తెలవారని రేయిని - అచ్చంగా తెలుగు
demo-image

తెలవారని రేయిని

Share This
తెలవారని రేయిని
 రెడ్లం చంద్రమౌళి
పలమనేరు
9642618288


తెలవారని రేయిని
చిగురంత ఆశ మొలకెత్తి నాలో
పెనుచీకటంతా పొగమంచులాగ కరిగిందని
తెలవారని రేయిని
***
అరుణోదయాన అమవాశ కళ్ళు
తెరతీసి వెలుగే చూడనీ
చంద్రోదయాన నా వాలు కళ్ళు
వెన్నెలతొ వెలుగే నిండనీ
ఆకాశమంత ఆశున్న చాలు
ఏ చీకటైనా కరిగేనని
తెలవారని రేయిని
***
గుండెల్లొ మంట చల్లార్చుతున్న
కన్నీటి పరుగు
కలకాలం ఉండిపోలేదని
ఇన్నాళ్ళ వ్యధలు కాలాన కరిగి
ఈనాటితో వీడిపోవాలని
మునుపంటి క్రింద అధరాల బాధ
చిరకాలం నవ్వుకోవాలని
తెలవారని రేయిని
***
అవరోధమున్న నది ఆగుతుందా
ముంచెత్తి వరదై పొంగదా
వెనకడుగు పడిన అల ఊరుకుందా
అలుపంటురాక సాగదా
ఏ గమ్యమైన నిను చేరుతుందా
వెంటపడి అడుగే వేయక
పరదాలు తీసి పలకునా
దరిచేరు దారే చూపునా
తెలవారని రేయిని
***
పెనుముప్పు పొంచివున్న
నిను ముంచుకొచ్చిన
చెరగని చిరునవ్వే కదా ఆశన్నది
నడిరేయి ముంచిన
శిశిరాన్ని తుంచిన
చెదరని ధైర్యమే కదా ఆశన్నది
ఏనాడు విడవకు ఆశను నువ్వు
పెదవుల నవ్వులను
చిగురించిన ధైర్యం ఊపిరి తనకు
మరువకు కడవరకు
నమ్మకం నావగా ఆశయం శ్వాసగా
సాగిపో నేస్తమా
తెలవారని రేయిని
***

Comment Using!!

Pages