నీకు నీడ అయి నిలుస్తుంది....! - అచ్చంగా తెలుగు

నీకు నీడ అయి నిలుస్తుంది....!

Share This

నీకు నీడ అయి నిలుస్తుంది....!
సుజాత తిమ్మన..
93 91 34 10 29 ...


ప్రేమించా అంటాడు...

వెనకెనకే పడతాడు...
పెళ్లి చేసుకుంటాడు...
భర్త అవుతాడు..
ముచ్చటగా మూడు నిద్రలు అయినాక..
ఒసేయ్..ఏమేయ్....అంటూ..
ఇంటికి పనిమనిషిని చేస్తాడు...
ఒక్కో ఆశను నెల రాసి..
పచ్చగా ఉంటుందనుకున్న కాపురాన్ని..
తన అహంకారంతో బీడు భూమి చేస్తాడు...


నగరాలను అభివృద్ధి చెయ్యాలంటూ...

ఎన్నో ఏళ్ల నాటి వృక్షాలను మొదలికంటా నరికివేస్తూ...
అరణ్యాలను అద్దాలపెట్టేలో చూపించుకోమంటున్నారు...


అవహేళనాకు గురి అయిన స్త్రీ...

ప్రేమామృతాన్ని పంచుతూ ఇంటిని స్వర్గం చేసే స్త్రీ..
చచ్చిన మనసుతో...మృతమై...తిరుగుతుంది స్తబ్దుగా...


అవసరం అనే స్వార్ధానికి బలి అయిన వృక్షం..

ప్రణవాయువులనందిస్తూ...జీవాదారమైన వృక్షం..
మరుభూమిని తలపించే అడవులనే నెలలో మోడుగ మిగిలింది..


చిటికెడు ప్రేమ తిలకం నుదుటన దిద్దితే..స్త్రీ..

వెన్నై కరిగి...వెన్నలలా నిన్ను తడిపేస్తుంది...

గింజ నాటి రోజు.... చొంబు నీళ్ళు పోస్తే..చిన్న మొలక..

పెరిగి పెద్దదై ...పుష్పం ..ఫలమే కాదు ..నీకు నీడ అయి నిలుస్తుంది..

అందుకే స్త్రీ ....మూర్తి అయి ..వృక్షాన్ని తలపిస్తుంది...!!
అందుకే వృక్షంలో అమ్మతనం కనిపిస్తుంది...!!



******  

2 comments:

  1. Chala bavundandi sujata garu... Yenno Hrudayalaki spandana me kavita abhinandanalandi

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి..మీ అమూల్యమయిన స్పందనకు...

      Delete

Pages