తెలుగువాడు - భోజన ప్రియుడు - అచ్చంగా తెలుగు

తెలుగువాడు - భోజన ప్రియుడు

Share This
తెలుగువాడు - భోజన ప్రియుడు
ఓరుగంటి సుబ్రహ్మణ్యం 

తెలుగువాడు మంచి భొజన ప్రియుడని వేరే  చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భొజనాలతో పోలిసిస్తే ఎవరికైనా విషయం తెలిసిపొతుంది.  ఆవకాయల రుచుల టీవి తానెరుగును, పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ  ఉత్సహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు.....   వాడెవడని అడిగితే  జబాబు కోసం తడుముకొనే అవసరంలేదు. అందుకే దేశదేశాలల్లొ తెలుగు రుచులు నేడు రాజ్యమేలుతున్నాయి . భక్ష్య , భొజ్య, లేహ్య, చోహ్య పానీయాలకు భొజనంలో భాగం  కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతొనో. మాగాయతొనో గడ్డపెరుగునింత గారబమును చేసి గర్రున  త్రేంచి   ఆ పూటకు భొజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరేవాళ్ళకు చేతకాదు. చేపలను జలపుష్పాలుగా గోంగూరను శాకాంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. 
మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ "వింటే భారతమే వినాలి" అని ఊరుకుంటే తెలుగువాడెందుకౌతాడు. తింటే గారెలే తినాలి అంటూ తన జివ్హచాపల్యన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు అనడం ఒకరి అభిరుచి విషేశం. తేనెపాకంలో నానబెట్టి పాకం గారెలుగా తినడం మరొకరికి ఇష్టం. ఆ సుధారసంబునందు ఊరిన గారెలు ఇచ్చు పరితుష్టికి  పుష్టికి సాటిలేదు ఇలనందు. ఈనాడు కంగాళి  తిళ్ళు వచ్చి తెలుగువాడి తిండి పుష్టి ద్వంసం అయింది.  మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకొంటే మనం  ఎంత అర్భకులమో తెలుస్తోంది. అలా పెట్టి తిని ఆస్తులు కరగదీసిన  జాతి మనది. తరవాణీల బలం కాఫీ టీలకు ఎలా వస్తుంది. కాఫీ, టీల మూలంగా మంట పుట్టిందే తప్ప కడుపులో చల్ల కదలకుండా హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఊరుగాని  ఊరు పోతే ముందస్తుగా మంచి భోజనం పెట్టు పూటకూళ్ళ ఇళ్ళ వేటలో నిగమ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితి 
వండటం వడ్డించడం తినడంలోనే కాదు - ఆరోగ్యం  విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్ఠం. ఇడ్డెనల్ అనేది అటు కవుల ప్రయోగాల్లోను ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెలుగు పదం. పిండిని ఉడకపెట్టి ఆవిరిపై వండే పదార్థాన్నీఇడీ అంటారు.  దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే అది పొట్టిక్కబుట్ట. ఆషాడ మాసపు చివరి రోజుల్లో కదుపులో పేరిగే క్రిముల నివారణకు  పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం. సాధారణ ఇడ్లీకి సాంబారు  చక్కని జత. 'సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ  సుందరీ ఓ సందర్భంలో శ్రీశ్రీ  కవితలో మెరిసింది. ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ  ప్రపంచంలోని ఆహార పదర్థాలన్నింటికన్నా  ఆరోగ్యమైనదని ఇక్యరాజ్య సమితి ప్రకటించింది.  ఇక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం  తెలుగు వాళ్ళకు గర్వకారణం.
***

No comments:

Post a Comment

Pages