కిసుక్కున నవ్వండి! - అచ్చంగా తెలుగు
కిసుక్కున నవ్వండి!
(పాత్రలు మనవే( కావచ్చు, అందుకే పేర్లు పెట్టలేదోచ్)
 ప్రతాప వెంకట సుబ్బారాయుడు

"ఆ గ్రూప్ ఫోటోలో ఒకతని ముఖం మీద తెల్ల రంగు వేసి ఉందేమిట్రా?"
"అదా..జీవితంలో అతని ముఖం చూడకూడదనుకున్నాను"
*****
"టెక్నలజీ వల్ల పెద్దగా మీకేమీ ఒరగలేదా? అదేంటి?"
"అంతకు ముందు మా ఆవిడ రచనలు పెన్నుతో రాసి ఫెయిర్ చేసే వాడిని, ఇప్పుడు డీ టీ పి చేస్తున్నాను"
*****
"ఆ సుబ్బారావు అడిగిన వాడికల్లా అప్పిస్తాడే..నీకు ఇవ్వలేదా? నువ్వేమని అడిగావ్"
"అప్పిచ్చి సహాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటానన్నాను"
*****
"నా చేత వంటింట్లో ప్రయోగాలు చేయించి, నువ్వు ఆ వంటలు ఛానెల్ టీ వీ లో చూపించి చప్పట్లు కొట్టించుకోవడం అంత సబబుగా లేదు కనకం"
*****
"అంతర్జాలం వల్ల నీకు డబ్బు ఆదా అవుతోందా? అదెలా"
"మా ఆవిడ రచయిత్రి కదా, ఇంతకుముందు కాగితాలకు, కవర్లకు, స్టాంపులకు బోలెడు కర్చయేది. ఇప్పుడు అంతర్జాల పత్రికల్లో రాస్తోంది."
*****
"అరచేతిలో ఇమిడిపోయే సెల్ అనే పరికరం, దాన్లో అనేక సోషల్ మీడియా యాప్ లు వచ్చాక మా ఆవిడ ఎంచక్కా ఇరుగు పొరుగమ్మలతో మాట్లాడడం లేదు. కాఫీ పొడి, కారం ఇత్యాది వాటి కోసం ఎవరూ మా ఇంటికి రావడం లేదు."
*****


No comments:

Post a Comment

Pages