నువ్వు చేసుకున్నదే!
పారనంది శాంతకుమారి
నువ్వుచేసిన మంచే
దైవమై నిన్నురక్షిస్తుంది
నువ్వుచేసిన చెడే
దయ్యమై నిన్నుశిక్షిస్తుంది
నువ్వుచూసిన దృశ్యమే
నీఎదచేరి నిన్ను మోహిస్తుంది.
నువ్వుకోరిన కోరికే
నీదరిచేరి నిన్ను దహిస్తుంది.
నువ్వుపన్నిన కుట్రే
పెట్రేగి నిన్నుదగాచేస్తుంది.
నువ్వుచేసిన సంకల్పమే
సాకారమై నిన్ను స్పందిస్తుంది.
నీఆలోచనే నీముందు ఆకారమౌతుంది.
నీమోహమే నీజీవితాన్ని మలుపుతిప్పుతుంది
నీఅత్యాశే నీకు అలుపునందిస్తుంది.
నీఅహంకారమే నీకుఆనందాన్ని దూరంచేస్తుంది.
నీపరితాపమే నీ ప్రశాంతతని దగ్ధంచేస్తుంది.
***
No comments:
Post a Comment