జీవించలేక - అచ్చంగా తెలుగు
జీవించలేక.....
      భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

నటించి నటించి నటనపై విరక్తి జనించి,
తళుకులీనే తారలొక్కొక్కరే తటాలున రాలిపోతున్నారు.
అశాంతితో కొందరు,ఆవేదనతో కొందరు,
అనారోగ్యంతో కొందరు ,అర్ధాంగి (పోరుపడ)లేక కొందరు,
ఆదుకొనేవారు లేక కొందరు.

ఇలా ఏఒక్కరైనా సరే అవివేకంతోనే
తమ జీవితాలను అంతం చేసుకొంటున్నారు.
భరించటానికే బాధలని, 
వరించటానికే వ్యధలని తెలుసుకోలేక,
ఓర్పుతో జీవించలేక,
జీవితాన్నికడవరకూ దీవించలేక,
భూమాత వొడిలోకి వాలిపోతున్నారు.
సవాళ్ళ నెదుర్కోలేక సోలిపోతున్నారు.

నిజాయితీగా నడవాల్సిన వయసులో నటనతో జీవితం గడిపి,
సవ్యంగా జీవించాల్సిన జీవితాన్ని నటనతో నడిపి,
కొన్నాళ్ళకు అశాంతిపాలై, 
కన్నీటితో జీవితాన్ని గడపలేక అరిగిపోతున్నారు.
జీవించేవారి లిస్టునుండి చెరిగిపోతున్నారు.
 ***

No comments:

Post a Comment

Pages