పరుగు - అచ్చంగా తెలుగు
"పరుగు..."కవిత
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు

ఎంతసేపూ
రాబడి..ఖర్చుల పద్దులేనా?
లావాదేవీల చర్చల్లో సమయం మింగేయడమేనా?
కాగితం, కరెన్సీ, సెల్
ఈ మూడు ముక్కలాటలో మునిగిపోవడమేనా?
అపురూపంగా..ఓ అద్భుత వరంలా పొందిన జీవితాన్ని అందంగా
అనుభూతించక..మనసును మెషిన్ చేసుకోవడమెందుకు?

ఒక్కసారి...
ఆకాశం నుంచి నేలకు జారుతున్న చినుకును
ఆకుపచ్చని కాయతో వంగి ఉన్న చెట్టుకొమ్మను
చూసి ఎంతకాలమైందో ఆలోచించు

పిల్లల అమాయకత్వాన్ని చుంబించి,
పెద్దల అభిమానం పొంది, 
ఎన్నళ్లయిందో గుర్తుతెచ్చుకో.
ఏవిటో ఆ పరుగు 
ఆయాసంతో రొప్పుతూ ఒంటరిగా నేలపై ఒరిగేదాకా
***

No comments:

Post a Comment

Pages