నిన్నేనా? - అచ్చంగా తెలుగు
నిన్నేనా?
- హరీష్ గొర్లె
చిత్రం: చిత్రకారులు మార్లపుడి ఉదయ్ కుమార్ 

రంగు రంగు పూలన్ని
తేనెల గాలులతో పలకరించేది నిన్నేనా..??

సీతకొకచిలుక అడుగులకి ఊగుతూ
వయ్యారి కుసుమ నయనాలు
కన్నుగీటేది నిన్నేనా అందమా.. ??


గాలిలోని హిమం
రవిగుప్పెట్లో కరిగి ముత్యలుగా
నీకై వాలుతున్నాయి..

ఆకుల కొమ్మల సందులనుండి 
వంగి వంగి కిరణాలు
నీ ఆ వెండి పట్టిపై వాలి
మేరుస్తూ.. మురుస్తూ..
ఏమిటో వింత చేష్టలు?


నీరు మేఘమై మారుతూ
లేనిరెక్కలతో ఎగురుతూ
నీటి బుడగల కన్నుల్లో
రంగుల వర్ణాలన్ని 
నీమేనుపై గంధాలు పూయునట్లు

ఇన్ని వింతలూ
నీ అందానికే వేలసినట్లూ.. 
నీనవ్వులై విరిసినట్లు..
ప్రపంచమే అందమై 
నీకొసం నడిచి వస్తుంది...

***

1 comment:

  1. Thank you soo much Padmini madam..
    I really thankfull uday kumar garu.. wonderful painting... Thankq soo much...

    ReplyDelete

Pages