మా బాపట్ల కధలు -19
పిల్లిగడ్డం సాయెబు
భావరాజు పద్మిని
“పిల్లిగడ్డం సాయెబు గాలూ ! “
తలొంచుకుని బట్టలు కుడుతున్న సాయెబు చప్పున చూసి ఫక్కున నవ్వాడు. ఎదురుగా బొద్దుగా, ముద్దుగా ఉన్న చిన్న పాప.
“ఎందుకు నవుతాలు? మా బామ్మ అలాగే పిలుత్తుందిగా ! అలా నవ్వుతే మీ గడ్డం కూడా నవ్వుతోంది, ఏంటో ?”
“హ హ హ ...”
“మా పలికిణీలు కుట్టేసాలా ? మా బామ్మ అడిగి లమ్మంది.” దబాయిస్తూ అడిగిందో చిన్ని పాప.
“హ. హ. హ. లేదు బేటీ ! రేపు సాయంకాలం ఇచ్చేస్తా.” ఆ పాప పిలుపుకు నవ్వుతూ అన్నాడు సాయెబు.
“సలేలే. ఎల్లుండేగా క్లిష్ణాష్టమి పండుగ. నేను గోపికల వేతం వెయ్యాలి కూడానూ. మలివ్వకపొతే మేమేం వేతుకోవాలి? చెప్పూ, మాటాడవే ?”
“ఇచ్చేస్తా బేటీ ! రేపు మీ ఇంటికే తెచ్చిస్తానని బామ్మతో చెప్పు. బంగారు తల్లివి కదూ !”
“తలేలే ! రాప్పోతే మల్లీ నేనోత్తా. జాగలత్త!” మాట పూర్తి చెయ్యకుండానే ఆరిందాలా హెచ్చరించి తుర్రుమంది ఆ చిట్టిపాప.
బొద్దుగా ఉన్న ఆ పాప ముద్దుముద్దు మాటలకు నవ్వుకుంటూ, మళ్ళీ పనిభారం తల్చుకుని కుట్టడంలో పడ్డాడు సాయెబు. శిఖరం వారి వీధి నుంచి మసీదు రోడ్డుకు వెళ్ళే అడ్డరోడ్డులో మూల మీద ఉండేది, బడ్డీ కొట్టు లాంటి పిల్లిగడ్డం సాయెబు టైలరింగ్ దుకాణం.
బ్రతుకుతెరువు కోసం కుట్టడం నేర్చుకున్నాకా మొదట్లో ఎవరూ అతనికి బట్టలు ఇచ్చేవారు కాదు. ఆ రోజుల్లో పట్టింపులు ఎక్కువ ఉండేవి. “బట్టాల్ కుడతాం, బట్టాల్ కుడతాం” అని అరుస్తూ ఇల్లిల్లూ తిరిగి అడుగుతూ ఉండగా మాయాబజార్ వింజమూరి వారి వీధిలో ఉండే సుందరమ్మ గారు “మా ఇంట్లో మిషనుంది , వసారాలో మా మనవరాలికి కాటన్ గౌన్లు కుట్టి పెడతావా?” అని అడిగారు.
వచ్చిన ఒక్క అవకాశం ఉపయోగించుకోవాలనుకుని, సరేనని చెప్పి, అక్కడే కుట్టడం మొదలుపెట్టాడు అతను. ఆ నోటా ఈ నోటా నెమ్మదిగా సాయెబు పేరు పాకింది. సాయెబు అసలు పేరు ఆలంగ్విర్. కాని, ఈ పేరు నోరు తిరగని సుందరమ్మ గారు, అతని పిల్లిగడ్డం చూసి, ‘పిల్లిగడ్డం సాయెబు’ అని పిలవసాగింది. క్రమంగా అదే పేరు స్థిరపడిపోయింది.
చెప్పిన టైం కి బట్టలు కుట్టేసి ఇవ్వడం వల్ల క్రమంగా అతనికి బేరాలు ఎక్కువ కాసాగాయి. కొలతలు తీసుకోకుండా మనిషిని చూసి, బట్టలు కుట్టడంలో సాయెబు నిపుణుడని పేరు తెచ్చుకున్నాడు. ఇల్లిల్లూ తిరిగే సమయం లేకపోవడంతో రేకులతో చిన్న బడ్డీ కొట్టు నిర్మించుకున్నాడు సాయెబు.
‘కనీసం బక్రీద్ కన్నా దీన్ని కుట్టుకుని వేసుకోవాలి.’ అతని మనసులో ఆలోచనలు.
‘ఊరందరికీ బట్టలు కుట్టే దానికి ఔతది, కాని నీకీ నువ్వు ఒక్క లాల్చీ సిలాయి నై కర్ సకతా ?’ అంటూ అప్పటినుంచి సతాయిస్తోంది అతని భార్య బీబీ.
మామూలుగా శ్రీరామనవమి నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు పండుగల రద్దీ తక్కువే ఉంటుంది. ఈ మధ్య కాలంలో దీన్ని కుట్టుకుని, రంజాన్ పండక్కు తొడుక్కోవాలని గత ఆరు నెలలుగా అనుకున్నాడు. కానీ, బట్టల రద్దీ వల్ల కుదరలేదు. కనీసం ఇంకో వారం రోజులలో రాబోయే బక్రీద్ కైనా ఎలాగైనా కుట్టి వేసుకోవాలి, అనుకున్నాడు.
సిల్కు గుడ్డను మళ్ళీ పెట్టెలో భద్రంగా దాచేసుకుని, కొట్టుకు గడియ వేసి, కుట్టిన బట్టలు ఇవ్వడానికి దగ్గరలో ఉన్న నాళం వారి ఇంటికి బయలుదేరాడు.
దార్లోనే ఎదురైంది హుక్సులూ, కాజాలు, వాలుకుట్టు కుట్టి, తనకు సాయం చేసిపెట్టే జోగులాంబ. పాపం పేదది, ఏదో కాస్త ఆధారం కోసం అడిగితే కాదనలేక పనిచ్చాడు.
“కుట్టిన జాకెట్లు కొట్లో పెట్టి, జావో. మై కపడే దేకే ఆతా, గొళ్ళెం ఒక్కటే పెట్టాను. జాగ్రత్త.” గబగబా చెప్పేసి, వెళ్ళిపోయాడు. తాను నిలదొక్కుకోడమే కాదు, నెమ్మదిగా ఇటువంటి వారికీ ఆధారం కల్పించగలుగుతున్నందుకు తృప్తిగా అనిపించింది అతనికి.
అనుకున్న సమయం కంటే వాళ్ళింట్లో బట్టలు తీసుకుని, డబ్బులు ఇప్పించడానికి ఆలస్యం అయ్యింది. సాయెబు తిరిగొచ్చేసరికి తన కొట్టు తీసే ఉంది. కొట్టు దగ్గర నర్రాల శెట్టి పాలెంలో ఉండే చంద్రం ఎదురు చూస్తున్నాడు. చాలాకాలంగా అతను పరిచయమే.
“కంగారులో గొళ్ళెం పెట్టడం మర్చిపోయిందేమో “ అనుకుని, ఓ పక్కగా పెట్టిన జాకెట్లు లెక్క చూసుకుని, “కైసే ఆనా హువా బేటా ? కుచ్ కాం థా క్యా ?” అని పలకరించాడు. పెద్ద చదువులు చదివిన చంద్రంతో హిందీ లోనే మాట్లాడతాడు సాయెబు.
“మా అమ్మాయి సవత్త ఆడింది కాకా. నువ్వింటికొచ్చి, ఓసారి చూసి, వెంటనే బట్టలు కుట్టాలి. మాది పెద్ద కుటుంబం. ఇంటిల్లిపాదికీ ఇదొక్కటే ఆడపిల్ల. అందుకే అత్తలు, మేనమామలు, బాబాయ్ లు, పెదనాన్నలు, పిన్నులు అందరి తరఫున బట్టలు కుట్టించమని వాళ్ళ బామ్మ ముచ్చట పడుతోంది. అన్నీ కలిపి సుమారు పది జతలౌతాయి. నువ్వింటికి వచ్చి పిల్లని చూసి, పరికిణీ ఓణి కి ఎంత బట్ట కావాలో చెప్తే, రేపు ఉదయం మన బట్టల సత్యం కొట్లో పట్టుబట్టలు తీసుకొచ్చి ఇస్తాను. ఐదో రోజుకి అంతా ఊళ్ళ నుంచి దిగుతారు. పిల్లలకి అట్ల బంతి పెడుతున్నాము. అందుకే నాలుగు రోజుల్లో ఈ పది జతలూ కుట్టివ్వాలి కాకా. హడావిడికి నాకు కాళ్ళు చేతులూ ఆడటం లేదు. చాలా పన్లున్నాయి. నువ్వు కాదంటే నాకిక దిక్కులేదు.” సాయెబు చేతులు పట్టుకు బ్రతిమాలాడు చంద్రం.
“పరేషాన్ కైకు బేటా, మై హూన్ నా, అల్లా భలా కరేగా, సబ్ హో జాయేగా “ అంటూ ఊరడించి, కొట్టుకు తాళం వేసి అతనితో బయలుదేరాడు సాయెబు. తిరిగొచ్చే వేళకు చీకటి పడిపోయింది. కొట్లో ఉన్న బట్టలు కాసిని ఇంట్లో కుట్టేందుకు తీసుకునేందుకు తన మూలపెట్టె తెరిచాడు.
అంతే, ఒక్కసారిగా గుండె గుభేలు మంది. తను పదిలంగా దాచుకున్న సిల్కు గుడ్డ లేదు. సాయెబు ఆలోచనలు అనేక విధాలుగా పోయాయి. జోగులాంబ తీసి ఉంటుందా? వెంటనే తన చిన్నతనంలో తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అతనికి, “చూడు బేటా? ఏదైనా పోయినప్పుడు అందరినీ అనుమానిస్తాము, ఒక్కోసారి ఆ బాధలో అనుమానించిన వాళ్ళను నిందిస్తాము, శపిస్తాము కూడా. కాని, మన వస్తువు మనకు దొరికాకా, మనం తిట్టిన తిట్లను వెనక్కి తీసుకోలేము కదా. పైగా అమాయకుల్ని తిట్టిన పాపం ఖుదా క్షమించడు. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కాని, నోరు జారితే తీసుకోలేమని అంటారు. అందుకే వస్తువుల కంటే, మనుషులు విలువైన వాళ్ళని మర్చిపోకు. కోపంలో తొందరపడి ఎప్పుడూ నోరు జారకు.”
ఛ, ఛ జోగులాంబ అలాంటిది కాదు. మరి తనోచ్చే సరికి కొట్టు తీసి ఉంది కదా ! ఎందుకని? వేరే ఎవరైనా వచ్చుంటారా? కాని, తనోచ్చే వేళకు చంద్రం ఉన్నాడు కదా. ఏ వస్తువూ ముట్టుకునే అవసరం లేని జమీందార్లు వాళ్ళు. అసలు ఎవరు తీసుంటారు? ఎవర్ని అడగాలి? నీరసంగా అక్కడే కూలబడ్డాడు సాయెబు.
‘పొతే పోయింది. వో మేరే నసీబ్ మే నహి హాయ్. దీని కోసం ఎవరి మనసూ కష్టపెట్ట కూడదు. అంతే కాదు, తన బీబీ కి తెలిస్తే దిగులు పడిపోతుంది. తనకీ చెప్పకూడదు.’ తీర్మానించుకుని, ఇంటికి బయలుదేరాడు.
ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అలాగే దొర్లుతూ ఉన్నాడు. “క్యా హువా? “ అడిగింది బీబీ. “కుచ్ నై, నువ్వు పడుకో, నాకు పనుంది” అంటూ ఇంటికి తెచ్చుకున్న బట్టలు కుట్టుకుని, తెల్లారట్ట కునుకు తీసాడు.
కొట్టుకు వచ్చేసరికి పది దాటింది. పట్టు బట్టలతో చంద్రం అక్కడ సిద్ధంగా ఉన్నాడు.
“కాకా, పైసా కిత్నా భీ లేనా? కాని పాప పరికీణీలు అందరూ చూస్తూ ఉండిపోవాలి. అంత బాగా కుట్టాలి సరేనా? చల్తా హున్ ” చెప్పి వెళ్ళిపోయాడు చంద్రం.
ముందే ఒప్పుకున్న బట్టలు చాలా ఉన్నాయి. వాటికి తోడూ ఈ పరికిణీలు, ఇక ఆలోచనలు కట్టిపెట్టి, పనిలో పడ్డాడు సాయెబు .
చూస్తుండగానే నాలుగు రోజులూ గడిచిపోయాయి. పగలూ, రాత్రి పనిచేసాడు సాయెబు. పరికిణీలు, మిగతా బట్టలు అన్న సమయానికి ఇచ్చేసి, ఆనందంగా వాళ్ళిచ్చిన రెట్టింపు డబ్బులు తీసుకుని వచ్చాడు.
“బీబీ ! చలో కల్ చీరాలా జాకే సాడీ ఖరీద్తే. బచ్చోన్ కో భీ కపడే లేంగే “ అంటూ భార్యను బయలుదేరదీసాడు. ఏదైనా పెద్ద ఎత్తున బట్టలు కొనే పనుంటే చీరాల వెళ్ళే అలవాటు మా బాపట్ల వాళ్లకి.
మర్నాడు చీరాలలో ఇంటిల్లిపాదికీ బట్టలూ, మిఠాయిలూ కొని, దర్బార్ రోడ్ లో ఉన్న సంగం థియేటర్ లో సినిమా చూసి, హోటల్ లో భోజనం చేసి, సాయంకాలం సముద్రం ఒడ్డుకు పిల్లల్ని తీసుకెళ్ళి, ఇంటికి చేరే సరికి రాత్రయింది.
ఎక్కడికి వెళ్ళినా, ఎంత మర్చిపోదామన్నా సిల్కు లాల్చీ గుడ్డ సంగతి మనసులో తొలుస్తూనే ఉంది సాయెబుకు. అది పోయాకా తనకు బట్టల మీద శ్రద్దే పోయింది అతనికి. మర్నాడే బక్రీద్. కలవరంగా ఉన్న మనసుతో అలాగే దొర్లుతూ నిద్రపోయాడు.
బక్రీద్ నాడు ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు జరుపేందుకు కుటుంబమంతా ఆనందంగా తయారౌతూ ఉన్నారు.
“అవునూ. సబ్కో కపడే లియా. మరి నీకీ కొన్లేదు. ఆజ్ క్యా పెహెంతే? లాల్చీ కుట్టి తెచ్చావా? తీసి వేస్కో” అంది బీబీ.
ఒక్కసారి నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది సాయెబుకు. సంభాళించుకుని,”నై నై, సిలాయి నై హువా రే. నాకీ బట్టాల్ భూల్ గయా. కుచ్ పురానా పెహెన్ లూంగా “ చెప్పాడు నిస్తేజంగా.
“ఠీక్ హాయ్. నీకీ కుట్టనికి టైం లేదని నాకీ తెల్సు. యెహ్ దేఖో, అపనే రహీం నే ఆప్ కే లియే సిలాయి కియా... పెహెన్ లో...” అంటూ అతని చేతిలో ఒక కాగితం కవరు పెట్టింది బీబీ.
అది విప్పి చూసిన సాయెబు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పోయిందనుకున్న తన సిల్కు గుడ్డతో చక్కగా కుట్టిన లాల్చీ అది. జేబు మీద అందంగా చేతిపనితో కుట్టిన ఎర్ర గులాబి ఉంది.
“ అప్నే రహీం సిలాయి సీఖ్ రహా నా. మగవాళ్ళ బట్టలు వాడికి బాగా వచ్చినాయ్. పన్లో ఉండడం వల్ల ఇది నీకీ తెలీదు. ‘బాబా కి లాల్చీ మై సిలాయి కరూంగా మా’ అని అడిగాడు. నువ్వు కొట్లో లేనప్పుడు చూసి, ఖామోష్ గా తెచ్చినా. ఎన్నాళ్ళని అట్లా పెట్టుకు సూస్కుంటావు ?అందుకే నీకీ తాజ్జుబ్ చేద్దామని మేమంతా అనుకున్నాం. దిల్ దుఖాయా తో మాఫ్ కర్నా,” సాయెబు కళ్ళలోకి చూస్తూ అంది బీబీ.
మెరుస్తున్న ఆమె కళ్ళలో సాయెబుకి ఈద్ కా చాంద్ కనిపించింది. తను కట్టుకుంటే తనవాళ్ళు అనుభవించే ఆనందం .
“బీబీ, మై కిత్నా ఖుష్ హున్ బతా నహి సక్తా. “ అంటూ ఆనందంతో ఉప్పొంగిపోతూ కొడుకు రహీం ను, భార్య బీబీని కావలించుకున్నాడు సాయెబు.
సిల్కు లాల్చీలో ‘ఈద్ కే చాంద్’ లాగా మెరిసిపోతున్న భర్తను సంబరంగా చూస్తోంది బీబీ. మెరుస్తున్న ఆమె కళ్ళలో నిజమైన ఈద్ కా చాంద్ కనిపించింది సాయెబుకి.
“హే ఖుదా తేరా లాఖ్ లాఖ్ షుకర్ హై. ఆజ్ మేరే జీవన్ మే అసలీ ఈద్ హై,” అంటూ అల్లాకు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు సాయెబు.

***
ఆ రోజు ఎందుకో మూల పెట్టెలో దాచిన గోధుమ రంగు సిల్కు గుడ్డ గుర్తుకొచ్చింది సాయెబుకి. దాన్నొకసారి బయటకు తీసి, మెల్లిగా చేత్తో తడిమి చూసుకున్నాడు. కువైట్ లో ఉన్న తన తమ్ముడు మక్కా వెళ్ళినప్పుడు, అక్కడినుంచి తనకోసం ప్రేమతో తెచ్చిన ఖరీదైన సిల్కు గుడ్డ అది. లాల్చీ పైజమా కుట్టుకుని, ఈద్ కి వేసుకోవాలని అపురూపంగా దాచుకున్నాడు.‘కనీసం బక్రీద్ కన్నా దీన్ని కుట్టుకుని వేసుకోవాలి.’ అతని మనసులో ఆలోచనలు.

No comments:
Post a Comment