష్టిస్తారు. వారు చీకటికి దేవదూతల వంటివారు. వారి నుంచి వీలైనంత దూరంగా ఉండండి.
                                                       ***
మతం పేరుతో ఎత్తులు వేసే మాయగాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మీరు అపవిత్రులని చెబుతూ వీరు మీలో అపరాధ భావనను కలిగిస్తారు. ఈ చీకటి వైపుకు మీరు ఎరగా వాలకండి.
                                                        ***

మీరు సంపూర్ణ శరణాగతిని చేసినప్పుడు, దైవం చీకటి సొరంగం చివరలో మీకు వెలుగును చూపుతారు.
 ***
తన వ్యక్తిత్వాన్ని అపోహలు, ఊహలతో అంచనా వేసే ముందే అతను తన జీవితంలోని చీకటి కోణాన్ని గురించి, తన కాబోయే భార్యకు పెళ్ళికి ముందే తెలిపాడు. ఇప్పుడు దాన్ని అంగీకరించడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది.
 ***
ఛాందసత్వం అనేది బుద్ధి వేసే ఒక ఎత్తు. హృదయానికి ఇటువంటి కపటాలు తెలియవు, దానికి తెలిసింది ప్రేమ మాత్రమే ! ప్రేమ మిమ్మల్ని దైవానికి చేరువగా తీసుకుని వెళ్తుంది. ఎత్తులు మిమ్మల్ని అపోహాలు, ఊహలతో చీకట్లో నివసించేలా చేస్తాయి.
  ***

1 comment:

Pages