తెలుగుదనం ఉట్టిపడే బొమ్మల రూపకర్త - ఆర్టిస్ట్ చందు
భావరాజు పద్మిని
నమస్కారమండి. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
నమస్కారం, నేను పుట్టింది తే.06-11-1960 ఒరిస్సా లోని మల్కానగిరి జిల్లా, మథిలి గ్రామంలో . శ్రీ అంకం నీలకంఠం , అమ్మడమ్మ అమ్మా నాన్నలు. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఓ అక్క. భార్య చందన, పిల్లలు కీర్తన, శ్రుతి. నా పూర్తి పేరు చంద్రశేఖర్. చందు పేరుతో బొమ్మలు వేయడం వల్ల అదే స్థిర పడిపోయింది. మా పెద్ద తమ్ముడు ఉదయ భాస్కర్ ఈనాడు లో ఆర్టిస్ట్.
మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ? చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ?
పెద్దన్నయ్య బొమ్మలు వేసేవాడు. అది నాకు inspiration.
చిన్నప్పటి నుంచి నాన్న గారి ప్రోత్సాహంతో బొమ్మలు నుండే గీసే వాణ్ని.
చిన్నప్పటి నుంచి నాన్న గారి ప్రోత్సాహంతో బొమ్మలు నుండే గీసే వాణ్ని.
మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
వడ్డాది పాపయ్య ,బాపు, చంద్ర, మోహన్ గారు అభిమాన చిత్రకారులు. ప్రతాప్ ములిక్క్ (పూణే) గారితో చాలా కాలం కలసి పని చేయడం జరిగింది. వారిని నా గురువుగా భావిస్తాను.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
1980 లో దూరపు బంధువు (వరుసకు మామయ్య) నన్ను విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడినుండి ఆర్టిస్ట్ గా నా ప్రయాణం మొదలయింది.
1982 లో చొక్కాపు వెంకటరమణ గారు (రచయిత, ఇంద్రజాలికుడు)నన్ను విజయవాడ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళి తను ఎడిటర్ గా పని చేస్తున్న బాల చంద్రిక అనే పిల్లల పత్రికలో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది.అక్కడనుండి చాల తెలుగు పత్రికలకు హిందీ,ఇంగ్లీష్ కామిక్స్ ,అనిమేషన్ ఫీల్డ్ లో కూడా వర్క్ చేశాను.ప్రస్తుతం Swan Edulabs అనే సంస్థ లో Art Director గా work చేస్తున్నాను.

ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
ఈ ఫీల్డ్ లో వడిదుడుకులు సహజమే. ఎక్కడా permanent జాబ్ అంటూ వుండదు. జాబ్ పోయినా,కంపెనీ క్లోజ్ అయిన.ఇబ్బంది పడేది ఆర్టిస్ట్ లే.
మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
నేను వేసిన బొమ్మల్లో పాపులర్ అంటూ ఏమీలేవు. నేను వేసిన
బొమ్మలవల్ల నేను పాపులర్ అయ్యానేమో....
నేను వేసిన బొమ్మల్లో పాపులర్ అంటూ ఏమీలేవు. నేను వేసిన
బొమ్మలవల్ల నేను పాపులర్ అయ్యానేమో....
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
అవార్డులు కూడా ఏమి లేవు. వాటి కోసం నేను పరిగేట్టలేదు. But పుణే లో వున్నప్పుడు అక్కడి Fine arts College Principal నా కామిక్స్ చూసి వాళ్ళ College లో Demonstration ఇవ్వమని అడిగారు. అంతకంటే ప్రశంస ఇంకేం వుంటుంది.
నా బొమ్మలు ఇంకా బావుండాలని నా భార్య ఇచ్చే ప్రోత్సాహం తక్కువేమీ కాదు.
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
కష్టపడి కాదు ఇష్టపడి బొమ్మలు గీయండి.
చివరిగా... Indian mythology మీద Oil paintings వేసి Exhibition చేయాలని నా Dream.
Mail id:chanduartist6@gmail.com
Mobile No:91 9177212770
శ్రీ చందు గారు మరిన్ని మంచి బొమ్మలు వేసి, కీర్తి ప్రతిష్టలు సంపాదించి, విజయ శిఖరాలను అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తోంది - అచ్చంగా తెలుగు.
శ్రీ చందు గారు మరిన్ని మంచి బొమ్మలు వేసి, కీర్తి ప్రతిష్టలు సంపాదించి, విజయ శిఖరాలను అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తోంది - అచ్చంగా తెలుగు.
No comments:
Post a Comment