నాకు నచ్చిన కథ--చావూ-పుట్టుకా--శ్రీ శ్రీ   - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ--చావూ-పుట్టుకా--శ్రీ శ్రీ  

Share This
నాకు నచ్చిన కథ--చావూ-పుట్టుకా--శ్రీ శ్రీ  
శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి )


శ్రీ శ్రీ గారు అప్పుడప్పుడూ కొన్ని కథలువ్రాసినప్పటికీ,ఆ కథలన్నీ చాలా గొప్పగా ఉన్నవే కథనం  అద్భుతంగా  ఉంటుంది. ఒక మహాకవి  వ్రాసే కథలోని  కథా వస్తువునుగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.1910 లో ఒక సూర్యోదయాన విశాఖపట్నంలో ఉదయించిన ఈ సూర్యుడు, 1983 లో  ఒకసాయం  సంధ్య వేళ మద్రాసులోఅస్తమించాడు.సముద్రపు ఒడ్డున పుట్టిన ఈమహాకవి సముద్రపు ఒడ్డునేమరణించాడు.ఆయన జీవితం,కవిత్వం కూడాసముద్రమంతటి గంభీరమైనవి.ఆయన ఆత్మచరిత్రలో ఆయనేఅంటారు,సముద్రానికీ,ఆయన  జీవితానికీవిడదీయరాని సంబంధం ఉందని.అందుకనేవారి కవిత్వంలో 'తిరిగి, తిరిగి,తిరిగి సముద్రాల్ జల ప్రళయ నాట్యంచేస్తున్నవి'ఆయన కవితాక్షరాలు 'పోటెత్తినసప్త సముద్రాల్'.నిరంతరం ఘోషించేసముద్రమంత లోతైనదీ,గంభీరమైనది ఆయనకవిత్వం.ఆకాశమంత ఎత్తున్న ఆ మనిషినిమరగుజ్జు లాంటి మనం ఏ విధంగాచెప్పగలం?ఒక  మహాకవికి  నివాళిగా, నీరాజనంగా, ఆయన వ్రాసిన చివరి కథనుచెబుతున్నాను యధాతధంగా! 
చనిపోయేముందు ఆయన 'విప్లవ రచయితల  సంఘం' యొక్క  అధ్యక్షుడిగా  ఉన్నారు. నక్సల్బరీ ఉద్యమాన్ని సమర్ధించారు. వారు చేసే సాయుధ పోరాటాలను  కూడా సమర్ధించారు. ఆ పోరాటాలను  సమర్ధిస్తూ వ్రాసిన ఈ  కథ,వారు  వ్రాసిన చివరి కథగాచెప్పుకోవచ్చును.
ఈ కథ'అరుణతార' అనేత్రైమాసిక పత్రికలో ,Oct 1978 --Jan 1979 వ సంచికలో  ప్రచురించపడ్డది. 
********
అదో ఊరు.ఆ వూళ్ళో ఒక ఆసుపత్రి.
ఇదో ఊరు.ఈ ఊళ్ళో ఒక పోలీసు స్టేషన్.
ఆ ఊళ్ళో.ఈ ఊళ్ళో ఆంధ్రదేశం అంతటా అదిఅర్ధరాత్రి!
ఆసుపత్రికి నొప్పులు పడుతున్న ఒకగర్భవతిని తీసుకువచ్చారు.
ఆమె వయసు నలభై.
పోలీసు స్టేషన్ కు బేడీలు వేసిన ఒక కుర్రవాణ్ణితీసుకొచ్చారు.అతని వయస్సు ఇరవై.
గర్భిణి బాధ పడుతోంది.ఏడుస్తోంది.
కుర్రవాడు బాధ పడుతున్నాడు. కానీ, నవ్వుతూ ఉన్నాడు.
ఆసుపత్రిలో వైద్యులు ఆశాజనకంగామాట్లాడుతున్నారు.
స్టేషన్ లో పోలీసులు కారుకూతలుకూస్తున్నారు.
'నీకేం భయం లేదమ్మా!కేసు కొంచెంకఠినమైనదే!కానీ ప్రమాదం ఏమీ లేదు.'
'లంజకొడకా! మావో పుస్తకాలుచదువుతావూ? లోకాన్ని మరామత్తుచేస్తావూ?
ముందు నిన్ను హజామత్తు చేస్తాం జాగ్రత్త!'
వైద్యులు శస్త్ర చికిత్సకు ఉపక్రమించారు.
పోలీసులు కత్తులూ,కటార్లూ నూరుతున్నారు.
రెండు చోట్లా హింసా ప్రయోగమే జరిగింది.
కానీ సూర్యోదయంలో అక్కడ ఆసుపత్రిలో ఒకజననం!
ఇక్కడ తెల్లారగానే 
పోలీసు స్టేషన్ లో ఒక మరణం.

*******
                               
19 వాక్యాల్లో వ్రాసిన ఈ కథను కవితఅందామా, లేక కథ అందామా?

 మహాకవికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
***

2 comments:

  1. రెండు చోట్లా హింసే.. ఒక చోట జననం..ఒక చోట మరణం.అద్భుతం...మన చర్యల పర్యవసానం..ఆలోచించగల విజ్ఞత లేక ..చంప టానికి తెగ బడతాం..అనే ..రాక్షసులు..ఉన్న చోట చావులకు లోటేమిటి.. కానీ ఈ చిన్న కధలో జనన మరణాల లో వుండే హింస..యాతన బాగా వ్యక్తీకరింపఁ బడింది.చక్కని కథను పరిచయం చేసారు సర్. కవి కి శ్రద్ధాంజలి.మీకు అభివాద ములు సర్

    ReplyDelete
  2. రెండు చోట్లా హింసే.. ఒక చోట జననం..ఒక చోట మరణం.అద్భుతం...మన చర్యల పర్యవసానం..ఆలోచించగల విజ్ఞత లేక ..చంప టానికి తెగ బడతాం..అనే ..రాక్షసులు..ఉన్న చోట చావులకు లోటేమిటి.. కానీ ఈ చిన్న కధలో జనన మరణాల లో వుండే హింస..యాతన బాగా వ్యక్తీకరింపఁ బడింది.చక్కని కథను పరిచయం చేసారు సర్. కవి కి శ్రద్ధాంజలి.మీకు అభివాద ములు సర్

    ReplyDelete

Pages