వాళ్లకేమీ తెలియదు పాపం
~~~~~~~~~~~~~~~~~~
- కుంచె చింతాలక్ష్మీనారాయణ.
పొద్దెటుపోతోందో..
పొద్దెటువస్తోందో...
వాళ్లకేమీ తెలియదు పాపం!
ఏతం బావులు పోయే
బోరుబావులొచ్చె
సూర్యనమస్కారం చేసిన
చేత్తో అర్థించాల్సొస్తుందని
చుక్కరాకపోయేనని
వరుణదేవున్ని పూజించాల్సొస్తుందని
పుడమికి ఎన్ని తూ ట్లు పొడిచినా
గుక్కెడైనా నీల్లురావని
వాళ్లకేమీ తెలియదు పాపం!
ఈ సమాజమెటుపోతోందో..
ఈతీరుతెన్నులేంటో..
ఈవింతపోకడలేంటో..
ప్రపంచీకరణ పేరుతో...
రోడ్లవెడల్పుకో చెట్టు
సినిమా షూటింగుకో చెట్టు
సాగుకోసం అడవులు
గనులకోసం కొండలు
పచ్చని ప్రకృతి అంతరించిపోతుంటే..
భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే...
కరెంటు కాలయముడాయె
కరెంటు తీగ యమపాశమాయె
వాళ్లకేమీ తెలియదు పాపం !
వాళ్లకి తెల్సిందల్లా...
దుక్కిదున్నడం
పంట చేల్లోపండించడం
నలుగురికింత అన్నం పెట్టడం
మూగజీవాలను ప్రేమించడం
బిడ్డల నవ్వులకు మురిసిపోడం
సూర్యోదయానికి
జోడెడ్ల బండిలో వెళ్లి
రెక్కలకష్టం చేసి
సూర్యాస్తమయానికి
గూటికి చేరుకోవడం తప్ప
వాళ్లకేమీ తెలియదు పాపం!!
***
No comments:
Post a Comment