స్వరమాధురి సంగీతసంస్థ, నవీముంబయిలో తేరణకాలేజి సభాగ్రుహంలో శనివారం 11.11.2017న డా. సి. నారాయణరెడ్డి స్మ్రుత్యర్ధం సినీగీతకుసుమాలతో "ఆరాధన" కార్యక్రమం నిర్వహించారు. స్వరమాధురి గాయనీగాయకులు సినారె రాసిన నాటిమేటిపాటలను ఆలపించి సంగీతప్రియులను అలరించారు. వాద్యకారులు తెలుగువారు కాకపోయినా, అన్ని పాటలకు తమవంతు సహకారం అందించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పండిత్ రామదీక్షితులు స్వరపరచిన" స్త్రోత్రమాల" "మహామ్రుత్యుంజయమంత్రం" " గాయత్రీమంత్రం" సీడీలను ఆవిష్కరించారు. మూర్తి, కల్పనలు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సంస్థకార్యదర్శి రధిని మూర్తిగారి వందనసమర్పణతో ఆరాధన కార్యక్రమం ముగిసింది.
కనువిందు చేసిన శ్రీకృష్ణదేవరాయసభ తెలుగు రాష్త్రాలలోని మేటి అష్టదిగ్గజకవులతో భువనవిజయం (శ్రీక్రుష్ణదేవరాయసభ) శనివారం 11.11.2017న ఆంధ్రఎడ్యుకేషన్సొసైటి, ముంబాయి వారు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అథితిగా విచ్చేసిన ప్రముఖసినీనటుడు డా. రాజేంద్రప్రాసదును సంస్థ కార్యనిర్వాహకసభ్యులు సత్కరించారు. నీతినియమాలతో నిస్వార్ధంగా సంస్థకు సేవలందిస్తున్న కార్యవర్గసభ్యులను ముఖ్యఅతిథి అభినందించారు. వందనసమర్పణతో కొలువుతీరిన శ్రీకృష్ణసభ పరిసమాప్తమయింది.
No comments:
Post a Comment