వేణుమాధవా! - అచ్చంగా తెలుగు
వేణుమాధవా!
  పెయ్యేటి రంగారావు.

వేణుమాథవా!! నందనందనా!!
మనసుకున్న నయనద్వయముతో
నిన్ను గాంచుటే ఇక మిగిలేనా? 
వ్రేపల్లెకు విరహవేదనా? 
తీరబోని వెతలు మిగిలెనా    ||


వ్రేపల్లెను వీడినావు 
కరకుదనము జూపినావు 
మరచినావొ గోపకాంతల
మరగినావొ రాజ్యకాంక్షను ||


మధురా నగరికి తరలినావే
గద్దె మాన్యమని తలచినావే 
అనుబంధాలను త్రెంచినావే
అమవస నిశిలో ముంచినావే ||


పాడియావుల వదలి వెడలుట 
పాడికాదుర గోపబాలుడా 
వేలు పదారు గోపకాంతల
గోడు వినరా గోవిందుడా ||


తరలి రారా, మరలి రారా 
మాధవా, మానసచోరా 
తాళలేమురా, కరుణ జూపరా 
దనుజహారీ, ఓ మురవైరీ! ||
______________

No comments:

Post a Comment

Pages